Breaking News

ట్రంప్ ప్రకటన.. ఒక్కసారిగా తగ్గిన చమురు ధరలు!

Published on Mon, 03/23/2026 - 21:13

''ఇరాన్‌తో యుద్ధానికి బ్రేక్‌ ఇస్తున్నాం, తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపేస్తున్నాం, మరో ఐదు రోజుల పాటు యుద్ధాన్ని నిలిపేస్తున్నాం'' చర్చలు జరుగుతున్నాయని అమెరిక అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని క్షణాలకే చమురు ధరలు 13 శాతానికి పైగా పడిపోయాయి. ఇదే సమయంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 96 డాలర్లకు, అంటే 14 శాతం వరకు తగ్గింది.

బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ సుమారు 17 డాలర్లు, అంటే 15 శాతం పడిపోయి, 1108 GMT సమయానికి బ్యారెల్‌కు 96 డాలర్ల సెషన్ కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) 13 డాలర్లు, అంటే సుమారు 13.5 శాతం పడిపోయి, సెషన్ కనిష్ట స్థాయి అయిన 85.28 డాలర్లకు చేరింది.

అయితే.. ట్రంప్ పేర్కొన్నట్లు  అటువంటి చర్చలు ఏవీ జరగలేదని ఇరాన్ ఖండించిన తర్వాత, చమురు ధరలు సుమారు 5 శాతం పెరిగి బ్యారెల్‌కు 101 డాలర్లకు చేరుకున్నాయి, కానీ మళ్లీ 100 డాలర్ల స్థాయి కంటే దిగువకు పడిపోయాయి.

అమెరికా,ఇజ్రాయెల్ - ఇరాన్ సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి బ్రెంట్ క్రూడ్ ధరలు 60 శాతానికి పైగా పెరిగాయి. సంఘర్షణకు ముందు బ్యారెల్‌కు సుమారు 70 డాలర్లుగా ఉన్న ఈ ధరలు, ప్రధానంగా హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరాకు అంతరాయం కలగడం, గల్ఫ్ ప్రాంతంలోని ఇంధన కేంద్రాలపై జరిగిన దాడుల కారణంగా, సోమవారం నాటికి బ్యారెల్‌కు సుమారు 112 డాలర్లకు చేరుకున్నాయి. దీన్నిబట్టి చూస్తే.. కేవలం గత 30 రోజుల్లోనే ముడి చమురు ధరలు ఎంత గరిష్టాలకు చేరుకున్నాయో స్పష్టమవుతోంది.

Videos

ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్

ప్రభాస్ సీక్వెల్ సినిమాలపై ధురంధర్ ఎఫెక్ట్

పసిడి ప్రేమికులకు పండగ.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..!

మొదలైన పెట్రోల్.. డీజిల్ కష్టాలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు..

భారత్‌లో గ్యాస్, పెట్రోల్ సంక్షోభం..! మోదీ క్లారిటీ..

కూటమిలో కామ పిశాచులు

ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాల్లో భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు?!

అనకాపల్లి స్టీల్ ప్లాంట్ రావడానికి కారణం జగనే

ఇరాన్ కు రష్యా సాయం? ఆధారాలు ఉన్నాయన్న జెలెన్ స్కీ

కల్తీ పాల నిందితులను కఠినంగా శిక్షించాలి

Photos

+5

రష్మిక-విజయ్ దేవరకొండ వెడ్డింగ్..ఈ అరుదైన ఫోటోలు చూశారా? (ఫోటోలు)

+5

ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్

+5

విశాఖపట్నంలో సినీ నటి శ్రుతి హాసన్‌ సందడి (ఫొటోలు)

+5

శ్రీరామనవమి స్పెషల్ : ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ధురంధర్‌ 2కి బ్లాక్‌బస్టర్‌ టాక్‌.. ట్రెండింగ్‌లో హీరోయిన్‌ సారా (ఫోటోలు)

+5

ఘనంగా 'బ్యాండ్‌ మేళం' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన అద్భుత ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడ : సమ్మోహనం.. ఆంధ్ర నాట్యం (ఫొటోలు)

+5

శర్వానంద్ 'బైకర్' సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి (ఫోటోలు)