Breaking News

రికార్డులు బ్రేక్ చేసినా 'పుష్ప2'ని దాటలేకపోయింది

Published on Mon, 03/23/2026 - 12:57

ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 'ధురంధర్ 2' సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. బీభత్సమైన అంచనాలతో బరిలోకి దిగిన ఈ మూవీ ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోని బీ,సీ సెంటర్లలోనూ హవా చూపిస్తుండటం ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరుస్తోంది. మొదటి రోజు నుంచి వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు తొలి వీకెండ్ పూర్తయ్యేసరికి ఊహించని రికార్డులు సొంతం చేసుకుంది. ఇంతకీ నాలుగు రోజుల కలెక్షన్స్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?

(ఇదీ చదవండి: ధురంధర్‌ 2 సక్సెస్‌: 28 ఏళ్ల నాటి లేఖ వైరల్‌)

తొలి వీకెండ్ పూర్తయ్యేసరికి 'ధురంధర్ 2' చిత్రానికి రూ.750 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం ఒక్కరోజే కేవలం మన దేశంలోనే రూ.115 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదో రికార్డ్. ఇప్పటివరకు వీకెండ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'పుష్ప 2' రూ.762 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా.. దీని తర్వాతి స్థానంలోకి 'ధురంధర్ 2' వెళ్లింది. ఈ క్రమంలోనే బాహుబలి 2 (రూ.591 కోట్లు), ఆర్ఆర్ఆర్ (రూ.470 కోట్లు), కల్కి 2898 ఏడీ (రూ.500 కోట్లు) తదితర రికార్డులు బ్రేక్ చేసింది.

మరోవైపు బాలీవుడ్‌లోనూ ఇప్పటివరకు షారుఖ్ ఖాన్ 'పఠాన్' పేరిట రూ.287 కోట్ల కలెక్షన్స్ రికార్డ్ ఉంది. దీన్ని 'ధురంధర్ 2' అధిగమించడంతో పాటు సరికొత్త ఘనత సాధించింది. చూస్తుంటే ఇప్పుడప్పుడే ఈ చిత్ర రచ్చ ఆగేలా లేదు. తొలి వారం పూర్తయ్యేసరికి రూ.1000 కోట్లు సాధించడం పక్కా అనిపిస్తుంది. అలానే రూ.2000 కోట్ల మార్క్‌ని కూడా త్వరలోనే అందుకునే అవకాశముందని విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు)

Videos

నా రెండు కాళ్లు విడదీసి.. మిస్టర్ పెమ్మసాని.. గుర్తుపెట్టుకో..

మళ్ళీ ట్రాక్ తప్పుతోన్న ప్రభాస్..

లంచం తీసుకుంటూ దొరికిన లాజిస్టిక్స్ మేనేజర్

మల్లారెడ్డి.. కబడ్డీ, కబడ్డీ

పొరపాటున ఊర్లోకెళితే.. కోడిగుడ్లు, రాళ్లతో ఉరికించి కొడతారు..

రంగస్థలం 2 కి రంగం సిద్ధం

ఉద్యోగులకు కొత్త రూల్స్.. తల్లిదండ్రులను చూసుకోకపోతే జీతం కట్!

విశాఖ స్టీల్ భవిష్యత్తు అయోమయం.. అమరావతి పేరుతో అప్పులు, దోపిడీ

మొత్తం బరితెగించి పోయారు.. తిరుపతి ప్రతిష్టను చంద్రబాబు మంట కలిపారు..

న్యూయార్క్ సిటీలో ఘోర విమాన ప్రమాదం

Photos

+5

హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన అద్భుత ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడ : సమ్మోహనం.. ఆంధ్ర నాట్యం (ఫొటోలు)

+5

శర్వానంద్ 'బైకర్' సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి (ఫోటోలు)

+5

మోడర్న్‌ లెహంగాలో ముద్దమందారంలా మిల్కీబ్యూటీ.. (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 22-29)

+5

ప్రియుడిని పెళ్లాడిన బిగ్‌బాస్‌ బ్యూటీ పునర్నవి (ఫోటోలు)

+5

సంగీత సంబరం.. ట్రాఫిక్‌ సంకటం (ఫోటోలు)

+5

Ramzan celebrations : హైదరాబాద్ లో ఘనంగా రంజాన్ వేడుకలు (ఫొటోలు)

+5

బుజ్జి అభిమానితో భోజనం చేసిన 'విరోష్‌' జోడీ (ఫోటోలు)