Breaking News

రూ. 41 లక్షల జీతం వద్దనుకుని కవయిత్రిగా..!

Published on Thu, 03/26/2026 - 16:33

కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి చాలా ధైర్యం కావాలి. తీరా ఏ సమస్యలు వచ్చినా..తట్టుకుని ముందుకు సాగి..సక్సెస్‌ అందుకునే నేర్పు, ఓర్పు కూడా అవసరం. కానీ ఇక్కడొక మహిళ లక్షల​ వేతనం కాదనుకుని సాహిత్య రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. సృజనాత్మక శక్తిపై ఆధారపడి ఉన్న రంగం, అన్ని వేళలా..అంతగొప్పగా రచనలు చేసే అవకాశం లేని దాంట్లోకి వెళ్లాలనుకోవడమే సాహసం అంటే..మంచి లగ్జరీ లైప్‌ని అనుభవించే ఉద్యోగాన్ని వదులకోవడం అంతకుమించిన సాహసం అనే చెప్పాలి. కానీ ఈ మహిళ అంత పెద్ద సాహసం చేసి కవియిత్రి అనుపించుకోవడమే ఇష్టం అని చెబుతోంది.

ఆ అమ్మాయే 28 ఏళ్ల మాజీ కన్సల్టెంట్ అయిన నమ్రతా యాదవ్. ఆమె కవిత్వంపై అభిరుచితో సింగపూర్‌లోని కేపీఎంజీలో కార్పొరేట్‌ ఉద్యోగానికి స్వస్తి పలికింది. నిజానికి ఆమె న్యాయశాస్త్రంలో బ్యాచిలర్‌ డిగ్రీని పూర్తి చేసింది. ఆమె 2019, 2021 మధ్య నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్‌లో అంతర్జాతీయ సంబంధాలలో మాస్టర్స్ చేశారు. ఆ తర్వాత కార్పొరేట్ ప్రపంచంలోకి రాకముందు ఆమె అక్కడ ఆరు నెలల పాటు రీసెర్చ్ అనలిస్ట్‌గా పనిచేశారు. 

కన్సల్టింగ్‌ రంగంలో అడుగుపెట్టే ఉద్దేశ్యంతో ఒక పెద్ద సంస్థలో అనుభవం సంపాదించేందుకు కేపీఎంజీ(KPMG)లో చేరింది. అక్కడ వర్కింగ్‌ కల్చర్‌ కూడా నచ్చిందామెకు. ఏడాదికి దగ్గర దగ్గరగా రూ. 41 లక్షలు పైనే జీతం అందుకునేది. సింపుల్‌గా చెప్పాలంటే అక్కడ మంచి లగ్జరీ లైఫ్‌ని అనుభవించారామె. ఎలాంటి ఆర్థిక ఇబ్బందిని ఎదుర్కొనలేదామె. అయితే ఆ ఉద్యోగం తన వ్యక్తిత్వానికి సరిపోదని భావించి, సృజనాత్మకతకు పెద్దపీట వేసే సాహిత్యరంగంలోకి వచ్చేందుకు మొగ్గుచూపడం విశేషం. 

ఎక్కువ గంటలు శ్రమతో కూడిన కార్పొరేట్‌ జీవితం తన వల్ల కాదనిపించదని అన్నారామె. దగ్గర దగ్గర 40 గంటల పని, వారాంతాల్లో విరామంగా లైఫ్‌ ఉండకూదనిపించిందట. దాంతో సింగపూర్‌ నుంచి భారత్‌కి వచ్చేసి, క్రమం తప్పకుండా హిందీలో కవిత్వాలు రాయడం ప్రారంభించానని అంటోంది. పైగా ఒక్కత్తే ఆ దేశంలో జీవించడం పట్ల ఉన్న ఆందోళన కూడా ఈ నిర్ణయానికి ఒక కారణం అని అంటోందామె. 2024 డిసెంబర్‌లో, లక్నోలో జరిగిన ఒక సాహిత్య ఉత్సవంలో స్పోకెన్ వర్డ్ పొయెట్రీ ప్రదర్శన ఇవ్వడానికి ఎంపిక అవ్వడంతో తన డెసీషన్‌ సరైనదే అని నమ్రతకు నమ్మకం కలిగింది. 

అంతేగాదు అక్కడ వేదికపై కవిత్వం చెబుతున్న వారిని చూసి అభిమానిగా మారడం కంటే..వారిలో ఒకరిగా తాను అవ్వాలనే కోరిక కలిగిందట. ఆ ఉత్సాహంతోనే సింగపూర్‌ని పూర్తిగా విడిచిపెట్టి భారత్‌కి వచ్చేయాలని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యిందట. అంతేగాదు ప్రస్తుతం ముంబైలో తన రచనలకు వీలుక ల్పించే ఉద్యగాన్ని వెతికే పనిలో ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం మరో ఇద్దరు తనలాంటి క్రియేటివ్‌ వ్యక్తులతో కలిసి అపార్ట్‌మెంట్‌ షేర్‌ చేసుకుంటున్నట్లు తెలిపింది. అయితే అప్పటి వరకు తాను బాగా సంపాదించిన లైఫ్‌ నుంచి ఆదాయం లేకుండా గడపడానికి కాస్త ఇబ్బందిగా అనిపించినా..నాడు ఆర్జించిన పొదుపులే తనకు ఆసరాగా మారాయని అంటోంది. 

అలాగే మార్చి 28న జరగనున్న తన సోలో డెబ్యూ షో కోసం పనిచేయాలని నిర్ణయించకున్నట్లు తెలిపింది కూడా. అయితే ఈ నిర్ణయాన్ని తల్లిదండ్రులు మద్దతు తెలుపకపోయినా..ప్రస్తుతం తనను అర్థం చేసుకుంటున్నారని అంటోంది. ఏదీఏమైన తన అభిరుచి కోసం అంత మంచి ఉద్యోగాన్ని వదులుకోవడానికి చాలా ధైర్యం కావాలి. ఇంత డేర్‌ చేసినందుకైనా.. నమ్రత తాను అనుకున్నట్లుగా మంచి కవయిత్రి అవ్వాలని ఆశిద్దాం.

(చదవండి: పెళ్లి చేసుకోకుంటే ఇదంతా చేసేవాడిని కాదు..!: రిషి సునాక్‌)

 

 

#

Tags : 1

Videos

కడప స్టీల్ పై బాబు నాటకం

సుప్రియ ఒంటిపై ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి... పేర్ని నాని ఫైర్

ఓటమిని ఒప్పుకోండి.. మాతో మీరు గెలవడం కల్లా..

బ్లడీ బాస్టర్డ్.. సామాన్యుడిపై TDP ఎమ్మెల్యే బూతు పురాణం

అడ్డంగా నరికేస్తా.. యూజ్ లెస్ ఫెలో ఆదిరెడ్డికి ధమ్కీ ఇచ్చిన వ్యాపారి

మార్కాపురం ఘోర రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందంటే?

శవాన్ని తీసుకెళ్తుంటే 100 మంది దాడి చేశారు.. డిప్యూటీ సీఎంకి ఒకటే ప్రశ్న.

ఇన్వెస్టర్లకు జాక్పాట్ 1100% డివిడెండ్ ఇచ్చిన మైనింగ్ కంపెనీ

ఇన్వెస్టర్లకు పండగే లక్ష పెడితే 12 లక్షలు...ఒకటి కొంటే ఒకటి ఫ్రీ

YS జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు

Photos

+5

రష్మిక- విజయ్ పెళ్లికి నెల.. జ్ఞాపకాల్లో విరోష్ జంట.. (ఫోటోలు)

+5

కూతురితో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో బైకర్ మూవీ టీమ్ (ఫోటోలు)

+5

జూ.ఎన్టీఆర్‌ సతీమణి ప్ర‌ణ‌తి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : ఒక చేయి.. ఆపన్నహస్తాలెన్నో! ఈ ఫోటోలు చూడండి

+5

నువ్వు దేవుడిచ్చిన వరం.. కూతురిని చూసి మంచు లక్ష్మీ ఎమోషనల్ (ఫోటోలు)

+5

డిఫరెంట్ లుక్స్‌తో షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

వావ్ అనేలా మహేశ్-రాజమౌళి 'వారణాసి' సెట్స్ ఫొటోలు

+5

IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)

+5

హనీమూన్ కాదు బడ్డీమూన్.. రష్మిక-విజయ్ ఇలా (ఫొటోలు)