ఎండలను కంట్రోల్ చేస్తా.. వాట్ ఈజ్ దిస్ విడ్డూరం
Breaking News
మేనకోడలికి ఆమిర్ ఖాన్ శుభాకాంక్షలు
Published on Sun, 03/22/2026 - 09:14
బాలీవుడ్ దర్శక–నిర్మాత మన్సూర్ ఖాన్ కుమార్తె, నటుడు–దర్శక–నిర్మాత ఆమిర్ ఖాన్ మేనకోడలు జైన్ మేరీ ఖాన్ టాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రం ‘డెకాయిట్’. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, జైన్ మేరీ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు.
జైన్ మేరీ ఖాన్ బర్త్ డే (మార్చి 20) సందర్భంగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఆమె ఫస్ట్ లుక్‌ను యూనిట్ రిలీజ్ చేసింది. ఈ లుక్‌ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి, యూనిట్‌కు అభినందనలు తెలిపారు ఆమిర్ ఖాన్. షానియల్ డియో దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. ‘‘లవ్, యాక్షన్, హార్ట్‌బ్రేక్ వంటి అంశాలతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సహ–నిర్మాత: సునీల్ నారంగ్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నేపథ్య సంగీతం: గ్యాని.
Tags : 1