ఇక అమెరికా పనైపోయింది..? ఈ యుద్ధం ఆగదు..
Breaking News
యాప్ చెప్పిందని బ్రేకప్.. ఫన్నీగా LIK ట్రైలర్
Published on Sat, 04/04/2026 - 19:55
డ్యూడ్, డ్రాగన్, లవ్ టుడే సినిమాలతో హ్యాట్రిక్ సక్సెస్‌లు అందుకున్న తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్.. తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతడు నటించిన లేటెస్ట్ మూవీ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'(Lik). కృతి శెట్టి హీరోయిన్ కాగా విఘ్నేశ్ శివన్ దర్శకుడు. నయనతార ఓ నిర్మాత. రాబోయే శుక్రవారం(ఏప్రిల్ 10) మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా వైష్ణవిని పెళ్లి చేసుకున్న షన్ను.. ఫొటోలు వైరల్)
ట్రైలర్ బట్టి చూస్తే సమ్‌థింగ్ ఇంట్రెస్టింగ్ అనేలా ఉంది. అది 2040. ప్రేమకు కూడా ఇన్సూరెన్స్ ఉండాలన, Lik అనే యాప్‌ని సృష్టిస్తారు. ఈ కంపెనీకి ఓనర్ (ఎస్జే సూర్య). ఈ యాప్‌లో వాయిస్ ఆర్టిస్టుగా పనిచేసే వైబ్ వాసు (ప్రదీప్ రంగనాథన్).. దీన్ని అసలు నమ్మడు. ప్రేమంటే మనసులో నుంచి పుట్టాలని అనుకుంటాడు. అందుకు తగ్గట్లే ధీమా(కృతిశెట్టి) అనే అమ్మాయిని కలుస్తాడు. కానీ ఆమె ఏమో చిన్నప్పటి నుంచి ఫోన్‌ని చూస్తూ పెరుగుతుంది. ఏ పనైనా ఫోన్‌తోనే చేస్తుంది. చివరకు ప్రేమని కూడా ఫోన్‌లోని Lik యాప్ ద్వారానే వెతుక్కుంటుంది. అయితే ఈ యాప్ చెప్పిందని హీరోకి బ్రేకప్ చెప్పేస్తుంది. మరి చివరకు హీరోహీరోయిన్ ఎలా కలిశారు అనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఇండస్ట్రీ టాప్ స్టార్స్ నటించిన సినిమా.. ట్రైలర్ రిలీజ్)
Tags : 1