క్రూర మృగాల్లా వెంట పడుతున్న వీధి కుక్కలు
Breaking News
సినిమాలు చూసే అలవాటు లేదు.. ఇంట్లో ఒప్పుకోరు!: ఆమిర్ ఖాన్
Published on Mon, 03/30/2026 - 10:45
తాను పెద్దగా సినిమాలు చూడనంటున్నాడు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్. చిన్నప్పుడు చేతికి పుస్తకాలిచ్చేవారే తప్ప సినిమాలు చూసేందుకు అనుమతిచ్చేవారు కాదని, దాంతో అదే అలవాటైపోయిందని చెప్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. నేను చాలా సాంప్రదాయ కుటుంబంలో పెరిగాను. మా అమ్మానాన్న చాలా స్ట్రిక్ట్.. సినిమాలు చూసేందుకు అంతగా అనుమతిచ్చేవారు కాదు.
అమ్మ అనుమతితోనే..
దాంతో పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేసేవాడిని. కేవలం దూరదర్శన్‌లో వచ్చిన బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, మరీ పాత సినిమాలు మాత్రమే చూశాను. ఎప్పుడైనా సినిమా చూడాలనుకుంటే మా అమ్మను అనుమతి అడిగేవాడిని. తను ఓకే చెప్తేనే చూసేదాన్ని, లేదంటే లేదు. అయితే రొమాంటిక్ సినిమాలు చూడటం మాత్రం నిషిద్ధం. కేవలం వారాంతాల్లో మూవీస్ చూసేవాడిని.
సినిమాలు చూడను
అయితే విచిత్రంగా 18 ఏళ్లకే నేను సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. అసిస్టెంట్‌గా కెరీర్ ప్రారంభించి తర్వాత హీరోగా మారాను. అయితే ఇప్పటికీ నేను పెద్దగా సినిమాలు చూడను. ఫన్నీగా చెప్పాలంటే.. కొందరికి ఫుట్‌బాల్ ఆడటం ఇష్టం, మరికొందరికి చూడటం ఇష్టం. అలా నేను సినిమాలు చేస్తాను, కానీ చూడను. ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన సినిమాలేవీ చూడలేదు. నా ప్రపంచంలో నేను బతికేస్తుంటాను అని చెప్పుకొచ్చాడు.
సినిమా
ఇకపోతే ఆమిర్ చివరగా సితారే జమీన్ పర్ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం నిర్మాతగా ఏక్ దిన్, లాహోర్ 1947 అని రెండు సినిమాలు చేస్తున్నాడు. ఏక్ దిన్లో.. ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటించగా సాయిపల్లవి కథానాయికగా కనిపించనుంది. ఇది వన్ డే అనే థాయ్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది. ఏక్ దిన్ మే 1న విడుదల కానుంది.
చదవండి: ధురంధర్ రికార్డు బ్రేక్ చేసిన ధురంధర్ 2
Tags : 1