Breaking News

'ఏఐ ఎంత ఎదిగినా.. వీళ్ల ఉద్యోగానికి డోకా లేదు'

Published on Sun, 03/29/2026 - 14:55

అన్ని రంగాల్లోనూ ఏఐ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో.. చాలామంది ఉద్యోగాలు పోతాయేమో అనే భయం గుప్పెట్లో చిక్కుకున్నారు. దీనిపై కొందరు నిపుణులు మిశ్రమంగా స్పందించారు. ఇప్పుడు తాజాగా అమెరికాకు చెందిన రక్షణ సాంకేతిక సంస్థ పలాంటిర్ టెక్నాలజీస్.. సీఈఓ 'అలెక్స్ కార్ప్' ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో కృత్రిమ మేధస్సు (AI) యుగంలో కూడా ఎవరు ఎదుగుతారు? అనే విషయంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఏఐ వల్ల ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయినా.. రెండు రకాల వ్యక్తులు మాత్రం భవిష్యత్తులో ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. మొదటివారు 'వృత్తి ఆధారిత నైపుణ్యాలు' కలిగిన వారు. ఉదాహరణకు మెకానిక్‌లు, ఎలక్ట్రిషన్‌లు, టెక్నీషియన్‌లు వంటి ప్రాక్టికల్ పనులు చేసే వ్యక్తులు. ఈ పనులను పూర్తిగా AI చేత భర్తీ చేయడం కష్టం.

రెండవ వర్గం 'న్యూరోడైవర్జెంట్' వ్యక్తులు. అంటే న్యూరోడైవర్సిటీ అనే భావనకు చెందిన వారు. సాధారణంగా కాకుండా.. భిన్నంగా ఆలోచించే వారు, కొత్త మార్గాలను అనుసరించే వారు, సృజనాత్మకంగా సమస్యలను పరిష్కరించే వారు వీరందరూ ఈ వర్గంలోకి వస్తారని అలెక్స్ కార్ప్ పేర్కొన్నారు.

సంప్రదాయ ఉద్యోగాలైన.. సాధారణ కోడింగ్, లా వర్క్, లేదా రీడింగ్, రైటింగ్ వంటి పనులను ఏఐ సులభంగా చేస్తుంది. అంటే ఈ రకమైన ఉద్యోగాలు చేసేవారు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అంటే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రంగాల్లో పనిచేసేవారు.. తప్పకుండా నైపుణ్యాలను పెంచుకోవాల్సి ఉంటుంది.

భవిష్యత్తులో ఎక్కువ ప్రాముఖ్యత పొందేది సృజనాత్మకత, ఒరిజినల్ ఆలోచన, కొత్తదనం సృష్టించే సామర్థ్యం మాత్రమే అని అలెక్స్ కార్ప్ పేర్కొన్నారు. మనం ఒక ఆర్టిస్ట్ మాదిరిగా ఆలోచించడం నేర్చుకోవాలి. విషయాలను భిన్న కోణాల్లో చూడగలగడం, కొత్త పరిష్కారాలను కనుగొనడం చాలా ముఖ్యం అవుతుంది. ఇలాంటి వాళ్లను ఏఐ కూడా ఏమీ చేయలేదు. కాబట్టి వృత్తి నైపుణ్యాలు కలిగిన వారు, భిన్నంగా ఆలోచించే వ్యక్తులు ఏఐ ప్రపంచంలో కూడా ముందంజలో ఉండే అవకాశముందని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: వారంలో తారుమారు.. బంగారం ధరల్లో ఇంత మార్పా!

#

Tags : 1

Videos

భారీ అగ్నిప్రమాదం.. పక్కనే పెట్రోల్ బంకు..

ఇదేమన్నా తొక్కుడు బిళ్ళ అనుకున్నావా.. అమరావతి రైతులతో ఆటలా..

వచ్చేది జగనే.. నువ్వు ఏ మాత్రం భయపడకు.. పవన్ వ్యాఖ్యలకు కేతిరెడ్డి కౌంటర్

ఇజ్రాయెల్ ఆకాశంలో వేల సంఖ్యలో కాకులు.. ఇది వినాశనానికి సంకేతమా?

వారణాసి, స్పిరిట్ కు సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన ధురంధర్

చంద్రబాబు సొంత జిల్లాలో TDP కి అవమానం

ఛత్తీస్ గఢ్ లో అరుదైన దృశ్యం.. సహపంక్తి భోజనాలు చేసిన మాజీ మావోయిస్టులు, పోలీసులు

సూపర్ పవర్ గేమ్ లో భారత్ డైలమా..

యూనివర్సిటీలపై దాడులు.. యూఎస్,ఇజ్రాయెల్ కు ఇరాన్ వార్నింగ్

తమిళనాడులో విజయ్ దూకుడు

Photos

+5

ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో నమ్రత (ఫోటోలు)

+5

ఫ్యాషన్‌ షోలో నగధగలు..అలరించిన మోడల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 29- ఏప్రిల్ 05)

+5

'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

90ల నాటి కలల రాణి.. మేకప్‌ లేకుండా నెరిసిన జుట్టుతో (ఫొటోలు)

+5

వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’...అలరించిన సినీ ప్రముఖుల ర్యాంప్‌ వాక్‌ (ఫొటోలు)

+5

వారణాసిలో యాంకర్ రష్మీ గౌతమ్ పూజలు (ఫొటోలు)

+5

శ్రీరామనవమి వేడుకల్లో మంచు మనోజ్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

చిరంజీవి ఆధ్వర్యంలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)