Breaking News

ఓటీటీలో శ్రీవిష్ణు థ్రిల్లింగ్‌ సినిమా.. ప్రకటన వచ్చేసింది

Published on Sun, 03/29/2026 - 09:38

టాలీవుడ్‌లో హీరో శ్రీవిష్ణు నటించిన కొత్త చిత్రం 'మృత్యుంజయ్' ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది.  తన కామెడీ జానర్‌ని వదిలి సస్పెన్స్ క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీతో థియేటర్‌లోకి వచ్చాడు. దర్శకుడు హుస్సేన్ షా కిర‌ణ్‌ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 6న విడుదలైంది. ఇందులో రెబా మోనికా జాన్‌, వీర్ ఆర్య‌న్‌, చిన్నా, సుద‌ర్శ‌న్‌, ర‌చ్చ ర‌వి, బాలాదిత్య తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని సందీప్ గున్నం మరియు వినయ్ చిలకపాటి నిర్మించగా, కాల భైరవ సంగీతం అందించారు.

'మృత్యుంజయ్' సినిమా ఏప్రిల్‌ 3న ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్(Netflix) అప్‌కమింగ్‌ చిత్రాల జాబితాలో అధికారికంగా ప్రకటించింది. క్రైం థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం థియేటర్స్‌లో ప్రేక్షకులను మెప్పించంది. అయితే, ఓటీటీలో ఏమేరకు రాణిస్తుందో చూడాలి. ఈ వీకెండ్‌లో థ్రిల్‌ తెప్పించే సినిమాగా 'మృత్యుంజయ్' ఉంటుందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

కథేంటంటే.. 
జ‌య్ (శ్రీవిష్ణు)..ఓ ప్రముఖ దినపత్రికలో యాడ్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తుంటాడు. ఎప్పటికైనా క్రైమ్ రిపోర్టర్‌గా మారాలనేది తన కల. ‘శ్రద్ధాంజలి’ యాడ్స్ కోసం చనిపోయిన వారి ఇంటికి వెళ్లి.. వాళ్ల గురించి గొప్ప‌లు చెబుతూ కుటుంబ స‌భ్యుల నుంచి ప్ర‌క‌ట‌న‌ల్ని తీసుకోస్తుంటాడు. అలా ఓ సారి అచ్యుత్‌రావు (బాలాదిత్య‌) అనే వ్యక్తి చనిపోయాడని తెలుసుకొని.. వాళ్ల ఇంటికి వెళ్తాడు. అక్కడ సైలెంట్‌గా ఉన్న అచ్యుత్‌రావు కూతురు అంజలిని చూడగానే అతని బ్యాల్యం గుర్తొస్తుంది. ఆమె అమాయకంగా ‘మా నాన్న‌కు అలా ఎందుకైంది’ అని ప్రశ్నించడం చూసి చలించిపోతాడు.

చిన్నారి ప్రశ్నకు సమాధానం చెప్పాలకుంటాడు. మూడు రోజుల తర్వాత అచ్యుత్ త‌ర‌హాలోనే  విక్రాంత్‌ అనే వ్య‌క్తి కూడా మ‌ర‌ణిస్తాడు. అయితే ఇవన్నీ ప్రమాదవశాత్తు జరిగిన మరణాలే అని పోలీసులు నిర్ధారణకు వస్తారు. కానీ ఏసీపీ సీత(రెబా మోనికా జాన్‌) మాత్రం ఈ మరణాల వెనుక ఏవైనా రహస్యాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ మొదలుపెడుతుంది. అవి ప్రమాదాలు కావని హత్యలని జయ్‌ తెలుసుకుంటాడు. ఈ విషయాన్ని ఏసీపీ సీత‌తోనూ చెబుతాడు. కానీ ఆధారాలు లేకపోవడంతో ఆమె పట్టించుకోదు. జయ్‌ మాత్రం ఈ హత్యల వెనుక ఉన్నదెవరో కనిపెట్టే ప్రయత్నం చేస్తాడు.నిజంగానే జయ్‌ చెప్పినట్టుగా అవి హత్యలేనా? ఎవరు చేసారు? ఎందుకు చేశారు? హంతకుడిని కనిపెట్టే క్రమలో జయ్‌కి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Videos

ఛత్తీస్ గఢ్ లో అరుదైన దృశ్యం.. సహపంక్తి భోజనాలు చేసిన మాజీ మావోయిస్టులు, పోలీసులు

సూపర్ పవర్ గేమ్ లో భారత్ డైలమా..

యూనివర్సిటీలపై దాడులు.. యూఎస్,ఇజ్రాయెల్ కు ఇరాన్ వార్నింగ్

తమిళనాడులో విజయ్ దూకుడు

రుక్మిణిని Unfollow చేసిన రిషబ్.. అసలేమైనట్టు..!

బంగారం అమ్మే సరైన సమయం ఇదే.. లాభం డబుల్ చేసే ట్రిక్!

వైరల్ అవుతోన్న రామ్ చరణ్ హోమం

తడబడుతున్న చంద్రబాబు.. థిస్ ఇస్ వెరీ బ్యాడ్

భర్తను చంపి పక్కనే పాతిపెట్టిన భార్య.. ట్విస్ట్ ఏంటంటే..?

సుబ్బారెడ్డి VS అఖిలప్రియ.. ఆళ్లగడ్డలో కేబుల్ వార్

Photos

+5

ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో నమ్రత (ఫోటోలు)

+5

ఫ్యాషన్‌ షోలో నగధగలు..అలరించిన మోడల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 29- ఏప్రిల్ 05)

+5

'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

90ల నాటి కలల రాణి.. మేకప్‌ లేకుండా నెరిసిన జుట్టుతో (ఫొటోలు)

+5

వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’...అలరించిన సినీ ప్రముఖుల ర్యాంప్‌ వాక్‌ (ఫొటోలు)

+5

వారణాసిలో యాంకర్ రష్మీ గౌతమ్ పూజలు (ఫొటోలు)

+5

శ్రీరామనవమి వేడుకల్లో మంచు మనోజ్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

చిరంజీవి ఆధ్వర్యంలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)