ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్
Breaking News
18 ఏళ్లకే తల్లి పాత్ర.. ‘ధురంధర్’ నటిపై ప్రశంసలు
Published on Tue, 03/24/2026 - 12:19
సాధారణంగా హీరోయిన్లు ఎక్కువగా గ్లామర్ పాత్రలే చేస్తుంటారు. నటనకు స్కోప్ ఉండే పాత్రలు రేర్‌గా వస్తుంటాయి. అలా వచ్చినప్పుడే కొంతమంది తమ టాలెంట్‌ని నిరూపించుకుంటారు. అయితే అందులోనూ తమ వయసు తగ్గ పాత్రలనే ఎంచుకుంటారు. ముఖ్యంగా తల్లి పాత్రలు చేయాల్సి వస్తే సీనియర్ హీరోయిన్లు సైతం ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. 30 ఏళ్లు దాటినా.. తల్లి పాత్ర చేయమని అడిగితే నో చెప్పే హీరోయిన్లు చాలామందే ఉన్నారు. కానీ సారా అర్జున్ మాత్రం 18 ఏళ్లకే తల్లి పాత్ర చేసింది. అది కూడా 40 ఏళ్ల వయసు ఉన్న హీరో నటించిన పాన్ ఇండియా సినిమాలో. అదే ధురంధర్ 2.
ధురంధర్ సినిమా సమయంలో సారాపై పెద్ద ఎత్తున ట్రోల్ నడిచింది. 40 ఏళ్ల వయసు ఉన్న హీరో(రణ్వీర్ సింగ్)తో రొమాన్స్ చేయబోతుందంటూ ఆమెను విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. కానీ ధురంధర్ రిలీజ్ తర్వాత అందరూ ఆమెపై ప్రశంసలు కురిరించారు. చిన్న పిల్ల అయినా బాగా నటించిందని అభినందించారు.
అయితే పార్ట్ 1లో కేవలం హీరో ప్రియురాలి పాత్రలో కనిపించిన సారా.. పార్ట్ 2 మాత్రం ఓ బిడ్డకు తల్లిగా నటించి, మెప్పించింది. ప్రస్తుతం సారా వయసు 20 ఏళ్లు. ధురంధర్ షూటింగ్ సమయంలో ఆమె వయసు 18 ఏళ్లు మాత్రమే. అంత చిన్న వయసులో తల్లి పాత్ర ఒప్పుకొని సారా పెద్ద సాహసమే చేసింది.
కథపై నమ్మకంతోనే సారా ఆ పాత్ర చేసేందుకు అంగీకరించిందట. తల్లి పాత్ర ఉంటుందని చెప్పగానే ఏమాత్రం సంకోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఈ విషయాన్ని ధురంధర్ సినిమా కాస్టింగ్ డైరెక్టర్ ముకేష్ చబ్రా చెప్పారు.
‘పార్ట్ 2లో తల్లి పాత్ర పోషిస్తున్నానా అనే విషయాన్ని కూడా సారా అడగలేదు. కథ విని వెంటనే ఓకే చెప్పింది. దీంతో ఆమెకు లుక్ టెస్ట్ చేశాం. నేను చేసిన లుక్ టెస్ట్‌లోనూ సారానే ది బెస్ట్ అనిపించింది. అందుకే ఆ పాత్రకు ఎంపిక చేశాం’ అని ముకేష్ అన్నారు. కాగా, ధురంధర్ కాస్టింగ్‌పై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాలోని ప్రతి పాత్రకు సరైన నటుడిని ఎంచుకున్నారని, తెరపై చూస్తుంటే వారు తప్ప వేరే నటుడు అలా చేయరేమో అన్నట్లుగా పాత్రలను తీర్చిదిద్దారంటూ సినిమా చూసినవాళ్లు చెబుతున్నారు.
Tags : 1