పేద బాలికలే అతడి టార్గెట్ చదివిస్తానని నమ్మించి..
Breaking News
మాటల్లో చెప్పలేను.. నా పూర్వజన్మ సుకృతం: చిరంజీవి
Published on Thu, 04/02/2026 - 13:58
మెగాస్టార్ చిరంజీవి.. ఆంజనేయ స్వామికి పరమభక్తుడు. గురువారం (ఏప్రిల్ 2న) హనుమాన్ జయంతి సందర్భంగా ఓ స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన ఇంట్లోని పూజా మందిరంలో సూర్యభగవానుడి కిరణాలు హనుమంతుడి విగ్రహాన్ని తాకాయంటూ సంతోషం వ్యక్తం చేశారు.
ప్రతి ఏడాది..
శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా మా పూజామందిరంలో జరిగిన ఓ విశేషాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో సూర్యకిరణాలు సప్తవర్ణాలుగా మారి మా పూజామందిరంలో ఉన్న హనుమంతుడిని పై నుంచి కిందివరకు స్పృశిస్తూ ప్రసరించడం చూస్తుంటే ఆ దృశ్యం, ఆ అనుభూతి మాటల్లో చెప్పలేను.
పూర్వజన్మ సుకృతం
ఇటీవల అయోధ్యలో బాలరాముడి నుదుటిపై సూర్యకాంతి ప్రసరించి మెరుస్తున్న అద్భుతాన్ని చూశాం. అలాగే కోణార్క్, అరసవెల్లి దేవాలయాల్లో సూర్యకిరణాలు భగవంతుడిని తాకే విశేషం అందరికీ తెలిసిందే! అలాంటి దైవానుభూతి.. మా ఇంట్లో ఆంజనేయుడిని స్పృశించడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.
అందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు.💐
మనకు నిత్యం కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుని కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుని స్పృశిస్తున్న అద్భుతమైన సన్నివేశాన్ని ఈ సందర్భంగా మీతో పంచుకుంటున్నాను.
జై శ్రీరామ్🙏 జై హనుమాన్🙏#HanumanJayanti pic.twitter.com/fafTx4x9xL— Chiranjeevi Konidela (@KChiruTweets) April 2, 2026
చదవండి: ఎవరీ మానస శర్మ? ట్రెండింగ్‌లో రాకాస లేడీ డైరెక్టర్
Tags : 1