గాయనికి 'స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్'..! ఎందువల్ల వస్తుందంటే..

Published on Wed, 04/01/2026 - 08:24

ప్రపంచ ప్రఖ్యాత ఫ్రెంచ్ కెనడియన్ పాప్ గాయని సెలిన్ డియోన్ తన గాత్ర నైపుణ్యం, ఉద్వేగభరితమైన మ్యూజిక్‌ ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందింది. 'టైటానిక్' చిత్రంలోని 'మై హార్ట్ విల్ గో ఆన్' పాటతో పాటు 90ల నాటి అనేక అంతర్జాతీయ హిట్‌లకు ప్రసిద్ధి చెందింది. అంత ప్రసిద్ధి గాంచిన గాయని 'స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్' అనే అరుదైన వ్యాధి బారినపడింది. దాంతో సంగీతానికి గత కొంతకాలంగా పూర్తిగా విరామం ఇచ్చేశారామె. మళ్లీ ఇన్నేళ్లకు తన 58వ పుట్టిన రోజు నేపథ్యంలో మ్యూజిక్‌ లైవ్‌ షోలలో పాల్గొననుట్లు అభిమానులతో పంచుకుంది. సెలిన్‌ని కెరీర్‌కి దూరమయ్యేలా చేసిన అరుదైన 'స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్' వ్యాధి అంటే ఏంటి? ఎందువల్ల వస్తుందంటే..

గాయని సెలిన్ డియోన్‌కు డిసెంబర్ 2022లో స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్ అనే అరుదైన ఆటోఇమ్యూన్ న్యూరోలాజికల్ డిజార్డర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దాంతో ఆమె గతకొలంగా లైవ్‌షోలకు బ్రేక్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె లైవ్‌షో వేదికపైకి తిరిగి రావడానికి సంసిద్ధంగా ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలలో లా డిఫెన్స్ ఎరీనాలో 10 రాత్రుల పాటు ప్రదర్శనలు ఇవ్వనుంది. ఇలా మళ్లీ పూర్తి స్థాయిలో కోలుకుని యథావిధిగా తన కెరీర్‌ని కొనసాగిచడాన్ని తన జీవితంలోని అత్యుత్తమమైన బహుమతిగా అభివర్ణించింది. 

మార్చి 2020లో అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన చివరి లైవ్‌ షో అనంతరం డియోన్‌ మళ్లీ తొలిసారిగా వేదికపైకి పునరాగమనం చేయనుండటం విశేషం. ఇక డియోన్‌ ఈ అరుదైన వ్యాది తన గొంతు కదలికలపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు. తన అభిమానులు, శ్రేయాభిలాషుల మద్దతతులో పూర్తి స్థాయిలో కోలుకున్నానని, అందుకు అందరికి కృతజ్ఞతలు అని పేర్కొంది. ఇంతకీ ఆమె ఎదుర్కొన్న అరుదైన వ్యాధి 'స్టిఫ్-పర్సన్ సిండ్రోమ్'అంటే ఏంటి? ఎందువల్ల వస్తుందంటే..

స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్ అంటే ?
స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్ (SPS) అనేది ఒక అరుదైన ఆటోఇమ్యూన్ న్యూరోలాజికల్ రుగ్మత. ఇది మొండెం, పొత్తికడుపులో కండరాల బిగుతుకు కారణమవుతుంది. కాలక్రమేణ ఈ పరిస్థితి మరింత తీవ్రతరమయ్యే అవకాశాలు ఉన్నాయి కూడా. 

దీని కారణంగా సంబంధిత రోగులు కాళ్లు, ఇంతర కండరాల్లో బిగువు, ఒక విధమైన నొప్పులను అనుభవిస్తారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు సాధారణ కదలికలు కష్టతరమవుతాయట. ముఖ్యంగా నడవడం కష్టంగా మారిపోతుందట.

లక్షణాలు 
దీనిలో రెండు ప్రధాన లక్షణాలు ఉన్నాయి:

కండరాల బిగుతు
ఈ వ్యాధిలో కనిపించే తొలి సంకేతం ఇదే. ముఖ్యంగా మొండెం భాగంలో - అంటే పొట్ట, ఛాతీ, వీపులో మొదలవుతుంది. ఇది నిరంతర బిగుతుగా లేదా నొప్పితో కూడిన బాధగా అనిపిస్తుందట. ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా ఈ బిగుతు రావచ్చు, పోవచ్చు. ఇది తీవ్రమవుతున్న కొద్దీ, చేతులు, కాళ్ళను కూడా ప్రభావితం చేయవచ్చు.

కండరాల నొప్పులు (స్పాజమ్స్)
ఇవి ఆకస్మికంగా, బాధాకరంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఒక భాగాన్ని లేదా మొత్తం శరీరాన్ని ప్రభావితం చేయవచ్చు. ఈ నొప్పులు కొన్ని సెకన్లు, నిమిషాలు లేదా కొన్నిసార్లు గంటల పాటు కూడా ఉండవచ్చు.

లక్షణాలను ప్రేరేపించే అంశాలు

బిగ్గరగా లేదా ఊహించని శబ్దాలు

శారీరక స్పర్శ

ఉష్ణోగ్రతలో మార్పులు (ముఖ్యంగా చలి)

ఒత్తిడితో కూడిన పరిస్థితులు

మొత్తం మీద, ఈ పరిస్థితి కాలక్రమేణా కదలికలను కష్టతరం చేస్తుంది, మంచానికే పరిమితమయ్యేలా చేస్తుంది కూడా.

కారణాలు :

ఇది ఒక స్వయం ప్రతిరక్షక వ్యాధి (Autoimmune disorder), అంటే శరీర రోగనిరోధక వ్యవస్థ పొరపాటున స్వంత నాడీ కణాలపై దాడి చేస్తుంది.

చాలా మంది రోగులలో గ్లుటామిక్ యాసిడ్ డెకార్బాక్సిలేస్ (GAD) యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయి.

నిర్ధారణ
ఈ వ్యాధి నిర్ధారణకు రక్త పరీక్షలు (GAD యాంటీబాడీ టెస్ట్), EMG (Electromyography) ఉపయోగిస్తారు. 

చికిత్స, నిర్వహణ:
దీనికి కచ్చితమైన చికిత్స లేనప్పటికీ, లక్షణాలను నిర్వహించవచ్చు. ముందుగా కండరాలను సడలించడానికి డయాజెపామ్ (Valium) లేదా బాక్లోఫెన్ (Baclofen) వంటి మందులు ఉపయోగిస్తారు.

ఇమ్యునోథెరపీ: IVIG (Intravenous Immunoglobulin) చికిత్స తరచుగా మొదటి ప్రాముఖ్యతగా చేస్తుంటారు వైద్యులు. వాటితోపాటు ఫిజియోథెరపీ, ఇతర వ్యాయామాలు కదలికను మెరుగుపరచడానికి సహాయపడతాయి. నిజానికి ఈ వ్యాధి స్త్రీలలో, ముఖ్యంగా 40-50 ఏళ్ల మధ్య వయస్సులో ఎక్కువగా కనిపిస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సం‍ప్రదించడం ఉత్తమం.

(చదవండి: పుచ్చకాయ తినే ముందు చిటికెడు ఉప్పు ఎందుకు చల్లుతారో తెలుసా..!)

Videos

ఎవరిది గోల్డ్.. ఎవరిది రోల్ గోల్డ్..?

క్యారెక్టర్ లేని వారికే ఆలయాల చైర్మన్ పదవులు

గోల్డ్ లవర్స్ కు షాక్..భారీగా పెరిగిన బంగారం ధరలు

రఘురామరాజుకు కారుమూరి నాగేశ్వరరావు కౌంటర్

నీ నక్క తెలివితేటలు... జగన్ దెబ్బకు ఢిల్లీలో దాక్కున్నావ్...

ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ దిమ్మతిరిగే కౌంటర్

చర్చలు కాదు.. యుద్ధానికి రెడీ.. UAE సంచలన ప్రకటన

విజయ్ ఆస్తులు, అప్పులు ఎంత? తెలిస్తే షాక్ అవుతారు

Breaking News : పెట్రోల్ ధరలు పెరగలేదు

జగన్ కట్టిన ఇళ్లపై బాబు వీడియో చూపించి మరి ఇచ్చిపడేసిన నాగమల్లేశ్వరి

Photos

+5

వామ్మో ఎండలు.. (ఫొటోలు)

+5

డిజైన్లకే రూ.401కోట్లు ఖర్చు..ఏంది సామీ ఇదంతా!: వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో అల్లు అర్జున్ కుటుంబం (ఫొటోలు)

+5

దేవతలా మిస్ ఇండియా నికితా పోర్వాల్‌..! (ఫొటోలు)

+5

'పల్లి చట్టంబి' మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

‘బ్యాండ్‌ మేళం’ మూవీ థ్యాంక్ యూ మీట్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఘనంగా భగవాన్‌ మహావీర్‌ జయంతి వేడుకలు (ఫొటోలు)

+5

పైలట్‌ని పెళ్లి చేసుకున్న హీరోయిన్ జనని (ఫొటోలు)

+5

భార్యతో కలిసి హీరో నితిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మార్చి నెల జ్ఞాపకాలు షేర్ చేసిన అనసూయ (ఫొటోలు)