Breaking News

పక్క రాష్ట్రం వెనుకంజలో ఉంది: చిరంజీవి

Published on Fri, 03/20/2026 - 07:42

ఉగాది పండుగ నాడు హైదరాబాద్‌ హైటెక్స్‌ వేదికగా ‘తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డు’ల వేడుక వైభవంగా జరిగింది. ఉగాది అనగానే గతంలో చిత్రసీమ సినీ పురస్కారాలు ఘనంగా జరిగేవి. అయితే, పలు కారణాలతో సుమారు 13ఏళ్లుగా ఈ పురస్కారాలకు టాలీవుడ్‌ నోచుకోలేకపోయింది. అయితే, గతేడాది నుంచి సినిమా రంగంలోని ప్రతిభకు పట్టం కడుతూ తెలంగాణ ప్రభుత్వం అవార్డ్స్‌ను అందిస్తూ వస్తుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డిని చిరంజీవి, ఆర్‌.నారాయణమూర్తి ప్రసంశించారు. సినిమా నటీనటులను గుర్తించడంలో  పక్క రాష్ట్రం వెనుకంజలో ఉందని చిరు అన్నారు.

కాంతారావు పురస్కారాన్ని అందుకున్న  ఆర్‌.నారాయణమూర్తి ఇలా అన్నారు.  సినిమా అవార్డ్స్‌ కోసం పదమూడేళ్లపాటు చిత్ర పరిశ్రమ ఎదురు చూసింది. అయితే, సూపర్‌స్టార్‌ కృష్ణ అభిమాని  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవ చూపించి గతేడాది నుంచి మళ్లీ అవార్డ్స్‌ ఇవ్వడం ప్రారంభించారు. తెలుగు సినిమా ఉనికిని గుర్తించి, కళాకారుల్ని  గౌరవించినందుకు నా అభినందనలు.  ఎన్టీఆర్, ఏఎన్ ఆర్‌గార్ల తర్వాత మూడో హీరో కాంతారావుగారు. తెలంగాణ గడ్డ బిడ్డ ఆయన. జానపద హీరో. తెలుగు ఎంజీఆర్‌ ఆయన. ఎలాంటి పాత్ర వేసినా రామారావుగారి తర్వాత మెప్పించిన గొప్ప నటుడాయన. అలాంటి కాంతారావుగారి అవార్డుని నాకు ఇచ్చి, నా జన్మధన్యం చేసిన రేవంత్‌ రెడ్డిగారికి థ్యాంక్స్‌.

'చంద్రబాబునాయుడు గారు... మీకు దండం పెడుతున్నా. మీరు చాలా పెద్దవారు. తెలంగాణలో రేవంత్‌ రెడ్డిగారు దూసుకెళ్లిపోతున్నారు. చిత్ర పరిశ్రమని అభివృద్ధి చేసుకుంటూ, గద్దర్‌ పేరిట అవార్డులు ఇచ్చుకుంటూ... ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆంధ్ర రాష్ట్ర ఉనికిని, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉనికిని గుర్తించి, గౌరవించి మీరు కూడా దయ ఉంచి నంది అవార్డులు ఇవ్వండి సార్‌.. ఇండస్ట్రీని ప్రోత్సహించండి.'  అని ఏపీ ప్రభుత్వం గురించి నారాయణమూర్తి అన్నారు.

పక్క రాష్ట్రం వెనుకంజలో ఉంది: చిరంజీవి
ఎన్టీఆర్‌ జాతీయ అవార్డుగ్రహీత చిరంజీవి ఏపీలో చిత్ర పరిశ్రమ గురించి  ఇలా అన్నారు. 'తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్‌’కి మూలం అయినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిగారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కగారికి, మంత్రి జూపల్లిగారికి అభినందనలు చెబుతున్నాను. ఎక్కడైతే కళాకారులు గౌరవింపబడతారో అక్కడ రాష్ట్రం, దేశం, ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నది నానుడి. ఈ మాటల ఆదర్శంతో ఆగిపోయిన ఈ అవార్డుల పంపిణీకి పునరుజ్జీవం పోసిన రేవంత్‌ రెడ్డిగారికి ధన్యవాదాలు.

పక్కనే ఉన్న మన తెలుగు రాష్ట్రం కళాకారుల పట్ల, సినిమాల పట్ల, వాళ్లని ఉత్సాహపరిచే విధానంలో కొంచెం వెనుకంజలో ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్లకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారు తెలంగాణ అవార్డులను స్ఫూర్తిగా తీసుకుని, మరింత ప్రోత్సహిస్తే కనుక ఎంతో మంది యంగ్‌స్టర్స్‌ మరిన్ని సినిమాలు చేస్తారు. రాష్ట్రానికి సినిమా రెవెన్యూ కూడా సమకూరుతుంది.' అన్నారు

హాలీవుడ్‌ సినిమా అంటే ఎవరికైనా సరే అమెరికానే గుర్తొస్తుందని చిరంజీవి అన్నారు. కానీ,  ఇండియన్  సినిమా అంటే హైదరాబాద్‌–తెలంగాణ గుర్తుకు రావాలనే ముఖ్యోద్దేశంతో రేవంత్‌ రెడ్డిగారు చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి మనందరం చేదోడు వాదోడుగా ఉంటామని, ఇండస్ట్రీ మీవైపు ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నానని సీఎంతో అన్నారు.

Videos

కాంగ్రెస్ సర్కార్ రోజుకో స్కాం అసెంబ్లీలో మొత్తం బయటపెడతా

మాతో పెట్టుకోవద్దు.. పాక్‌కు ఆఫ్ఘన్ ప్లేయర్ వార్నింగ్

అసెంబ్లీలో బడ్జెట్ పై భట్టి స్పీచ్

బడ్జెట్ అంతా డొల్లే కాంగ్రెస్ పై BRS ఎమ్మెల్యేల ఫైర్

చీకు చింత లేని సంసారంలో చిచ్చు.. CI బయటపెట్టిన సంచలన విషయాలు

తినేది పెరుగన్నం నిమ్మకాయ బద్ద ఆస్తులు మాత్రం 20 లక్షల కోట్లు.. శ్రవణ్ షాకింగ్ నిజాలు

Telangana Budget: రూ. 3.24 లక్షల కోట్ల బడ్జెట్ ఏ శాఖకు ఎంతంటే..!

అడ్డుకున్న పోలీసులు ఇచ్చిపడేసిన కాకాణి

వాహనదారులకు షాక్! FASTag వార్షిక పాస్ట్ ధర పెంపు కొత్త రేట్లు ఇవే

అమెరికా ఫైటర్ జెట్ ధ్వంసం.. వీడియో రిలీజ్ చేసిన ఇరాన్

Photos

+5

మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్‌- 2025లో మెరిసిన హీరోయిన్లు (ఫోటోలు)

+5

శ్రీశైలంలో రమణీయంగా రథోత్సవం పులకించిన భక్తులు (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్ అందుకున్న విజేతలు (ఫొటోలు)

+5

అట్టహాసంగా గద్దర్ అవార్డుల వేడుక.. టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)

+5

పేరేంట్స్‌గా మాకు గర్వకారణం.. కుమారుడి ఈవెంట్‌లో శివబాలాజీ దంపతులు (ఫొటోలు)

+5

టాలీవుడ్ జంట కిరణ్ అబ్బవరం- రహస్య ఉగాది వేడుకలు (ఫొటోలు)

+5

ఉగాది స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ ఇలా (ఫొటోలు)

+5

పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో వైఎస్‌ జగన్‌ దంపతులు (ఫొటోలు)

+5

విజయవాడ : సెలవులు, పండుగ వచ్చేసింది.. బస్టాండ్‌లో విద్యార్థులు, ప్రయాణికుల రద్దీ (ఫొటోలు)