నదిని శుభ్రం చేసిన ఒకే ఒక్కడు..! ఆనంద్‌ మహీంద్రా సైతం..

Published on Tue, 03/31/2026 - 10:23

పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా ఎప్పటిలా ఈసారి సోషల్‌ మీడియా వేదికగా సరికొత్త స్ఫూర్తిదాయకమైన స్టోరీతో మనముందుకొచ్చారు. ఈసారి షేర్‌చేసిన కథ..మనిషి తలుచుకుంటే ఏదైన సాధించగలడు..మందితో పనిలేదని చెప్పే సందేశాత్మక స్టోరీ.

మధ్యప్రదేశ్‌లోని బియోరాకు చెందిన 20 ఏళ్ల బిట్టు తబాహి తీవ్రంగా కలుషితమైన అజ్నార్ నదిని ఒంటరిగా శుభ్రం చేసి రాత్రికి రాత్రికే స్టార్‌గా మారాడు. అతని అద్భుతమైన ప్రయత్నానికి అబ్బురపడటమే గాక అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా. ఈ సోమవారం ఒంటరి యోధుడు బిట్టునే మనకు ప్రేరణ అంటూ అతడి కథను పంచుకున్నారు. సోషల్‌ మీడియా ఎక్స్‌ పోస్ట్‌లో ఆ కుర్రాడి గురించి ఇలా రాసుకొచ్చారు. 

బిట్టు నదిలో కొన్ని భాగాలను శుభ్రం చేశానని చెప్పుకున్నందుకు విమర్శలపాలయ్యాడని అన్నారు. కేవలం వ్యూస్‌కే ఇదంతా అని ట్రోల్‌ చేసినట్లు తెలిపారు. సోషల్‌మీడియా కూడా నిజమైన కృషి కంటే అల్పమైన వాటికే ప్రాధాన్యత ఇస్తుంటుందని విమర్శించారు. పోనీ వాళ్లన్నట్లు బిట్టు లైక్‌లు, వ్యూస్‌ కోసం చేసినా..అది ప్రపంచాన్ని మార్చే మంచి పనైతే కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే కదా, విమర్శలు దేనికని ప్రశ్నించారు. 

ఇక బిట్టు బిట్టు జనవరి 26న కొందరు స్నేహితులతో కలిసి నదిని శుభ్రం చేయడం ప్రారంభించాడని చెప్పారు. అయితే కొన్ని రోజులకే ఒంటరిగా ఆ పని చేయాల్సి వచ్చింది. ప్రాథమిక పనిముట్ల సాయంతో కలుషితమైన నీటిలోకి దిగి, పట్టుదలతో ప్లాస్టిక్‌ వ్యర్థాలను, నాచు, చెత్త తదితరాలను బయటకు తీశాడు. విమర్శలు వచ్చినా బిట్టు తన ప్రయత్నాన్ని ఎక్కడ విరమించలేదు. పైగా నది సహజ సౌందర్యాన్ని సంతరించుకునేలా పట్టుదలతో పనిచేశాడు. 

అతడి కృషి ఫలితంగా ఇప్పుడు స్వచ్ఛమైన నీరు పారుతూ అందంగా మారింది ఆ నది అని చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన దృశ్యాలను కూడా బిట్టు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడని అన్నారు. డిజిటల్‌ స్టార్‌డమ్‌ కోసం చేసినా..అది సమాజ హితానికి ఉపయోగపడేదే అయితే మెచ్చుకుందా, ప్రోత్సహిద్దాం అని అన్నారు మహీంద్రా. నెటిజన్లు సైతం ఒంటిరి యోధుడు, రియల్‌ హీరో అంటూ ప్రశంసలు కురిపించారు. కొందరు మాత్రం ఒక వ్యక్తి నదిని శుభ్రం చేయగలిగితే.. మొత్తం దేశం పరిశుభ్రతను సీరియస్‌గా తీసుకుంటే..కచ్చితంగా స్వచ్ఛ భారత్‌ కాగలదేమో అని పోస్టులు పెట్టారు.

 

(చదవండి: ఆ బాబా ఇంగ్లీష్‌ ఫ్లుయెన్స్‌కి మతిపోవాల్సిందే..!)

 

Videos

కొంచమైనా సిగ్గు ఉందా? ఈనాడు పిచ్చి రాతలపై దాడిశెట్టి రాజా ఆగ్రహం

పశ్చిమాసియాలో హైఅలర్ట్.. కువైట్ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ ను పేల్చేసిన ఇరాన్

వైఎస్ జగన్‌ను కలిసిన గురజాల నియోజకవర్గ స్థానిక నేతలు

బీజేపీలో చేరిన టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్

అమెరికాపై యుద్ధం ఎఫెక్ట్ భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

అమరావతి చట్టబద్దత పేరుతో బాబు డైవర్షన్ పాలిటిక్స్

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై, YSRCP రౌండ్ టేబుల్ సమావేశం

సినీ ఇండస్ట్రీ పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఈవారం ఇన్వెస్టర్లకు పండగే.. బోనస్, స్టాక్ స్ప్రిట్, డివిడెండ్లు కుమ్మరించనున్న స్టాక్స్ ఇవే..!

అంబులెన్సును తోస్తున్న పోలీసులు

Photos

+5

ఘనంగా భగవాన్‌ మహావీర్‌ జయంతి వేడుకలు (ఫొటోలు)

+5

పైలట్‌ని పెళ్లి చేసుకున్న హీరోయిన్ జనని (ఫొటోలు)

+5

భార్యతో కలిసి హీరో నితిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మార్చి నెల జ్ఞాపకాలు షేర్ చేసిన అనసూయ (ఫొటోలు)

+5

రాకాస ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మెరిసిన నీహారిక.. (ఫొటోలు)

+5

బెంగళూరు : కనువిందుగా హారతి దీపాల వేడుక (ఫొటోలు)

+5

హైదరాబాద్: మధ్యాహ్నం భానుడి భగభగలు.. సాయంత్రం వరుణుడి పలకరింపు (ఫొటోలు)

+5

‘రాకాస’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కిరణ్‌ అబ్బవరం ‘చెన్నై లవ్‌ స్టోరీ’ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన గుహ గురించి మీకు తెలుసా? (ఫొటోలు)