ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్
Breaking News
దంపతుల ఫిట్నెస్ కోసం..! మిలింద్ సోమన్ టిప్స్
Published on Tue, 03/24/2026 - 12:38
భారత్‌లో ఫిట్నెస్ అందరికీ అందుబాటులో ఉండేలా అవగాహన కల్పిచే వ్యక్తుల్లో ప్రముఖులు మిలింద్ సోమన్. ఆయన 90వ దశకపు పాప్ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన వ్యక్తి నుంచి..ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్‌కు పోస్టర్ బాయ్‌గా మారే వరకు సోమన్ ప్రయాణం..కండరాల నిర్మాణం కంటే..క్రమశిక్షణకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆయన చేసే మారథాన్లు, లాంగ్ వాక్‌లు అన్ని ఆర్భాటానికి తావివ్వకుండా చెప్పులు కూడా లేకుండా నిశబ్దంగా సాగుతాయి. అలాంటి సోమన్ దంపతులు హెల్దీ లైఫ్‌ని లీడ్ చేయాలంటే ఆహరంతో కాకుండా, కదలికలతో బంధాన్ని ఏర్పాటు చేసుకోండి అని పిలుపునిస్తూ..పలు ఆసక్తికర ఫిట్నెస్ సలహాలు ఇచ్చారు. అవేంటంటే..
సోమన్ దృష్టిలో, ఫిట్నెస్ అంటే ఒకేసారి చేసే వ్యాయామాలు లేదా ఒకే రకమైన దినచర్యలు కాదని అంటారు. ఇది ఉమ్మడి లక్ష్యానికి సంబంధించినదిగా చేసుకుంటే దంపతులు ఇరువురు ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. జంటలు కలసి వ్యాయామాలకు సంబంధించి..సింపుల్ వాటిని ఎంచుకుంటూ సాగితే..వారి మధ్య బంధం మరింత బలపడుతుందని అంటున్నారు.
అంతేగాదు జీవితం నుంచి ఇరువురు ఏం ఆశిస్తున్నారో ఇద్దరికీ స్పష్టత వస్తుంది. ఇక్కడ సోమన్ తాను ఎక్కువసేపు శ్రమించే కార్యకలాపాలవైపు మొగ్గు చూపితే..ఆమె యోగా ద్వారా ప్రశాంతతను తీసుకువస్తుందట. ఈ వైరుధ్యం వారిని విభజించకుండా, ఇద్దరి విధానాలను మరింతగా బలపరించిందని చెబుతున్నారు సోమన్. ప్రతిసారి ఒకే వర్కౌట్లని చేయడం కాదు, ఆరోగ్యంగా ఉండటానికి ఒకరి విధానాన్ని మరొకరు గౌరవించుకోవడం ముఖ్యం.
జంక్ ఫుడ్ డేట్స్‌కు అతీతంగా
చాలామటుకు దంపతులు భోజనానికి బయట ప్రాధాన్యత ఇస్తారు. అర్థారాత్రి వరకు చిరుతిండ్లు తినడం, వారాంతపు విలాసాలతో బిజీగా ఉంటారు. అయితే దంపతులు ఈ అలవాట్లను శారీరక కార్యకలాపాలతో భర్తీ చేస్తే..ఇద్దరి ఆరోగ్యానికి ఎంత మేలు చేకూరుతుందని పిలుపునిస్తున్నారు.
అవి సరదా సరదాగా సాగే విహారయాత్రలు, వాకింగ్, ఈత కొట్టడం, తదితర మార్గాల్లో కొత్తదనంతో కూడిన వ్యాయామ కదలికలను అన్వేషించాలి. ఇవి శారీరక మానిసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేసే మంచి అలవాట్లకు మారతాయట. ఈ జీవనశైలితో జంటలు మరింత బలంగా, సంతోషంగా, పైగా ఒకరికొకరు అనేలా అనుబంధంగా ఉంటారని బలంగా నమ్ముతానని చెబుతున్నారు సోమన్.
సోమన్ ఫిట్నెస్..
తరచుగా ఫిట్నెస్ ఐకాన్‌గా పిలిచే సోమన్ దినచర్య ఎంతమాత్రం కఠినంగా ఉండదు. ఆయన జిమ్‌కి వెళ్లరు, పర్సనల్ ట్రైనర్ కూడా లేరు. కానీ కొన్ని వారాలు లేదా మూడు, నాలుగుసార్లు పరుగెట్టడం, మరికొన్ని వారాలు అస్సలు పరిగెత్తకుండా ఉంటారు. తీవ్రత వ్యాయామాల కంటే..నిలకడకు ప్రాధాన్యత ఇస్తారు సోమన్. ఎక్కువగా పుష్-అప్స్, స్క్వాట్స్, ప్లాంక్స్ వంటి ప్రాథమిక వ్యాయామాలు చేస్తుంటారు. ప్రయాణిస్తున్నప్పుడూ కూడా కదలకలు ఉండేలా చూసుకుంటారాయన.
ఫిట్నెస్ ప్రయాణంపై మహిళలకు సూచనలు..
బిజీగా ఉండే పట్టణ జీవనశైలిలో ఉన్న మహిళలకు సోమన్ ఆచరణాత్మకమైన సలహాలందించారు. అవేంటంటే..
మూడు కిలోల మీటర్ల దూరం నుంచి క్రమంగా ఐదు లేదా పది కిలోమీటర్లకు నడక పెంచడం. అలాగే అతివేగంగా వ్యాయామాలు చేయొద్దని సూచించారు. అన్నింటికంటే నిలకడను నేర్చుకోమని చెబుతున్నారు. తాను తొమ్మిదేళ్ల వయసులో జాతీయ స్థాయి ఈతగాడిగా లైఫ్‌ని ప్రారంభించి..కదలికల చుట్టూ కేంద్రీకృతమైన జీవితానికి పునాది వేశానని చెబుతున్నారు. ఆయన క్రీడాకారుడి నుంచి సూపర్‌మోడల్‌గా, చివరికి ఫిట్నెస్ కోసం బహిరంగంగా ప్రచారం చేసే వ్యక్తిగా మారడం వరకు చూస్తే..అదంగా అసాధారణంగా కనిపిస్తుందని అన్నారు.
సోమన్ దార్శనికతను ప్రతిబింబించే కార్యక్రమం ఏదైనా ఉందంటే అది పింకాథాన్ మాత్రమే. కేవలం మహిళల కోసం ఒక పరుగు పోటీగా ప్రారంభమైన ఇది, క్రమంగా మహిళలు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చేలా ప్రోత్సహించే ఒక దేశవ్యాప్త ఉద్యమంగా రూపుదిద్దుకోవడం విశేషం.
మొదటిసారి పరుగెత్తేవారి నుంచి దృష్టి లోపం ఉన్నవారి వరకు, పసిపిల్లలతో పరుగెత్తే తల్లుల నుంచి చీరలు కట్టుకున్న అమ్మమ్మల వరకు, ఫిట్నెస్ ఎవరి కోసం అనే మూస ధోరణులను పింకాథాన్ నిరంతరం సవాలు చేస్తూ వస్తోంది.
దాని ఎదుగుదల కూడా అంతే స్పష్టంగా ఉంది. వివిధ నగరాల్లో పాల్గొనేవారి సంఖ్య పెరగడంతో, వేలాది మంది మహిళలు ఇందులో చేరడంతో, ఈ కార్యక్రమం కేవలం ఒక మారథాన్ స్థాయిని దాటిపోయింది. ఇది ఇప్పుడు శారీరక, మానసిక, భావోద్వేగ శ్రేయస్సును ప్రోత్సహించే ఒక సమాజంగా మారింది.
(చదవండి: పూనకాలకు కారణం ఏంటో తెలుసా..!)
Tags : 1