Breaking News

ఓటీటీలో రెండు థ్రిల్లింగ్‌ సినిమాలు.. స్ట్రీమింగ్‌ ప్రకటన

Published on Thu, 03/26/2026 - 12:00

మలయాళ ప్రేక్షకులను మెప్పించిన మస్తిష్క మరణం సినిమా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటించారు. రజీషా విజయన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సైన్స్‌ ఫిక్షన్‌ కామెడీ మూవీని దర్శకుడు కృషంద్‌ ఆర్కే తెరకెక్కించారు. కృష్ణంద్ ఫిల్మ్స్ సహకారంతో అజిత్ వినాయక ఫిల్మ్స్ బ్యానర్‌పై వినాయక అజిత్ నిర్మించారు. ఫిబ్రవరి 27న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఆకట్టుకుంది.

‘మస్తిష్క మరణం’ (Masthishka Maranam) మార్చి 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో స్ట్రీమింగ్‌ కానుంది. అయితే, తెలుగు వర్షన్‌ గురించి సరైన సమాచారం ప్రస్తుతానికి లేదు. తన బిడ్డను కోల్పోయిన దుఃఖం నుండి బయటపడలేక, గడిచిన క్షణాలను తిరిగి అనుభవించాలనే  ప్రయత్నంలో ఒక తండ్రి, అత్యాధునిక వర్చువల్ రియాలిటీ మెమరీ కన్సోల్‌ను ఆశ్రయిస్తాడు. ఇది ఒక డార్క్ కామెడీ, సైన్స్ ఫిక్షన్ సినిమాగా, సమాజంపై వ్యంగ్య అస్త్రంగా రూపొందింది. 2046లో, ప్రజల జ్ఞాపకాలు , అనుభవాలు డిజిటల్‌గా రికార్డ్ చేయబడి, వ్యాపారంగా చేయబడతాయి. మనుషులు తమ బాధలను కూడా వైద్య చికిత్స ద్వారా మర్చిపోగలరు. ఈ కాన్సెప్ట్‌తోనే సినిమాను తెరకెక్కించారు.

ఓటీటీలో వధ్‌-2
బాలీవుడ్‌ ప్రేక్షకులను మెప్పించిన సినిమా ‘వధ్‌’ (2022)..  ఈ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన క్రైమ్‌ డ్రామా చిత్రం ‘వధ్‌- 2’ గతేడాది థియేటర్స్‌లోకి వచ్చింది. అయితే, ఇప్పుడు ఈ మూవీ కూడా  ఓటీటీలోకి రానుంది. ఏప్రిల్ 3న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో వరల్డ్‌వైడ్‌గా స్ట్రీమింగ్ కాబోతోంది. సీనియర్ నటులు సంజయ్ మిశ్రా, నీనా గుప్తా మెయిన్ లీడ్స్‌గా నటించిన ఈ సినిమాను దర్శకుడు జస్పాల్ సింగ్ సంధు తెరకెక్కించారు. థ్రిల్లింగ్‌ సినిమాలను ఇష్టపడేవాల్లకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది.
 

#

Tags : 1

Videos

బ్లడీ బాస్టర్డ్.. సామాన్యుడిపై TDP ఎమ్మెల్యే బూతు పురాణం

అడ్డంగా నరికేస్తా.. యూజ్ లెస్ ఫెలో ఆదిరెడ్డికి ధమ్కీ ఇచ్చిన వ్యాపారి

మార్కాపురం ఘోర రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందంటే?

శవాన్ని తీసుకెళ్తుంటే 100 మంది దాడి చేశారు.. డిప్యూటీ సీఎంకి ఒకటే ప్రశ్న.

ఇన్వెస్టర్లకు జాక్పాట్ 1100% డివిడెండ్ ఇచ్చిన మైనింగ్ కంపెనీ

ఇన్వెస్టర్లకు పండగే లక్ష పెడితే 12 లక్షలు...ఒకటి కొంటే ఒకటి ఫ్రీ

YS జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు

అమరావతిలో బాబు అవినీతి యజ్ఞం

4 గంటల్లోనే బంగారం ధరలు భారీగా పెరిగాయి..

దొరకాలి నా కొడుకు.. పెట్రోల్ పోసి తగలబెడతా

Photos

+5

కూతురితో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో బైకర్ మూవీ టీమ్ (ఫోటోలు)

+5

జూ.ఎన్టీఆర్‌ సతీమణి ప్ర‌ణ‌తి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : ఒక చేయి.. ఆపన్నహస్తాలెన్నో! ఈ ఫోటోలు చూడండి

+5

నువ్వు దేవుడిచ్చిన వరం.. కూతురిని చూసి మంచు లక్ష్మీ ఎమోషనల్ (ఫోటోలు)

+5

డిఫరెంట్ లుక్స్‌తో షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

వావ్ అనేలా మహేశ్-రాజమౌళి 'వారణాసి' సెట్స్ ఫొటోలు

+5

IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)

+5

హనీమూన్ కాదు బడ్డీమూన్.. రష్మిక-విజయ్ ఇలా (ఫొటోలు)

+5

ఇదేం బిల్డప్‌ చంద్రబాబూ.. క్రెడిట్ చోరీ ఆగదా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)