ఎవరిది గోల్డ్.. ఎవరిది రోల్ గోల్డ్..?
Breaking News
యువ నటికి ప్రముఖ డైరెక్టర్ లైంగిక వేధింపులు..!
Published on Wed, 04/01/2026 - 09:27
ప్రముఖ మలయాళ దర్శకుడు, నిర్మాత రంజిత్ బాలకృష్ణన్ అరెస్టు అయ్యారు. ఒక యువ నటి ఇచ్చిన ఫిర్యాదుతో కొచ్చి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇడుక్కిలో రంజిత్ బాలకృష్ణన్‌ను అదుపులోకి తీసుకుని.. అనంతరం కొచ్చి పోలీసులకు అప్పగించారు. ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆయనను అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఒక సినిమా సెట్‌లో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు యువ నటి ఫిర్యాదులో పేర్కొంది. సినిమా చిత్రీకరణ సమయంలో రంజిత్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని నటి తన ఫిర్యాదులో ఆరోపించింది. అయితే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లడానికి ముందే.. బాధితురాలు సినిమా నిర్మాణ సంస్థలోని అంతర్గత ఫిర్యాదుల కమిటీ(ICC)కి అధికారికంగా కంప్లైంట్ చేశారు. కమిటీ విచారణ అనంతరం ఈ కేసును కేరళ పోలీసులకు అప్పగించింది. అయితే నటి వివరాలు గోప్యంగా ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
గతంలోనూ రంజిత్‌పై ఆరోపణలు..
కాగా.. గతంలో బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర చేసిన వేధింపుల ఆరోపణల నేపథ్యంలో.. 2024లో రంజిత్ కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత ఆయన తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తనపై కావాలనే కొందరు టార్గెట్‌గా ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. తాజాగా మరో నటి ఫిర్యాదుతో ఆయనను అరెస్ట్ చేయడంతో ఈ టాపిక్ మలయాళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
Tags : 1