ఫస్ట్‌ది అట్టర్‌ ఫ్లాప్‌.. అందుకే హిందీలో సినిమా చేయట్లేదా? చై ఆన్సరిదే!

Published on Mon, 03/30/2026 - 13:37

టాలీవుడ్‌ హీరో నాగచైతన్య చివరగా తండేల్‌ సినిమాతో భారీ హిట్‌ కొట్టాడు. ప్రస్తుతం వృషకర్మ మూవీతో బిజీగా ఉన్నాడు. అయితే టాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయన లాల్‌ సింగ్‌ చద్దా (2022) మూవీతో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఆమిర్‌ ఖాన్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత మళ్లీ హిందీ సినిమా ట్రై చేయలేదు చై.

కారణమంటూ ఏం లేదు
బాక్సాఫీస్‌ వైఫల్యం వల్లే అతడు మళ్లీ హిందీ సినిమా చేయడానికి భయపడుతున్నాడని ప్రచారం జరిగింది. దానిపై నాగచైతన్య తాజాగా స్పందించాడు. అతడు మాట్లాడుతూ.. నేను హిందీలో మళ్లీ మూవీ చేయకపోవడానికి ప్రత్యేక కారణమంటూ ఏదీ లేదు. తెలుగులో బిజీ అయిపోయానంతే! మళ్లీ మంచి అవకాశం వస్తే తప్పకుండా బాలీవుడ్‌లో యాక్ట్‌ చేస్తాను. లాల్‌ సింగ్‌ చద్దా వైఫల్యం వల్ల మాత్రం నేను వెనకడుగు వేయలేదు. 

చాలా ఎంజాయ్‌ చేశా
ఆ మూవీ షూటింగ్‌ నేను చాలా ఎంజాయ్‌ చేశాను. అక్కడి జనం దగ్గరినుంచి ఎంతో నేర్చుకున్నాను, వాళ్లు నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఆ అనుభవం మాటల్లో చెప్పలేను. ఇక సినిమా రిజల్ట్‌ అంటారా? బాక్సాఫీస్‌ వద్ద ఒడిదుడుకులు సహజం అని అర్థం చేసుకునేంత పరిణతి మాకుందని భావిస్తున్నాను. ఈ ఫలితాలు మా లక్ష్యసాధనను ఏమాత్రం అడ్డుకోలేవు. సక్సెస్‌, ఫెయిల్యూర్‌ నా మైండ్‌సెట్‌ను మార్చలేవు అని నాగచైతన్య పేర్కొన్నాడు.

చదవండి: అది నిజం కాదు, ఎవరూ నమ్మకండి: ఖుష్బూ

Videos

క్రూర మృగాల్లా వెంట పడుతున్న వీధి కుక్కలు

బస్సు ప్రమాద బాధితులకు మేకపాటి సాయం

ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు లేరు..

కుర్రాడు మంచోడే కానీ... ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ పెట్టాడు..!

అంతా ఫిబ్రవరి 26 తర్వాతే ఇప్పుడు దుబాయ్ ఎలా ఉందంటే?

దళిత ఉద్యోగిపై బూతులు.. పిఠాపురం కమీషనర్ ఆడియో లీక్

SIP లో నెలకు ఎంత పెట్టుబడి పెడితే 5 కోట్లు సంపాందించొచ్చు..!

పందిలా ఒళ్ళు బలిసి... దవడ పగిలిపోద్ది.. జనసేన సుభాషిణిని రఫ్ఫాడించిన నేత

ధోని లేడు, బ్రెవిస్ కూడా లేడు సంజు ఒక్కడు చాలు

భారీగా పడిపోయిన బంగారం ధరలు! కొనుగోలుదారులకు పండగ..

Photos

+5

ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన గుహ గురించి మీకు తెలుసా? (ఫొటోలు)

+5

గ్రీన్‌ అవుట్‌ఫిట్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. (ఫొటోలు)

+5

హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలి, శాసన సభ్యుల సాంస్కృతిక ప్రదర్శనలు (ఫొటోలు)

+5

ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో నమ్రత (ఫోటోలు)

+5

ఫ్యాషన్‌ షోలో నగధగలు..అలరించిన మోడల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 29- ఏప్రిల్ 05)

+5

'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

90ల నాటి కలల రాణి.. మేకప్‌ లేకుండా నెరిసిన జుట్టుతో (ఫొటోలు)

+5

వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’...అలరించిన సినీ ప్రముఖుల ర్యాంప్‌ వాక్‌ (ఫొటోలు)