దురంధర్‌-2 రిలీజ్‌.. టాక్సిక్‌ సేఫ్‌.. మరి ఉస్తాద్‌ సంగతేంటి?

Published on Sun, 03/22/2026 - 08:11

సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా దురంధర్‌ పేరే వినిపిస్తోంది. గతేడాది రిలీజైన దురంధర్‌ బాక్సాఫీస్‌ను షేక్ చేయడంతో సీక్వెల్‌గా భారీ హైప్ క్రియేట్ చేసింది. అందుకు తగ్గట్టుగానే మార్చి 19న రిలీజైన దురంధర్‌-2 బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రెండు రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది.  కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్‌సీస్‌లోనూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా నార్త్ అమెరికాలోనూ 3.95 మిలియన్ల ఓపెనింగ్‌ వసూళ్లు సాధించింది. అడ్వాన్స్ ‍బుకింగ్స్‌తో కలిపి ఇప్పటికే 10.5 మిలియన్ డాలర్ల మార్క్‌ దాటేసినట్లు తెలుస్తోంది.  

టాక్సిక్ టీమ్‌ సేఫ్‌.. మరీ ఉస్తాద్ సంగతేంటి?

యశ్ హీరోగా వచ్చిన టాక్సిక్‌ మార్చి 19న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ దురంధర్‌ క్రేజ్ చూసి మేకర్స్ తెలివిగా తప్పుకున్నారు. ఈ లెక్కన చూస్తే టాక్సిక్ టీమ్ చేసిన పని కరెక్టే అనిపిస్తోంది. కానీ తెలుగు హీరో పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ ‍సింగ్‌ మాత్రం బాక్సాఫీస్ పోటీకి దిగింది. దురంధర్‌-2 మానియాకు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయిందన్న విషయం కూడా చాలామంది సినీ ప్రియులకు తెలియడం లేదు. దురంధర్‌ దెబ్బకుఉస్తాద్ భగత్ ‍సింగ్‌ మూవీ కూడా రిలీజ్‌ అయిందా? అని కొంతమంది ఆడియన్స్‌ అడుగుతున్నారు. మరోవైపు చాలా థియేటర్లలో దురంధర్‌-2 మూవీకి టికెట్స్‌ కూడా దొరకడం లేదు. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ థియేటర్లు మాత్రం ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

ఇంత భారీ హైప్‌ ఉన్న మూవీ రిలీజ్‌ అయ్యే సమయంలో ఉస్తాద్‌ భగత్ ‍సింగ్ మేకర్స్‌ కాస్తా ఆలోచించి ఉండాల్సిందనే ఆడియన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా దురంధర్‌-2 బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. గతేడాది డిసెంబర్‌ 5న కేవలం హిందీలో మాత్రమే విడుదలైన ఈ సినిమా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సీక్వెల్ మూవీ క్రేజ్ చూస్తుంటే రూ.2 వేల కోట్ల మార్క్ చేరుకోవడం పక్కా అని తెలుస్తోంది. ఈ చిత్రాలను బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించారు.

 

Videos

ఎండలను కంట్రోల్ చేస్తా.. వాట్ ఈజ్ దిస్ విడ్డూరం

ధురంధర్ 2 తెలుగు వర్షన్ రిలీజ్ ఎప్పుడు? అసలు కారణం ఏంటి?

ఒక్కసారిగా బాంబుల వర్షం.. ఇజ్రాయెల్ లో భయానక పరిస్థితి

ఇదిగో దస్తగిరి స్టేట్మెంట్.. ఈ ఒక్క దానికి సమాధానం చెప్పండి చాలు

శబాష్ జగన్.. ఇది మీకే సాధ్యం.. వైఎస్ జగన్ పై కేంద్రం ప్రశంసలు

BR నాయుడు రాసలీలపై చంద్రబాబు కొత్త డ్రామా

మిత్రపక్షానికి బాబు వెన్నుపోటు.. పవన్ కు ఆహ్వానం లేదు

2 రోజులే టైం.. తర్వాత ఇరాన్ ఉండదు.. ట్రంప్ సంచలన వార్నింగ్

మహిళతో టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావు సంచలన ఆడియో లీక్

విశాఖకు వరంలా మారిన YS జగన్ విజన్

Photos

+5

ప్రియుడిని పెళ్లాడిన బిగ్‌బాస్‌ బ్యూటీ పునర్నవి (ఫోటోలు)

+5

సంగీత సంబరం.. ట్రాఫిక్‌ సంకటం (ఫోటోలు)

+5

Ramzan celebrations : హైదరాబాద్ లో ఘనంగా రంజాన్ వేడుకలు (ఫొటోలు)

+5

బుజ్జి అభిమానితో భోజనం చేసిన 'విరోష్‌' జోడీ (ఫోటోలు)

+5

డైరెక్టర్‌గా ‘జబర్దస్త్’ కమెడియన్‌..‘కామాఖ్య’ టీజర్‌ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

వేలాది భక్తుల మధ్య కైరుప్పల పిడకల సంబరం (ఫొటోలు)

+5

వాళ్లు అప్పుడు నాకు సూపర్‌స్టార్స్‌.. ఇప్పుడు నేను (ఫొటోలు)

+5

గద్దర్ అవార్డ్ వేడుక కోసం అక్కినేని కోడలు ఇలా (ఫొటోలు)

+5

మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్‌- 2025లో మెరిసిన హీరోయిన్లు (ఫోటోలు)