అదుర్స్ సీక్వెల్‌.. వీవీ వినాయక్ ఏమన్నారంటే?

Published on Tue, 03/24/2026 - 16:41

టాలీవుడ్ ప్రియులను ఫుల్ ఎంటర్‌టైన్‌ చేసిన చిత్రాల్లో అదుర్స్ ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ డబుల్‌ యాక్షన్‌ చేసిన ఈ మూవీసో మాస్ అండ్‌ కామెడీతో అభిమానులను ఆకట్టుకున్నారు. చారి పాత్రలో అందరినీ కడుపుబ్బా నవ్వించారు. బ్రహ్మనందంతో కలిసి చేసిన కామెడీ సినీ ప్రియులకు ఎప్పటికీ గుర్తు ఉంటుంది. ఈ చిత్రానికి వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే ఈ మూవీ సీక్వెల్ రానుందని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. గతంలో టాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కోన వెంకట్‌ కూడా సీక్వెల్‌పై మాట్లాడారు. అదుర్స్-2 స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని కామెంట్స్ చేశారు. ఈ ప్రకటనతో సీక్వెల్‌పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తాజాగా ఓ మూవీ ఈవెంట్‌కు హాజరైన డైరెక్టర్ వీవీ వినాయక్‌ అదుర్స్‌-2పై మాట్లాడారు.

ఈ విషయంలో దర్శకుడు వినాయక్‌ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. మనం ఫ్రాంక్‌గా మాట్లాడుకుంటే ఆ సినిమా అక్కడితోనే అయిపోయిందని స్పష్టం చేశారు. ఇక సీక్వెల్ తీసేందుకు ఏమీ మిగలలేదని అన్నారు. ఒకవేళ సీక్వెల్ బలవంతంగా తీసినా.. మళ్లీ అంత గొప్పగా చేయగలమనే నమ్మకం నాకు లేదని తెలిపారు. అందుకే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయడం బెటర్ అని వీవీ వినాయక్ వెల్లడించారు.

Videos

ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్

ప్రభాస్ సీక్వెల్ సినిమాలపై ధురంధర్ ఎఫెక్ట్

పసిడి ప్రేమికులకు పండగ.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..!

మొదలైన పెట్రోల్.. డీజిల్ కష్టాలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు..

భారత్‌లో గ్యాస్, పెట్రోల్ సంక్షోభం..! మోదీ క్లారిటీ..

కూటమిలో కామ పిశాచులు

ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాల్లో భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు?!

అనకాపల్లి స్టీల్ ప్లాంట్ రావడానికి కారణం జగనే

ఇరాన్ కు రష్యా సాయం? ఆధారాలు ఉన్నాయన్న జెలెన్ స్కీ

కల్తీ పాల నిందితులను కఠినంగా శిక్షించాలి

Photos

+5

హైదరాబాద్‌లో జోరు వాన (ఫోటోలు)

+5

నటిని పెళ్లాడిన ప్రముఖ ర్యాపర్‌ బాద్‌షా (ఫోటోలు)

+5

దురంధర్‌-2 మూవీ.. ఈ అరుదైన షూటింగ్ ఫోటోలు చూశారా? (ఫోటోలు)

+5

రష్మిక-విజయ్ దేవరకొండ వెడ్డింగ్..ఈ అరుదైన ఫోటోలు చూశారా? (ఫోటోలు)

+5

ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్

+5

విశాఖపట్నంలో సినీ నటి శ్రుతి హాసన్‌ సందడి (ఫొటోలు)

+5

శ్రీరామనవమి స్పెషల్ : ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ధురంధర్‌ 2కి బ్లాక్‌బస్టర్‌ టాక్‌.. ట్రెండింగ్‌లో హీరోయిన్‌ సారా (ఫోటోలు)

+5

ఘనంగా 'బ్యాండ్‌ మేళం' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన అద్భుత ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)