ఎవరిది గోల్డ్.. ఎవరిది రోల్ గోల్డ్..?
Breaking News
పూనమ్ పాండే ప్రెగ్నెంట్? నిజమా.. లేక?
Published on Wed, 04/01/2026 - 09:55
పబ్లిసిటీ స్టంట్స్ చేయడంలో నటి పూనమ్ పాండేను మించినవారు లేరు. 2019లో టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే మైదానంలో దుస్తుల్లేకుండా తిరుగుతానని ప్రకటించింది. తీరా భారత్ కప్పు గెలవగా.. ఆమె అన్నంత పని చేయకుండా బీసీసీఐ పూనమ్‌ను అడ్డుకుంది. రెండేళ్ల క్రితం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో మరణించినట్లు తనపై తనే రూమర్ సృష్టించింది. అది నిజమేనని నమ్మిన జనం తీవ్ర విచారం వ్యక్తం చేయడంతో క్షమించండి, కేవలం అవగాహన కోసమే ఇలా చనిపోయినట్లు నాటకమాడానంది.
మరో డ్రామా?
ఇప్పుడు మరో స్టంట్ చేసినట్లు కనిపిస్తోంది. అదేంటంటే.. తను గర్భవతిని అని ప్రకటించింది. బేబీ బంప్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు.. అదేంటి, భర్తతో విడిపోయిన పూనమ్ ప్రెగ్నెంట్ ఎలా అయింది? అని డౌట్ పడుతున్నారు. అంతలోనే అది ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సాయంతో సృష్టించిన ఫోటోలని తేల్చేశారు. ఎక్స్‌లో షేర్ చేసిన పోస్ట్ కింద ఇది ఏఐతో చేసిన ఫోటో అని స్పష్టంగా రాసుంది. అంటే అందర్నీ ఏప్రిల్ ఫూల్ చేసేందుకు ఇలా తాను ప్రెగ్నెంట్ అని డ్రామా ఆడినట్లు తెలుస్తోంది.
సినిమా
కాగా పూనమ్ పాండే బాలీవుడ్‌లో నషా, జీఎస్టీ, ద జర్నీ ఆఫ్ కర్మ, టచ్ ద ఫైర్ వంటి సినిమాలు చేసింది. తెలుగులో మాలిని అండ్ కో చిత్రంలో కథానాయికగా నటించింది. వ్యక్తిగత విషయానికి వస్తే.. 2020 సెప్టెంబర్ 1న ప్రియుడు సామ్ అహ్మద్ బాంబేని పెళ్లి చేసుకుంది. పెళ్లయిన పదిరోజులకే అతడు తనపై అత్యాచారం చేశాడని, వేధింపులకు పాల్పడుతున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది. అలా కొంతకాలానికే దంపతులిద్దరూ విడిపోయారు.
🤰🍼👶👼 pic.twitter.com/6UUAAc9rKj
— Poonam Pandey (@iPoonampandey) March 31, 2026
చదవండి: గుడిలో గిన్నెలు కడిగిన స్టార్ హీరోయిన్
Tags : 1