Breaking News

అప్పుడు దెయ్యంగా.. ఇప్పుడు రొమాంటిక్ సినిమాలో

Published on Fri, 04/03/2026 - 15:44

తెలుగమ్మాయిలకు హీరోయిన్‌గా అవకాశాలు రావట్లేదని ఒకప్పుడు అనేవారు. కానీ రీసెంట్ టైంలో ఈషా రెబ్బా, అనన్య నాగళ్ల, వైష్ణవి చైతన్య తదితరులు అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉన్నారు. 'మసూద' చిత్రంలో దెయ్యం పాత్రలో మెప్పించిన ఓ నటికి ఇప్పుడు హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. ఆ చిత్రాన్ని శుక్రవారం లాంఛనంగా మొదలుపెట్టారు.

(ఇదీ చదవండి: గుడ్‌న్యూస్‌ చెప్పిన బండ్ల గణేశ్‌.. త్వరలో కూతురి పెళ్లి)

గతేడాది చివరలో 'శంబాల' అనే థ్రిల్లర్ మూవీతో చాన్నాళ్ల తర్వాత హిట్ కొట్టిన ఆది సాయికుమార్.. ఇప్పుడు 'సైరాభాను' అనే ఓ రొమాంటిక్ ప్రేమకథా సినిమాలో నటించేందుకు సిద్ధమైపోయాడు. రాజేశ్ దండా నిర్మిస్తున్న ఈ మూవీ తాజాగా ప్రారంభమైంది. హీరో కిరణ్ అబ్బవరం క్లాప్ కొట్టాడు. ఇందులో హీరోయిన్‌గా 'మసూద'లో దెయ్యంగా నటించి ఆకట్టుకున్న బాంధవి శ్రీధర్‌ని తీసుకున్నారు.

'మసూద'లో సహాయ నటిగా ఆకట్టుకుని హిట్ కొట్టినప్పటికీ బాంధవి శ్రీధర్‌కి పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ హల్‌చల్ చేసేది. ఇప్పుడు హీరోయిన్‌గా అంటే పెద్ద ఛాన్సే అనే చెప్పొచ్చు. ఈ సినిమా హిందూ-ముస్లిం బ్యాక్‌డ్రాప్‌లో హైదరాబాద్-ఆంధ్రా కనెక్షన్‌తో రొమాంటిక్ కామెడీ కాన్సెప్ట్‌తో రాబోతుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు మిస్టిక్ థ్రిల్లర్.. డైరెక్ట్ స్ట్రీమింగ్)

Videos

థ్యాంక్స్ జైపాల్.. మీకు నా సెల్యూట్.. పేర్ని నాని సెటైర్లు

కోల్ కతా నైట్ రైడర్స్ పై హైదరాబాద్ విజయం

ఒకేసారి 30 వేల మంది అవుట్.. ఒరాకిల్ మాజీ ఉద్యోగి సంచలన విషయాలు

జగన్ మావిగన్.. టీడీపీ ఉక్కిరిబిక్కిరి

గులాబీ రంగులో చంద్రుడు.. ఏదో జరగబోతోంది!

జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర, అనుచరులపై కేసు నమోదు

వీరులు పుట్టకముందే.. రాముడు ఉన్నాడు.. రామాయణం టీజర్ చూస్తే గూస్ బంప్స్ పక్కా

సాఫ్ట్ వేర్ సామ్రాజ్యం కుప్పకూలుతోందా?

చిక్కుల్లో TVK అధినేత హీరో విజయ్..

దళితుడిపై చేయి చేసుకున్న అయ్యన్నపాత్రుడు

Photos

+5

డైరెక్టర్ పోస్టు.. స్పెషల్ ఎట్రాక్షన్‌గా హీరోయిన్ (ఫొటోలు)

+5

'ఇడియట్' రక్షిత బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

క్రీస్తు త్యాగం.. సమస్త మానవాళికీ స్ఫూర్తిదాయకం (ఫొటోలు)

+5

నల్లమల అడవి : తెలంగాణలో జరిగే ఈ సాహస యాత్ర గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఏపీలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ఈ గుహ గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఒంటిమిట్ట : వైభవంగా శ్రీ కోదండ రామస్వామి వారి రథోత్సవం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా హనుమాన్‌ శోభాయాత్ర (ఫోటోలు)

+5

మార్చి జ్ఞాపకాల్లో నిక్కీ గల్రానీ-ఆది పినిశెట్టి జంట (ఫోటోలు)

+5

రూటు మార్చిన శృతి హాసన్‌.. ఈ సారి వయ్యారంగా.. (ఫోటోలు)

+5

సినీ కెరీర్‌.. సంతృప్తిగా లేనంటున్న హీరోయిన్‌ (ఫోటోలు)