Breaking News

ఆ సమస్య వల్ల 5 ఏళ్లుగా పాడటమే మానేశా: స్టార్‌ సింగర్‌

Published on Mon, 04/06/2026 - 12:02

సుజాత మోహన్‌.. సౌత్‌ ఇండస్ట్రీలో పేరుమోసిన గాయని. మలయాళ, తెలుగు, తమిళ, కన్నడతో పాటు హిందీ, మరాఠి భాషల్లోనూ అనేక పాటలు పాడింది. దాదాపు 20 వేల పాటలు ఆలపించింది. టాలీవుడ్‌కు అనేక హిట్స్‌ ఇచ్చింది. అయితే కొంతకాలంగా ఆమె పాటలు పాడటమే మానేసింది. అందుకు గల కారణాన్ని తాజాగా ఓ వేదికపై బయటపెట్టింది.

ఐదేళ్లుగా పాటల్లేవ్‌
సుజాత మోహన్‌ మాట్లాడుతూ.. నేను గొంతు సమస్యతో బాధపడుతున్నాను. దానివల్ల మునుపటిలా పాడలేకపోతున్నాను. అందుకే ఐదేళ్లుగా ఎక్కడా ఒక్క పాట కూడా పాడలేదు అని తెలిపింది. ఇది విని ఆమె అభిమానులు షాకవుతున్నారు. తను త్వరగా కోలుకుని మళ్లీ తన గాత్రంతో అలరించాలని ఆకాంక్షిస్తున్నారు. దీనిపై సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ సోదరి ఏఆర్‌ రెహానా స్పందిస్తూ.. గతంలో సుజాతకు కోరస్‌గా పాడాను. 

గొంతు సమస్య
అప్పుడు ఆమె దగ్గరినుంచి చాలా నేర్చుకున్నాను. తన గొంతు తనకు తిరిగి రావాలని కోరుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న డాక్టర్స్‌ ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేయండి అని కోరింది. కాగా గతంలోనూ సుజాత గొంతు సమస్యతో బాధపడింది. 2010వ దశకంలో మాట్లాడేందుకు సైతం ఇబ్బందిపడింది. మూడేళ్లపాటు తన గొంతును తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. చివరకు మంచి చికిత్స ద్వారా కోలుకుని మళ్లీ పాటలు పాడింది.

పాటలు
సుజాత మోహన్‌ తెలుగులో అనేక హిట్‌ సాంగ్స్‌ పాడింది. తెలుగులో పరువం వానగా, నా చెలి రోజావే.. (రోజా మూవీ), ఓ చెలియా.. (ప్రేమికుడు), రూప్‌ తేరా మస్తానా (రిక్షావోడు), మూసిన ముత్యాలకే.., ఏలే ఏలే మరదలా (అన్నమయ్య).. ఓ వానా పడితే (మెరుపు కలలు), సారీ సారీ (బావగారు బాగున్నారా), పూవుల్లో దాగున్న (జీన్స్‌), అందాల ఆడబొమ్మ (సమరసింహారెడ్డి), చెప్పవే చిరుగాలి (ఒక్కడు) ఇలా అనేకానేక పాటలతో తెలుగు సంగీత ప్రియులను అలరించింది.

చదవండి: మంచివాళ్లకే మంచివాడిని.. నావాళ్ల జోలికొచ్చారంటే: పవన్‌

Videos

ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకున్నాడు చంపేశాడు

తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం

శత్రుదేశంలో ఉన్న పైలట్ ను ఎలా కాపాడారు.. ఎన్ని ఆయుధాలు వాడారంటే

RBI బంపర్ ఆఫర్.. బ్యాంక్ ఎఫ్ డీలకు మించి వడ్డీ..!

జీతంలో కోత పంచాయతీ కార్యదర్శులకు బిగ్ షాక్

పలాసలో ఘోర రోడ్డు ప్రమాదం లారీని ఢీకొట్టిన ఇన్నోవా

రంగులు మార్చి గృహ ప్రవేశాలు చంద్రబాబు ఖాతాలోకి టిడ్కో ఇళ్లు

జగన్ పెట్టిన "GUN" అందుకే బాబు గుండెల్లో దడ...

భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

అసెంబ్లీలోకి దూసుకెళ్లిన కారు, స్పీకర్ కారుపై ఇంక్ చల్లి పారిపోయిన దుండగులు

Photos

+5

శోభితలో ఈ టాలెంట్‌ కూడా ఉందా! (ఫోటోలు)

+5

అప్పుడే ఏడేళ్లు.. ఎంత త్వరగా ఎదుగుతున్నావో!: లాస్య మంజునాథ్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా 'లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఉప్పల్‌ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)

+5

శేష్‌-మృణాల్‌ ‘డెకాయిట్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. రష్మిక చిన్నప్పటి క్యూట్‌ ఫోటోలు

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 05-12)

+5

ఉప్పల్‌లో క్రికెట్‌ ఉత్సాహం (ఫొటోలు)

+5

చిరు, దిల్‌రాజు భార్యలు అతిథులుగా కొత్త సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)