భారీ అగ్నిప్రమాదం.. పక్కనే పెట్రోల్ బంకు..
Breaking News
వెంకీ మామ స్టైలే వేరు.. సింపుల్‌గా హోటల్‌కు వెళ్లి..!
Published on Sun, 03/29/2026 - 15:39
వెంకీమామ ఈ ఏడాది సంక్రాంతి పండుగకు అలరించారు. మెగాస్టార్ హీరోగా వచ్చిన మనశంకర వరప్రసాద్‌గారు మూవీతో అభిమానులను మెప్పించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో నయనతార హీరోయిన్గా కనిపించింది. గతేడాది అనిల్ రావిపూడి- వెంకీ కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సైతం బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేసింది.
తాజాగా వీరిద్దరు మరోసారి కలిసి పనిచేయనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ కాంబో రిపీట్ కానుంది. అయితే ఈసారి తన తొలి సినిమా హీరో కల్యాణ్‌రామ్ కూడా తీసుకొస్తున్నారు. ఈ ముగ్గురి క్రేజీ కాంబోలో రానున్న చిత్రాన్ని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇటీవలే శ్రీరామనవమి సందర్భంగా అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇక హీరోయిన్స్ ఎవరనేది త్వరలోనే క్లారిటీ రానుంది.
ఇక సినిమా సంగతి పక్కనపెడితే విక్టరీ వెంకటేశ్ తాజాగా ఓ హోటల్లో సందడి చేశారు. సామాన్యుడిలాగే హోటల్‌కు వెళ్లి టిఫిన్ చేశారు. బెంగళూరులోని విద్యార్థి భవన్ అనే హోటల్‌కు వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. వెంకీమామ సింప్లీసిటీని తెగ మెచ్చుకుంటున్నారు.
Honoured to host the ever-charming Mr. Venkatesh Daggubati @VenkyMama along with Mr. Rezwan Razack @indianbanknotes at Vidyarthi Bhavan for breakfast today!
It was truly our pleasure to serve one of Tollywood’s finest!❤️ pic.twitter.com/zKQqJIcTrB— Vidyarthi Bhavan (@VidyarthiBhavan) March 29, 2026
Tags : 1