ధురంధర్‌ 2 ఎఫెక్ట్‌.. స్టార్‌ హీరో సినిమా వాయిదా

Published on Wed, 03/25/2026 - 13:30

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్ కుమార్  నటించిన ‘భూత్‌ బంగ్లా’ విడుదల మరోసారి వాయిదా పడనుంది. ఈమేరకు సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. అక్షయ్‌, దర్శకుడు ప్రియదర్శన్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న హారర్‌ కామెడీ సినిమా ‘భూత్‌ బంగ్లా’.  ఇందులో టబు, వామికా గబ్బి, పరేష్‌ రావల్, రాజ్‌పాల్‌ యాదవ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. అక్షయ్‌ కుమార్, శోభా కపూర్, ఏక్తా కపూర్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తొలుత ఏప్రిల్‌ 2న రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వాత ఏప్రిల్‌ 10న రిలీజ్‌ చేయనున్నట్లుగా ప్రకటించారు. ఇప్పుడు మరోసారి వాయిదా పడనుందని వార్తలు వస్తున్నాయి.

రణ్‌వీర్‌ సింగ్‌ ‘ధురంధర్‌ 2’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్స్‌తో రికార్డ్‌ క్రియేట్‌ చేస్తుంది. దీంతో ఏప్రిల్‌ 10న భూత్‌ బంగ్లా విడుదల  కష్టమేనని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం మరో వారం పాటు వాయిదా పడి, ఏప్రిల్ 17, 2026న కొత్త విడుదల తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది.  'ధురందర్: ది రివెంజ్' భారీ విజయం సాధించి, బాక్సాఫీస్‌ను శాసిస్తూ ఉండటమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. అధికారికంగా ప్రకటించే ఛాన్స్‌ ఉంది.
 

Videos

ఐదేళ్లలో లక్షను కోటి చేసిన ఐటీ స్టాక్.. ఏకంగా 10 వేల శాతం జంప్ ...

KCR మంచి దోస్త్ నాకు..

తొందర పడకు.. ప్రతి రోజు సినిమా చూపిస్తా..

BJP MLA రాకేష్ రెడ్డి క్షమాపణ చెప్పాలి..

పూరీలా ఒక్క రోజు బతికితే చాలు..

పరిస్థితుల్ని అదుపుచేయ్యాలి అంటే లాక్ డౌన్ తప్పదా..?

ఆ బిల్లుకు పూర్తి మద్దతు మోదీకి జగన్ ట్వీట్

కూటమి వేధింపులు.. IAS, IPSలను కూడా వదలరా!

యుద్ధం పేరుతో గ్యాస్ మాటలు... కిరోసిన్ ఇస్తావు సరే... స్టవ్ లు సంగతేంటి

ఇబ్బందులు ఉంటాయి తెలిసినా అశోక్ బాబు మాత్రం...

Photos

+5

నువ్వు దేవుడిచ్చిన వరం.. కూతురిని చూసి మంచు లక్ష్మీ ఎమోషనల్ (ఫోటోలు)

+5

డిఫరెంట్ లుక్స్‌తో షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

వావ్ అనేలా మహేశ్-రాజమౌళి 'వారణాసి' సెట్స్ ఫొటోలు

+5

IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)

+5

హనీమూన్ కాదు బడ్డీమూన్.. రష్మిక-విజయ్ ఇలా (ఫొటోలు)

+5

ఇదేం బిల్డప్‌ చంద్రబాబూ.. క్రెడిట్ చోరీ ఆగదా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

యువ నటుడు కెన్ కరుణాస్ 'యూత్' సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : పెట్రోల్‌ బంక్‌ల వద్ద భారీ క్యూ.. వదంతులతో జనం పరుగులు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో జోరు వాన (ఫోటోలు)

+5

నటిని పెళ్లాడిన ప్రముఖ ర్యాపర్‌ బాద్‌షా (ఫోటోలు)