ఇరుముడిలో అయ్యప్ప భక్తులకు ఇష్టమైన పాట రీమిక్స్‌

Published on Sat, 03/21/2026 - 07:25

భక్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రంతో మెప్పించిన మాస్‌ మహారాజా రవితేజ తర్వాతి సినిమా సెట్స్‌లో బిజీగా ఉన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఇరుముడి’. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తండ్రీ కూతుళ్ల ఎమోషన్‌ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో రవితేజ భార్యగా ప్రియా భవానీ శంకర్, ఆమె కుమార్తె పాత్రలో బేబీ నక్షత్ర నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గురించి ఆయన మాట్లాడారు.

జీవీ ప్రకాశ్‌ కుమార్‌ హీరోగా నటించిన ‘హ్యాపీ రాజ్’ ట్రైలర్ విడుదల కోసం ఆయన హైదరాబాద్‌ వచ్చారు. ఈ క్రమంలోనే ఇరుముడి సినిమా గురించి ప్రశ్నించగా ఆయన పలు విషయాలు పంచుకున్నారు. అయ్యప్ప భక్తులకు ఎంతో ఇష్టమైన  “ఎక్కినాడు పల్లకి” (అయ్యప్ప స్వామిని కీర్తించే గీతం) పాటను రీమిక్స్‌ చేస్తున్నారా అని ప్రశ్నించగా ఆయన ఇలా అన్నారు. ఈ పాటను రీమిక్స్‌ చేయమని ఇప్పటికే చాలామంది తనను అడిగినట్లు జీవీ ప్రకాశ్‌ తెలిపారు. దీంతో తాను కూడా పలుమార్లు ఆ సాంగ్‌ విన్నానని ఆయన  పేర్కొన్నారు. అయితే, తుది నిర్ణయం దర్శకుడు, నిర్మాతలదేనని జీవీ ప్రకాష్‌ తెలిపారు.

ఈ చిత్రంలో రవి తేజ అయ్యప్ప స్వామి భక్తునిగా కనిపించనున్నారు. ఇది భక్తి చిత్రం కాదు, బేబీ నక్షత్ర పోషించిన తన కుమార్తెతో అతనికున్న సంబంధం చుట్టూ అల్లుకున్న ఒక ఎమోషనల్ డ్రామా.  ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో రవితేజ అయ్యప్ప మాలధారణలో కనిపించడంతో భారీ బజ్‌ క్రియేట్‌ అయింది.

Videos

సిగ్గుచేటు.. గరికపాటి గుడ్డు వివాదం

ఆపరేషన్ ముగించే సమయం ఆసన్నమైంది.. ట్రంప్ సంచలన ప్రకటన

రోడ్లపైకి టెస్లా సెమీ ట్రక్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 800 KM

పాలు పితుకుతున్నావా..? గాడిదలు కాస్తున్నావా..?

ప్లాన్ మార్చిన అమెరికా.. ట్రంప్ టార్గెట్ ఏంటంటే?

షర్మిల నీ కొడుకును అలా అన్నందుకు కొంచెం కూడా భాద అనిపించలేదా తల్లి..?

చంద్రబాబు టీటీడీ ల్యాబ్ క్రెడిట్ చోరీ

మరో సంచలన వీడియోతో అరవ శ్రీధర్ బాధితురాలు

షర్మిల భర్త అనిల్ ఆయన చెల్లెళ్ళకు సగం ఆస్తి పంచాడా...?

ముస్లిం సోదరులకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు

Photos

+5

వాళ్లు అప్పుడు నాకు సూపర్‌స్టార్స్‌.. ఇప్పుడు నేను (ఫొటోలు)

+5

గద్దర్ అవార్డ్ వేడుక కోసం అక్కినేని కోడలు ఇలా (ఫొటోలు)

+5

మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్‌- 2025లో మెరిసిన హీరోయిన్లు (ఫోటోలు)

+5

శ్రీశైలంలో రమణీయంగా రథోత్సవం పులకించిన భక్తులు (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్ అందుకున్న విజేతలు (ఫొటోలు)

+5

అట్టహాసంగా గద్దర్ అవార్డుల వేడుక.. టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)

+5

పేరేంట్స్‌గా మాకు గర్వకారణం.. కుమారుడి ఈవెంట్‌లో శివబాలాజీ దంపతులు (ఫొటోలు)

+5

టాలీవుడ్ జంట కిరణ్ అబ్బవరం- రహస్య ఉగాది వేడుకలు (ఫొటోలు)

+5

ఉగాది స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ ఇలా (ఫొటోలు)