నాలుగు పదుల వయస్సులో తల్లైన హీరోయిన్

Published on Mon, 03/30/2026 - 08:45

బాలీవుడ్‌ భామ సోనమ్‌ కపూర్‌  రెండోసారి తల్లిగా ప్రమోషన్ కొట్టేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ రోజు మార్చి 29, 2026న మాకు బాబు పుట్టాడని తెలిపింది. ఈ విషయాన్ని ప్రకటించేందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామని రాసుకొచ్చింది. ఇప్పటికే ఆమెకు వాయు అనే కుమారుడు ఉన్నారు. తాజాగా రెండోసారి కూడా సోనమ్ కపూర్‌కు మగబిడ్డ జన్మించారు. ఈ విషయం  తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

సోనమ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..' అపారమైన కృతజ్ఞతతో.. ​​ప్రేమ నిండిన హృదయాలతో మార్చి 29న మా బాబు రాకను ప్రకటించడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఇప్పుడు మా కుటుంబం మరింత పెద్దదైంది. బాబు రాకతో మా హృదయాలు మరింత సంతోషంతో నిండిపోయాయి. వాయు తన తమ్ముడిని స్వాగతించడానికి ఆసక్తిగా ఉన్నాడు. మరో బిడ్డ రాకతో మా ఇంట ఆనందం వెల్లి విరిసింది. ఇప్పుడు నలుగురితో ఈ అందమైన కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినందుకు మేము కృతజ్ఞతతో ఉన్నాం. ఇట్లు ప్రేమతో సోనమ్, ఆనంద్ అండ్ వాయు' అంటూ పోస్ట్ చేసింది.

వ్యాపారవేత్తతో పెళ్లి..

ప్రముఖ నటుడు అనిల్‌ కపూర్‌ కుమార్తె సోనమ్‌ కపూర్‌, వ్యాపారవేత్త ఆనంద్‌ అహూజా 2018 మేలో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2022లో వాయు అనే కుమారుడు జన్మించాడు. సినిమాల విషయానికి వస్తే.. సంజయ్‌ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో 'సావరియా' మూవీతో సోనమ్‌ వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది.  ఆ తర్వాత బాంబే టాకీస్‌, బ్లైండ్‌, ప్రేమ రతన్‌ ధన్‌పాయో, నీర్జా, సంజు, థాంక్యూ, రాంఝన, ఖుబ్సూరత్‌ వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

 

 

Videos

క్రూర మృగాల్లా వెంట పడుతున్న వీధి కుక్కలు

బస్సు ప్రమాద బాధితులకు మేకపాటి సాయం

ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు లేరు..

కుర్రాడు మంచోడే కానీ... ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ పెట్టాడు..!

అంతా ఫిబ్రవరి 26 తర్వాతే ఇప్పుడు దుబాయ్ ఎలా ఉందంటే?

దళిత ఉద్యోగిపై బూతులు.. పిఠాపురం కమీషనర్ ఆడియో లీక్

SIP లో నెలకు ఎంత పెట్టుబడి పెడితే 5 కోట్లు సంపాందించొచ్చు..!

పందిలా ఒళ్ళు బలిసి... దవడ పగిలిపోద్ది.. జనసేన సుభాషిణిని రఫ్ఫాడించిన నేత

ధోని లేడు, బ్రెవిస్ కూడా లేడు సంజు ఒక్కడు చాలు

భారీగా పడిపోయిన బంగారం ధరలు! కొనుగోలుదారులకు పండగ..

Photos

+5

ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన గుహ గురించి మీకు తెలుసా? (ఫొటోలు)

+5

గ్రీన్‌ అవుట్‌ఫిట్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. (ఫొటోలు)

+5

హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలి, శాసన సభ్యుల సాంస్కృతిక ప్రదర్శనలు (ఫొటోలు)

+5

ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో నమ్రత (ఫోటోలు)

+5

ఫ్యాషన్‌ షోలో నగధగలు..అలరించిన మోడల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 29- ఏప్రిల్ 05)

+5

'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

90ల నాటి కలల రాణి.. మేకప్‌ లేకుండా నెరిసిన జుట్టుతో (ఫొటోలు)

+5

వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’...అలరించిన సినీ ప్రముఖుల ర్యాంప్‌ వాక్‌ (ఫొటోలు)