Breaking News

కరెక్ట్‌ పర్సన్‌ దొరికితేనే పెళ్లి.. లేదంటే జీవితాంతం సింగిల్‌గానే!

Published on Sat, 03/21/2026 - 13:10

కొందరు పెళ్లంటేనే ముఖం చాటేస్తారు. అలాంటివారిలో బాలీవుడ్‌ నటి దివ్య దత్తా ఒకరు. 48 ఏళ్ల వయసొచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉండిపోయింది. తాజాగా ఆమె ప్రేమ గురించి తన అభిప్రాయాన్ని చెప్పింది. దివ్య దత్తా మాట్లాడుతూ.. గతంలో నేను రిలేషన్‌షిప్స్‌లో ఉన్నాను.. కానీ, అవేవీ నాకు సరిపోవని అర్థమైంది. మా ఆలోచనలు భిన్నంగా ఉండేవి. 

సింగిల్‌గా ఉన్నానని..
దాంతో ప్రేమికులుగా కంటే స్నేహితులుగానే బాగుంటామనిపించింది. అయితే ఇప్పటికీ నేను సింగిల్‌గా ఉండటం చూసి చాలామంది ఆశ్చర్యపోతుంటారు. జీవితంలో ఓ తోడు లేకుండా ఏం చేస్తున్నావు?, అసలు పెళ్లెందుకు చేసుకోలేదు? అని ప్రశ్నిస్తుంటారు. నా జీవితంలో ఏది ముఖ్యం? ఏది అవసరం అనేది నాకు బాగా తెలుసు.

ప్రశాంతంగా ఉంటా..
నాకు కరెక్ట్‌ అనిపించే వ్యక్తి తారసపడ్డప్పుడు కచ్చితంగా ప్రేమలో పడతాను.. కానీ అలాంటి వ్యక్తి దొరక్కపోతే ఇలా ఎప్పటికీ ఒక్కదాన్నే ప్రశాంతంగా ఉంటాను. అంతేతప్ప ఓ తోడుండాలి కదా అని ఎవరో ఒకర్ని పెళ్లి చేసుకోలేను. నాకు ఈ సమాజ ఆమోదం కన్నా మానసిక ప్రశాంతత, సంతోషమే ముఖ్యం.

సినిమా
పైగా రిలేషన్‌షిప్‌లో ఇద్దరూ జీవితాంతం కలిసుంటారన్న గ్యారెంటీ కూడా లేదు. ఎప్పుడు? ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు అని తెలిపింది. దివ్య దత్తా.. వీర్‌ జార, ఢిల్లీ 6, భాగ్‌ మిల్కా భాగ్‌ , హీరోయిన్‌, బ్లాక్‌మెయిల్‌ వంటి పలు సినిమాలతో గుర్తింపు పొందింది. చివరగా ఛావా మూవీలో యాక్ట్‌ చేసింది.

చదవండి: ధురంధర్‌ 2 ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. తెలుగులో కూడా..

Videos

పెద్ది విడుదల మళ్ళీ వాయిదా? వార్తల్లో నిజమెంత?

యువతకు ముష్టి వేస్తున్నారా? జాబ్ క్యాలెండర్ పై జడ శ్రవణ్ రియాక్షన్

హాట్ టాపిక్ కు అడ్డాగా అమెరికా డొనాల్డ్ ట్రంప్ Vs పోప్

ఏపీలో ఈదురుగాలులతో భారీ వర్షాలు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

వలస కూలీలకు గుడ్ న్యూస్ కమర్షియల్ గ్యాస్ పై కేంద్రం కీలక నిర్ణయం

ఆ పేరు ఎత్తలంటేనే సిగ్గుగా ఉంది BR నాయుడుపై శ్యామల ఫైర్

పేర్ని కిట్టు ప్లెక్సీలపై కూటమి నేతల కడుపు మంట

మా భారతమ్మ పై పడి ఏడుస్తారు కదా ఉగాది వేడుకల్లో మరి మీ భార్యలు ఎక్కడ..?

పెట్రోల్, డీజిల్ కొరత వాహనదారుల అవస్థలు

దాడులను ఖండిస్తూ ఇరాన్ ప్రధానికి మోదీ ఫోన్

Photos

+5

బుజ్జి అభిమానితో భోజనం చేసిన 'విరోష్‌' జోడీ (ఫోటోలు)

+5

డైరెక్టర్‌గా ‘జబర్దస్త్’ కమెడియన్‌..‘కామాఖ్య’ టీజర్‌ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

వేలాది భక్తుల మధ్య కైరుప్పల పిడకల సంబరం (ఫొటోలు)

+5

వాళ్లు అప్పుడు నాకు సూపర్‌స్టార్స్‌.. ఇప్పుడు నేను (ఫొటోలు)

+5

గద్దర్ అవార్డ్ వేడుక కోసం అక్కినేని కోడలు ఇలా (ఫొటోలు)

+5

మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్‌- 2025లో మెరిసిన హీరోయిన్లు (ఫోటోలు)

+5

శ్రీశైలంలో రమణీయంగా రథోత్సవం పులకించిన భక్తులు (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్ అందుకున్న విజేతలు (ఫొటోలు)

+5

అట్టహాసంగా గద్దర్ అవార్డుల వేడుక.. టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)