ఆ మాత్రం దానికి పెళ్లి ఎందుకు?, 34 ఏళ్ల నటి షాకింగ్‌ కామెంట్స్‌

Published on Sun, 03/22/2026 - 13:03

ఈ మధ్య చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకోమనే చెబుతున్నారు. మరికొంతమంది అయితే తనకు నచ్చిన అబ్బాయి దొరికితే చేసుకుంటా..లేదంటే సింగిల్‌గానే ఉంటామని అంటున్నారు. తాజాగా కన్నడ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి కూడా అదే కామెంట్‌ చేసింది. జీవితంలో పెళ్లి అనేది తప్పనిసరి కాదని, తోడు కావాలనుకుంటే సహజీవనం బెటర్‌ అని చెబుతోంది ఈ 34 ఏళ్ల సుందరి. 

తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘గత 30 ఏళ్ల నా జీవితంలో పెళ్లి చేసుకున్న జంటలను ఎన్నో చూశా. వారిలో సంతోషంగా జీవితం గడుపుతున్నవారు చాలా తక్కువ. పెళ్లి తర్వాత భాగస్వామి కెరియర్‌లో ఆటంకాలు కలగడం నన్ను ఆలోచింపజేశాయి. ఒకప్పుడు అందరి అమ్మాయిల్లాగానే నేను కూడా పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాను. నా ఫ్రొఫైల్‌ని మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లోనూ పెట్టాను. అయితే నా ఫోటో చూసి ఫేక్‌ ప్రొఫెల్‌ అనుకున్నారు. అదే సమయంలో నాకు పెళ్లి వ్యవస్థపై నమ్మకం పోయింది.

నా ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి.  ఇద్దరు వ్యక్తుల మధ్య మనశ్శాంతి, తృప్తి ఉండాలి. అయితే అది పెళ్లితోనే సాధ్యం కాదని అర్థమైంది. నాకు కూడా తోడుగా ఉండే భాగస్వామి కావాలి. కానీ ఆ బంధం నిలబడడానికి పెళ్లి అనే ట్యాగ్‌ అవసరం లేదు. ఇద్ధరి మధ్య మంచి అవగాహన, గౌరవం ఉంటే.. సహజీవనం చేయడం బెటర్‌. పెళ్లి చేసుకుని విడిపోవడం కంటే పెళ్లి కంటే ముందే సహజీవనం చేయడమే మంచిది.’ అని ఐశ్వర్య చెప్పుకొచ్చింది.

ఐశ్వర్య లక్ష్మి సినీ కెరీర్‌ విషయానికొస్తే.. ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ అయ్యాక  2017లో నందలవర నాడు నాడ్ ఒరు ఆవాలా సినిమాతో తన సినీ కెరీర్‌ని ప్రారంభించింది. మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం  రోహిత్ కెపి దర్శకత్వంలో వస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాలో సాయి ధరమ్‌ తేజ్‌కి జోడీగా నటిస్తోంది.

Videos

అవమానించారు.. జోకర్ లా చూశారు! మీరు డాక్టర్ కాదు.. కనిపించే దేవుడు

హెచ్-1బీ వీసా కష్టాలు.. కరిగిపోతున్న అమెరికా కలలు

ఖతార్ లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి

రాసలీలలు చేసిన వ్యక్తితో దేవునికి పట్టు వస్త్రాలా?

వెనుక ఉండి నక్కి నక్కి చూస్తున్నాడు.. ఇప్పుడు అర్థమైందా నీ స్థాయి BR నాయుడు..

పెట్రోల్ రేటు పెంపు? చమురు కొరతపై మోదీ రివ్యూ మీటింగ్..

రెచ్చిపోయిన సీఎం రమేష్.. బంజారా హిల్స్ లో భూకబ్జాకు యత్నం

అమెరికా మాపై దాడి చేస్తే మేము భారత్ పై దాడి చేస్తాం: పాక్ మాజీ హై కమీషనర్

సిద్ధమైన న్యూక్లియర్ సబ్ మెరైన్ ఏక్షణమైనా దాడి చేసే ఛాన్స్..

యూట్యూబర్ వైష్ణవి భర్తకు తీవ్ర అస్వస్థత

Photos

+5

పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి (ఫోటోలు)

+5

మోడర్న్‌ లెహంగాలో ముద్దమందారంలా మిల్కీబ్యూటీ.. (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 22-29)

+5

ప్రియుడిని పెళ్లాడిన బిగ్‌బాస్‌ బ్యూటీ పునర్నవి (ఫోటోలు)

+5

సంగీత సంబరం.. ట్రాఫిక్‌ సంకటం (ఫోటోలు)

+5

Ramzan celebrations : హైదరాబాద్ లో ఘనంగా రంజాన్ వేడుకలు (ఫొటోలు)

+5

బుజ్జి అభిమానితో భోజనం చేసిన 'విరోష్‌' జోడీ (ఫోటోలు)

+5

డైరెక్టర్‌గా ‘జబర్దస్త్’ కమెడియన్‌..‘కామాఖ్య’ టీజర్‌ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

వేలాది భక్తుల మధ్య కైరుప్పల పిడకల సంబరం (ఫొటోలు)

+5

వాళ్లు అప్పుడు నాకు సూపర్‌స్టార్స్‌.. ఇప్పుడు నేను (ఫొటోలు)