Breaking News

క్షమాపణలు చెప్పనక్కర్లేదు.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Fri, 03/27/2026 - 12:52

సినిమా ఇండస్ట్రీలోనే కాదు అన్ని చోట్ల మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వృత్తి జీవితంలో సర్దుకొని పోవాల్సి వస్తుంది. చాలా సందర్భాలలో తమ అభిప్రాయాలు, లక్ష్యాలు, ప్లాన్లు అన్నీ ఇతరులకు అనుకూలంగా మార్చుకుంటారని, అది త్యాగమని కూడా భావించకుండా..ముందుకు సాగుతున్నారు’ అని స్టార్‌ హీరోయిన్‌ సమంత ఆవేదన వ్యక్తం చేసింది. సమాజంలో గుర్తింపు పొందేందుకు  పురుషులతో పోలిస్తే మహిళలలు మరింత కష్టపడాల్సి వస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. తాజాగా హాలీవుడ్ రిపోర్టర్ సంస్థ నిర్వహించిన ఉమెన్ ఇన్ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో సమంత పాల్గొన్నారు.

ఆ అలవాటుని మార్చుకోవాలి
ఈ సందర్భంగా మహిళల స్థితిగతులపై సమంత మాట్లాడుతూ.. ‘సమాజంలో ఇతరులు సౌకర్యంగా ఉండటానికి మహిళలు తమ అభిప్రాయాలు, షెడ్యూళ్లను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. తమ ఆశయాలను వదులుకుంటూ , ఇతరుల కోసం బతకడం మహిళలకు అలవాటైపోయింది. ఇకనైనా మహిళలు ఈ అలవాటును మార్చుకోవాలి. తమకు తాము విలువ ఇచ్చుకోవడం చాలా అవసరం. సాధించిన విజయాలను గర్వంగా స్వీకరించాలి’ అని అన్నారు.

ఆ రోజులు రావాలి
సినిమా ఇండస్ట్రీలో మహిళలు..తగిన గుర్తింపు సంపాదించుకోవడానికి రెట్టింపు కష్టం చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలను ఒక రిస్క్ లాగా లేదా ఒక ప్రత్యేక కేటగిరి లాగా చూస్తున్నారు. ఆ రోజులు పోవాలి. వాటిని కూడా డిఫరెంట్‌ కథలు అని చెప్పుకునే రోజులు రావాలి.తెరపై మహిళలు కేవలం హీరోకి భార్యగానో .. హీరోకి ధైర్యం చెప్పడానికో పరిమితం కాకుండా నిజజీవితంలో ఉండే మహిళల లాగానే క్లిష్టమైన మనస్తత్వంతో ఉండాలి’అని సమంత తెలిపింది.

సారీ..అక్కర్లేదు
పురుషులతో పోలిస్తే.. మహిళలే ఎక్కువ సార్లు క్షమాపణలు కోరుతున్నారు. ఒకే పరిస్థితిలో పురుషుల కంటే మహిళలు దాదాపు పది రెట్లు ఎక్కువ సారీ అంటారని మీకు తెలుసా?, ఇది వారి ఆత్మవిశ్వాసం తగ్గిపోవడానికి ఒక సూచనగా పరిగణించవచ్చు. ప్రతి చిన్న విషయానికి క్షమాపణలు కోరాల్సిన అవసరం లేదు. ఇక చాలు.. మహిళలు ఇలా తమని తాము తగ్గించుకోవడం ఆపాలి.క్రెడిట్ తీసుకోవడం తప్పు కాదు. అంబిషన్ ఉండటం తప్పు కాదు. ఎవరో పొగిడితే సింపుల్‌గా థాంక్యూ అనడం అహంకారం కాదు. మీరు కష్టపడి సంపాదించుకున్న గౌరవాన్ని అనుభవించే హక్కు పూర్తిగా మీకు ఉంది’ అని సమంత చెప్పుకొచ్చింది. 

Videos

భారత్ పై యుద్ధ ప్రభావం మోదీ అలర్ట్ సీఎంలతో అత్యవసర మీటింగ్

వంట నూనెలకూ యుద్ధం సెగ ఉక్కిరిబిక్కిరి...

CSK స్కెచ్ అదుర్స్.. ఇక చెన్నైకి ధోని అవసరం లేదు

నేను ఆత్మహత్య చేసుకుంటా.. మరో సంచలన వీడియోతో ఆరవ శ్రీధర్ బాధితురాలు

CNG గ్యాస్ కోసం ఆటో డ్రైవర్ల పడిగాపులు

యువకుడు - వివాహిత ఏలూరు ఇంస్టాగ్రామ్ ప్రేమ కధ చివరికి ఏం జరిగిందంటే

విజయవాడ YSRCP ఆఫీస్ లో" శ్రీరామనవమి వేడుకలు

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

అమరావతి కాదు.. ATM ప్రతీ పైసా లెక్క చెప్పకపోతే.. బాబుపై MLC కల్పలతా రెడ్డి ఫైర్

ఛత్రపతి హిందీలో చేయకుండా ఉండాల్సింది

Photos

+5

వారణాసిలో యాంకర్ రష్మీ గౌతమ్ పూజలు (ఫొటోలు)

+5

శ్రీరామనవమి వేడుకల్లో మంచు మనోజ్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

చిరంజీవి ఆధ్వర్యంలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్‌ (ఫొటోలు)

+5

మార్కాపురం బస్సు ప్రమాదం.. హృదయ విదారక దృశ్యాలు

+5

అనంతపురంలో దేవరకొండ, రష్మిక సందడి (ఫొటోలు)

+5

భద్రాచలంలో కనుల పండువగా శ్రీసీతారాముల ఎదుర్కోలు ఉత్సాహం (ఫొటోలు)

+5

రష్మిక- విజయ్ పెళ్లికి నెల.. జ్ఞాపకాల్లో విరోష్ జంట.. (ఫోటోలు)

+5

కూతురితో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో బైకర్ మూవీ టీమ్ (ఫోటోలు)