ఓటీటీలోకి తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Published on Mon, 03/30/2026 - 18:43

హీరోయిన్లు వయసు అయిపోయిన తర్వాత సహాయ పాత్రలు చేస్తూ కాలం గడిపేస్తుంటారు. ఒకప్పటి హీరోయిన్ రాధిక కూడా అలానే తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తోంది. ఈమెని ప్రధాన పాత్రలో పెట్టి, తమిళ హీరో శివకార్తికేయన్ ఓ చిత్రాన్ని నిర్మించాడు. ఊహించని విధంగా బ్లాక్‌బస్టర్ అయింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులోకి రానుంది?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి శివాజీ-లయ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)

రాధిక.. వృద్ధురాలిగా నటించిన సినిమా 'తాయ్ కిళవి'. ఫిబ్రవరి 27న తమిళంలో మాత్రమే థియేటర్లలో రిలీజైంది. మంచి టాక్‌తో పాటు అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకుంది. లాంగ్ రన్‌లో రూ.80 కోట్ల వరకు వసూళ్లు దక్కించుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 10 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.

'తాయ్ కిళవి' విషయానికొస్తే.. కోపం ఎక్కువగా ఉండే ఓ బామ్మ(రాధిక), ఊరిలో అందరికీ డబ్బులు వడ్డీలకు ఇస్తూ కాలం వెల్లదీస్తుంటుంది. ముక్కుసూటిగా మాట్లాడటం, తేడా వస్తే చితక్కొట్టేయడం ఈమెకు అలవాటు. తన ముగ్గురు కొడుకులకు బాధ్యత లేకపోవడంతో వాళ్లని ఇంటి నుంచి గెంటేస్తుంది. అయితే ఈమె దగ్గర బంగారు నిధి ఉందనే ప్రచారం ఒకటి మొదలవుతుంది. మరోవైపు హఠాత్తుగా పక్షవాతం వచ్చేసరికి ఈమెకు మాట పడిపోతుంది. దీంతో కొడుకులు తిరిగి ఈమె దగ్గరకొస్తారు. వాళ్లకు సైగ ద్వారా ఏదో చెప్పాలనే ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతకీ అదేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్)

Videos

క్రూర మృగాల్లా వెంట పడుతున్న వీధి కుక్కలు

బస్సు ప్రమాద బాధితులకు మేకపాటి సాయం

ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు లేరు..

కుర్రాడు మంచోడే కానీ... ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ పెట్టాడు..!

అంతా ఫిబ్రవరి 26 తర్వాతే ఇప్పుడు దుబాయ్ ఎలా ఉందంటే?

దళిత ఉద్యోగిపై బూతులు.. పిఠాపురం కమీషనర్ ఆడియో లీక్

SIP లో నెలకు ఎంత పెట్టుబడి పెడితే 5 కోట్లు సంపాందించొచ్చు..!

పందిలా ఒళ్ళు బలిసి... దవడ పగిలిపోద్ది.. జనసేన సుభాషిణిని రఫ్ఫాడించిన నేత

ధోని లేడు, బ్రెవిస్ కూడా లేడు సంజు ఒక్కడు చాలు

భారీగా పడిపోయిన బంగారం ధరలు! కొనుగోలుదారులకు పండగ..

Photos

+5

ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన గుహ గురించి మీకు తెలుసా? (ఫొటోలు)

+5

గ్రీన్‌ అవుట్‌ఫిట్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. (ఫొటోలు)

+5

హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలి, శాసన సభ్యుల సాంస్కృతిక ప్రదర్శనలు (ఫొటోలు)

+5

ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో నమ్రత (ఫోటోలు)

+5

ఫ్యాషన్‌ షోలో నగధగలు..అలరించిన మోడల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 29- ఏప్రిల్ 05)

+5

'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

90ల నాటి కలల రాణి.. మేకప్‌ లేకుండా నెరిసిన జుట్టుతో (ఫొటోలు)

+5

వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’...అలరించిన సినీ ప్రముఖుల ర్యాంప్‌ వాక్‌ (ఫొటోలు)