Breaking News

‘కార్మేని సెల్వం’ మూవీ రివ్యూ

Published on Thu, 04/02/2026 - 19:57

టైటిల్‌: ‘కార్మేని సెల్వం’
నటీనటులు: సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్
నిర్మాణ సంస్థ: పాత్‌వే ప్రొడక్షన్స్
నిర్మాత:అరుణ్ రంగరాజులు
దర్శకుడు: రామ్‌ చక్రి
సంగీత దర్శకుడు:  ‘మ్యూజిక్ యాజ్ ఎ సర్వీస్’ (MAAS)
సినిమాటోగ్రఫీ: యువరాజ్‌ దక్షణ్‌
ఎడిటింగ్‌: జగన్‌ ఆర్వీ, దినేష్‌ ఎస్‌
విడుదల తేది: ఏప్రిల్‌ 3, 2026

దర్శకుడిగా వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించడమే కాకుండా.. విలక్షణ నటుడిగానూ గుర్తింపు సంపాదించుకున్నాడు సముద్రఖని. ఒక పక్క స్టార్‌ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూనే.. మరోపక్క కంటెంట్‌ ఉన్న సినిమాల్లో లీడ్‌ రోల్‌ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రమే ‘కార్మేని సెల్వం’. రేపు(ఏప్రిల్‌ 3) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం ప్రత్యేక షో వేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
చెన్నైకి చెందిన సెల్వం(సముద్రఖని) ఓ మిడిల్‌ క్లాస్‌ వ్యక్తి. వ్యాపారవేత్త సంపత్‌(గౌతమ్‌ మీనన్‌) దగ్గర డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. భార్య శాంతి(లక్ష్మీ ప్రియా), కొడుకు బాలునే అతని ప్రపంచం. ఉన్నంతలో సంతోషంగా ఉండాలనేది అతని నైజం. బంధువుల ముందు చిన్నచూపు కావొద్దనేది భార్య శాంతి నైజం. ఫంక్షన్‌లో అవమానించారని, పౌరుషంతో ఇంట్లో దాచుకున్న డబ్బుతో పాటు మెడపై ఉన్న పుస్తెల తాడుని సైతం అమ్మి ఆడపడుచు కూతురుకి కానుకగా ఇచ్చేస్తుంది. 

ఓ రోజు కొడుకు తలకు గాయం కావడంతో ఆస్పత్రి ఖర్చులకై సొంత బావ దగ్గర రూ. 10 వేలు అప్పు తీసుకొస్తాడు సెల్వం. ఆ అప్పుని తీర్చేందుకు తన బాసుకు తెలియకుండా ఆయన కారుని టాక్సీలో పెడతాడు. టాక్సీలో ఎక్కినవాళ్ల మాటలు విని..సెల్వంకి డబ్బుపై ఆశ పెరుగుతుంది. ఆ ఆశ తన జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? భార్య, కొడుకుని వదిలేసి.. వేరే దేశం ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చివరకు సెల్వం తిరిగి ఇండియాకు వచ్చాడా? రాలేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

విశ్లేషణ
ఈ సినిమా చివరిల్లో ఒక డైలాగు ఉంటుంది. ‘అవసరం లేనివి కొంటే..అవసరమైనవి కోల్పోతాం’. ఈ ఒక్క డైలాగ్‌తో ఈ కథ ఇచ్చే సందేశం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఉరుకుల పరుగుల జీవితం ఇది. డబ్బుపై ఆశతో ఫ్యామిలీని దూరం పెట్టి.. చిన్న చిన్న సంతోషలను సైతం మిస్‌ చేసుకుంటున్నాం. పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అన్నట్లుగా.. పక్కవాళ్లను చూసి మన స్థాయిని మించి ఖర్చు చేస్తున్నాం. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలే.. ఇలాంటి పనులు చేసే అప్పులపాలు అవుతున్నాయి. కార్మెనీ సెలం సినిమాలో ఇదే చూపించారు. అప్పుల వల్ల మధ్యతరగతి కుటుంబాల సంబంధాలు, వారు తీసుకునే నిర్ణయాలని ఎలా ప్రభావితం అవుతాయి అనేది చాలా  రియలిస్టిక్‌ ఇందులో చూపించారు.  

అయితే ఇలాంటి కథలు తెలుగు తెరకు కొత్తకాదు. మిడిల్‌ క్లాస్‌ కష్టాల నేపథ్యంలో బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాలం నుంచే సినిమాలు వస్తున్నాయి.  కానీ ఇందులో ఇప్పటి మధ్యతరగతి కుటుంబాలు చేస్తున్న తప్పులను చూపించారు. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్‌ వరకు చాలా ఎమోషనల్‌గా కథనం సాగుతుంది. ఫస్టాఫ్‌ మొత్తం మిడిల్‌ క్లాస్‌ కష్టాలను,  సెకండాఫ్‌లో ఆ కష్టాల నుంచి బయటపడేందుకు చేసే అప్పులు, తప్పులను చూపిస్తూ..చివరిలో ఓ మంచి సందేశం అందించారు. 

 ఆడపడచు పిలిచింది కదా అని సంతోషంగా ఫంక్షన్‌కి వెళ్తే.. అక్కడ వాళ్లను అవమానించడం.. అది తట్టుకోలేక దాచుకున్న కొద్ది డబ్బుని కూడా కానుకగా ఇవ్వడం.. అప్పు తీర్చడానికి సెల్వం తొలిసారి తప్పు దారి ఎంచుకున్నప్పటి నుంచి కథనంపై ఆసక్తి పెరుగుతుంది.  ఇతరుల మాటలు విని.. సెల్వం చేసే తప్పులన్నీ మనమో లేదా మన చుట్టు ఉన్నవాళ్లో చేసే ఉంటారు. అందుకే ఆ పాత్రతో కనెక్ట్‌ అయిపోతారు. ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తి పెంచుతుంది. సెకండాఫ్‌ మొత్తం మరింత ఎమోషనల్‌గా సాగుతుంది.  జీవనోపాధి కోసం కుటుంబాలను వదిలి ఇతర దేశాలకు వెళ్లినవాళ్లు, వారి కుటుంబ సభ్యులు ఈ సినిమా చూస్తే వెక్కి వెక్కి ఏడుస్తారు.

సెల్వం పాత్రలో సముద్ర ఖని ఒదిగిపోయాడు. . మధ్యతరగతి భర్తగా, తండ్రిగా తనదైన ఎమోషన్‌ను పండించారు. ఆయన సతీమణిగా లక్ష్మీ ప్రియా తనదైన సహజ నటనతో ఆకట్టుకుంది. అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

రేటింగ్: 2.75/5

Videos

థ్యాంక్స్ జైపాల్.. మీకు నా సెల్యూట్.. పేర్ని నాని సెటైర్లు

కోల్ కతా నైట్ రైడర్స్ పై హైదరాబాద్ విజయం

ఒకేసారి 30 వేల మంది అవుట్.. ఒరాకిల్ మాజీ ఉద్యోగి సంచలన విషయాలు

జగన్ మావిగన్.. టీడీపీ ఉక్కిరిబిక్కిరి

గులాబీ రంగులో చంద్రుడు.. ఏదో జరగబోతోంది!

జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర, అనుచరులపై కేసు నమోదు

వీరులు పుట్టకముందే.. రాముడు ఉన్నాడు.. రామాయణం టీజర్ చూస్తే గూస్ బంప్స్ పక్కా

సాఫ్ట్ వేర్ సామ్రాజ్యం కుప్పకూలుతోందా?

చిక్కుల్లో TVK అధినేత హీరో విజయ్..

దళితుడిపై చేయి చేసుకున్న అయ్యన్నపాత్రుడు

Photos

+5

నేపాల్ ట్రిప్‌లో యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ (ఫొటోలు)

+5

డైరెక్టర్ పోస్టు.. స్పెషల్ ఎట్రాక్షన్‌గా హీరోయిన్ (ఫొటోలు)

+5

'ఇడియట్' రక్షిత బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

క్రీస్తు త్యాగం.. సమస్త మానవాళికీ స్ఫూర్తిదాయకం (ఫొటోలు)

+5

నల్లమల అడవి : తెలంగాణలో జరిగే ఈ సాహస యాత్ర గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఏపీలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ఈ గుహ గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఒంటిమిట్ట : వైభవంగా శ్రీ కోదండ రామస్వామి వారి రథోత్సవం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా హనుమాన్‌ శోభాయాత్ర (ఫోటోలు)

+5

మార్చి జ్ఞాపకాల్లో నిక్కీ గల్రానీ-ఆది పినిశెట్టి జంట (ఫోటోలు)

+5

రూటు మార్చిన శృతి హాసన్‌.. ఈ సారి వయ్యారంగా.. (ఫోటోలు)