క్రూర మృగాల్లా వెంట పడుతున్న వీధి కుక్కలు
Breaking News
తెలుగు వాళ్లకు ఈ సినిమా నచ్చితే రూ.1000 కోట్లు
Published on Mon, 03/30/2026 - 15:46
సినిమా నటీనటులు కొన్నిసార్లు మాట్లాడే మాటలు అతిశయోక్తిలా అనిపిస్తుంటాయి. ఆ విషయం వాళ్లకు కూడా తెలుసు. అయినా సరే హీరోలని పొగిడే క్రమంలో ఇలాంటి చిత్రవిచిత్రమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పుడు ఫేమస్ కమెడియన్ ఇలాంటి కామెంట్స్ చేశాడు. ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి శివాజీ-లయ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)
తమిళనాడులో వస్త్రదుకాణాలతో గుర్తింపు తెచ్చుకున్న శరవణనన్.. నాలుగేళ్ల క్రితం 'లెజెండ్' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సదరు హీరో యాక్టింగ్‌పై అప్పట్లో విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. ఇప్పుడు 'లీడర్' అనే మూవీతో వస్తున్నాడు. ఏప్రిల్ 3న తెలుగు, తమిళంలో థియేటర్లలో రిలీజ్ కానుంది. దీని ఆడియో-ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆదివారం చెన్నైలో జరిగింది. ఇందులోనే కమెడియన్ వీటీవీ గణేశ్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా గనక నచ్చితే సులభంగా రూ.1000 కోట్లు వచ్చేస్తాయని అనడం చిత్రంగా అనిపించింది.
రజనీకాంత్, విజయ్ లాంటి స్టార్ హీరోలే ఇప్పటివరకు రూ.1000 కోట్ల మార్క్‌ని అందుకోలేకపోయారు. అలాంటిది లెజెండ్ శరవణనన్ సినిమాకు ఇన్ని కోట్ల వసూళ్లు వస్తాయని కమెడియన్ పొగడటం కాస్త అతిలా ఉంది. దీని గురించి సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వస్తున్నాయి. తొలి చిత్రంతో తీవ్రంగా నష్టపోయిన శరవణనన్.. ఈసారి 'లీడర్'తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. ఇందులో పాయర్ రాజ్‌పుత్ హీరోయిన్ కాగా ఆండ్రియా, శ్యామ్, లాల్ తదితర స్టార్స్ ఉన్నారు.
(ఇదీ చదవండి: రూమర్స్ నిజమయ్యాయి.. తెలుగు దర్శకుడితోనే సల్మాన్)
Tags : 1