పేద బాలికలే అతడి టార్గెట్ చదివిస్తానని నమ్మించి..
Breaking News
ఏడాదిగా ట్రెండింగ్‌లో తమిళ్ సాంగ్.. తెలుగు వర్షన్ రిలీజ్
Published on Thu, 04/02/2026 - 11:14
గత ఏడాదిగా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఎక్కడ చూసినా ఓ పాట తెగ వైరలయింది. అదే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాలోని ధీమా పాట. ప్రదీప్ రంగనాథన్ హీరోగా, కృతీ శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. డైరెక్టర్ విఘ్నేశ్‌యే ఈ ధీమా పాటకు సైతం లిరిక్స్ అందించాడు. అనిరుధ్ తన గాత్రంతో దాన్ని మరింత అందంగా ఆలపించాడు.
'ధీమా' తెలుగు సాంగ్ రిలీజ్
ఈ పాట రిలీజ్ చేసినప్పటినుంచి చాలామందికి ఇది ఫేవరెట్ అయిపోయింది. తాజాగా ఈ పాట తెలుగు వర్షన్ వదిలారు. హృదయపు కోటే.. దోచేశావే.. ఇకపై నువ్వే నాకు మహారాణివే.. అంటూ పాట మొదలవుతుంది. ఇది చూసిన అభిమానులు.. లేటుగానైనా సరే తెలుగులో రిలీజ్ చేసినందుకు థ్యాంక్స్ అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ పాటను మీరూ వినేయండి..
సినిమా
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (Love Insurance Kompany Movie) విషయానికి వస్తే.. విఘ్నేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆయన సతీమణి, స్టార్ హీరోయిన్ నయనతార నిర్మిస్తోంది. ఇందులో ఎస్‌జే సూర్య, యోగిబాబు, గౌరీ కిషన్, మాళవిక కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. ఈ మూవీ తమిళ, తెలుగు భాషల్లో ఏప్రిల్ 10న విడుదల కానుంది.
#Dheema Telugu version is out now :) #LIK from April 10 ❤️ https://t.co/KQQII9rAK7 pic.twitter.com/NwF5w1LUrP
— Anirudh Ravichander (@anirudhofficial) April 2, 2026
Tags : 1