ఇంగ్లీష్‌... ఈజీగా!

Published on Fri, 03/20/2026 - 06:18

ఇంగ్లీష్‌ అనేది హిందూ మహాసముద్రమంత పెద్దది. ఎంత నేర్చుకున్నా.... నేర్చుకోవాల్సింది మిగిలే ఉంటుంది. కొద్దిమందికి ఇంగ్లీష్‌ బాగానే అర్థం అవుతుంది. కాని రెండు మూడు వాక్యాలు కూడా ధైర్యంగా మాట్లాడలేరు. కొందరు ఏదో రకంగా ఇంగ్లీష్‌ మాట్లాడతారుగానీ, ఆ భాషకు సంబంధించిన జ్ఞానం అంతంత మాత్రంగా ఉంటుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అర్పిత్‌ మిట్టల్‌ ‘స్పేస్‌ఎక్స్‌.ఏఐ’కి  రూపకల్పన చేశాడు. తొలి అడుగుతోనే ఆదరణను సొంతం చేసుకున్నాడు...

‘స్పేస్‌ఎక్స్‌.ఏఐ’కి రెండు లక్షల సంఖ్యలో మంత్లీ యూజర్‌లు ఉన్నారు. వీరిలో ఎక్కువమంది చిన్న చిన్న పట్టణాలకు చెందినవారే. గూగుల్‌ ప్లేలో ఈ యాప్‌ డౌన్‌లోడ్‌లు కోటి దాటాయి. ‘స్పేస్‌ఎక్స్‌.ఏఐ’ ఫౌండర్‌ హోదాలో దిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌లో పాల్గొన్నాడు అర్పిత్‌.
‘ఎడ్‌టెక్‌ ప్లాట్‌ఫామ్‌లు ఏఐని ఫీచర్‌లా ఉపయోగిస్తున్నాయి. మా ప్లాట్‌ఫామ్‌ విషయానికి వస్తే ఏఐ అనేది యాంత్రికంగా ఉండదు. టీచర్‌లాగే వ్యవహరిస్తుంది’ అంటాడు అర్పిత్‌ మిట్టల్‌.

ప్రాక్టికల్‌గా మాట్లాడేలా...
యాప్‌ ఓపెన్‌ చేయగానే సుదీర్ఘమైన గ్రామర్‌ పాఠాలు వినిపించవు. ఇతరులతో సహజంగా మాట్లాడుతున్నట్లుగానే ఉంటుంది. సంక్లిష్టమైన గ్రామర్‌ పాఠాలతో కాకుండా ప్రాక్టికల్‌గా, సులభంగా ఇంగ్లీష్‌ మాట్లాడేలా చేస్తుంది. ప్రాక్టికల్‌ సిచ్యుయేషన్స్, వర్క్‌ప్లేస్‌ డిస్కషన్స్, కస్టమర్‌ కాల్‌...మొదలైన వాటి ద్వారా ఇంగ్లీష్‌ మాట్లాడడం ప్రాక్టీస్‌ చేయిస్తాం. ఏ రకంగా చూసినా గురువుకు ఏఐ ప్రత్యామ్నాయం కాదు. అయితే ప్రాక్టిస్‌ టైమ్‌పై పరిమితిని తొలగించడం ద్వారా గుడ్‌ టీచింగ్‌కు ఇది సరిౖయెన వేదిక అవుతుంది’ అంటున్నాడు అర్పిత్‌. అందరికి ఒకేలా అని కాకుండా ప్రతి సెషన్‌ పర్సనల్‌ యూజర్‌లకు అనుగుణంగా ఉంటుంది. ఈ లెర్నింగ్‌ యాప్‌ కోర్‌ లాజిక్‌ విషయానికి వస్తే....‘రిపిటీషన్‌ ద్వారా మాట్లాడడం అనేది మెరుగుపడుతుంటే, రిపిటేషన్‌లు కొనసాగనివ్వండి’ 

మరొకటి...
‘ప్రతి లెర్నర్‌కు అపరిమితంగా మాట్లాడే సమయాన్ని ఇవ్వడం ద్వారా ప్రాక్టిస్‌ గ్యాప్‌ లేకుండా చూడడం’

ఏ యాసలో మాట్లాడినా సరే!
→ మన దేశంలో ఇంగ్లీష్‌ నేర్చుకునేవారు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. రెండు మూడు మాటలు ఇంగ్లీష్‌లో మాట్లాడలేని వారి నుంచి, అనర్గళంగా మాట్లాడుతూ కొత్త విషయాలు నేర్చుకోవాలనుకునే వారు ఇందులో ఉన్నారు. ఈ నేపథ్యంలో అభ్యాసకుల స్థాయికి అనుగుణంగా మా జనరేటివ్‌ ఏఐ తనను తాను సర్దుబాటు చేసుకుంటుంది. శ్రద్ధగా నేర్చుకునేలా చేస్తుంది. వారు మాట్లాడే విధానం, ఉచ్చారణ, ఉపయోగించే పదాలు...మొదలైన వాటిని విశ్లేషిస్తుంది. ఉదాహరణకు... ఒక లెర్నర్‌ ప్రాథమిక వాక్యాలను సులభంగా చెప్పగలుగుతుంటే కొత్త పదాలు, జాతీయాలను ఉపయోగించి సంక్లిష్టమైన వాక్యాలు రాయడానికి ప్రయత్నించమని ఏఐ వారికి సలహా ఇస్తుంది. మన దేశంలో అనేక రకాల యాసలు ఉన్నాయి. అవి ఒకే రాష్ట్రంలో కూడా విభిన్నంగా ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుండి సేకరించిన నిజమైన స్వరాలతో సిస్టమ్‌కు శిక్షణ ఇచ్చాం. దీనివల్ల లెర్నర్స్‌ పంజాబీ, బెంగాలీ, తమిళం, మరాఠీ... ఏ యాసలో మాట్లాడినా సరే, అది అర్థం చేసుకొని కచ్చితమైన ఫీడ్‌బ్యాక్‌ను అందిస్తుంది.

→ పది మిలియన్‌ల డౌన్‌లోడ్‌ల స్థాయికి చేరుకోవడం రాత్రికి రాత్రి జరగలేదు. ఒకే ఒక్క చానెల్‌ ద్వారా సాధ్యపడలేదు. దీని వెనుక ఎంతో కృషి ఉంది. ఇంగ్లీష్‌ నేర్చుకోవడానికి సంబంధించి లెర్నర్‌లు ఎదుర్కొంటున్న సమస్యలను 360 డిగ్రీల కోణంలో అర్థం చేసుకొని, విశ్లేషించుకొని ప్లాట్‌ఫామ్‌కు రూపకల్పన చేశాం. భయంభయంగా కాకుండా ఆత్మవిశ్వాసంతో ఇంగ్లీష్‌ మాట్లాడేలా చేశాం. మన దేశంలో స్పోకెన్‌ ఇంగ్లీష్‌ సాధనాలకు భారీ డిమాండ్‌ ఉంది. అయితే ఎంత ఎక్కువమందికి చేరువ అవుతామనేదే అసలు సిసలు విజయం. మౌత్‌టాక్‌ మా విజయానికి ప్రధాన కారణం.

→ మేము కేవలం కొన్ని భాషలను నేర్పించడానికో లేదా ప్రజలను ఇంటర్నేషనల్‌ ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ టెస్టింగ్‌ సిస్టం కోసం సిద్ధం చేయడానికో ప్రయత్నించడం లేదు. నిజజీవిత సంభాషణలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఉదాహరణకు ఆఫీసులో మేనేజర్‌తో ఎలా మాట్లాడాలి, డాక్టర్‌కు అనారోగ్య లక్షణాలను ఎలా వివరించాలి, ఇంటర్వ్యూలలో ఆత్మవిశ్వాసంతో తమను తాము ఎలా పరిచయం చేసుకోవాలి...మొదలైనవి. నిజజీవిత సందర్భాలను దృష్టిలో పెట్టుకొని పాఠాలను డిజైన్‌ చేయడం వల్ల లెర్నర్‌లు తమకు అలవాటైన వాతావరణంలో ఉన్నట్లు భావిస్తారు. దీంతో వారు ఉత్సాహంగా, వేగంగా నేర్చుకుంటారు.

– అర్పిత్‌ మిట్టల్, ఫౌండర్, స్పేస్‌ఎక్స్‌.ఏఐ

Videos

మీరు ఎంత అడ్డుకున్నా.. అది జరగినివ్వం బాబుపై నిప్పులు చెరిగిన కాకాణి

తెలంగాణ అసెంబ్లీలో పాము కలకలం

అమెరికా భయానక దాడులు.. ఇరాన్ కు భారీ నష్టం?

ట్రంప్ VS నెతన్యాహు.. యుద్ధంలో విభేదాలా?

అమ్మకంలో కూడా తగ్గని క్రేజ్... RCB టీమ్ కొత్త ఓనర్ ఎవరంటే..?

Film Awards 2025: చిరంజీవి పవర్ ఫుల్ స్పీచ్

మా తమ్ముడు YSRCPనే.. మా నాన్నకు YSR అంటే పిచ్చి..

కూటమి కుట్రలను ఛేదిస్తూ..! పిన్నెల్లి విడుదల

నితిన్ గడ్కరీని కలిసిన రోజా, మిథున్ రెడ్డి

బాక్సాఫిస్ ను బద్దలు కొడుతున్న ధురంధర్ 2

Photos

+5

గద్దర్‌ అవార్డ్స్‌- 2025లో మెరిసిన హీరోయిన్లు (ఫోటోలు)

+5

శ్రీశైలంలో రమణీయంగా రథోత్సవం పులకించిన భక్తులు (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్ అందుకున్న విజేతలు (ఫొటోలు)

+5

అట్టహాసంగా గద్దర్ అవార్డుల వేడుక.. టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)

+5

పేరేంట్స్‌గా మాకు గర్వకారణం.. కుమారుడి ఈవెంట్‌లో శివబాలాజీ దంపతులు (ఫొటోలు)

+5

టాలీవుడ్ జంట కిరణ్ అబ్బవరం- రహస్య ఉగాది వేడుకలు (ఫొటోలు)

+5

ఉగాది స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ ఇలా (ఫొటోలు)

+5

పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో వైఎస్‌ జగన్‌ దంపతులు (ఫొటోలు)

+5

విజయవాడ : సెలవులు, పండుగ వచ్చేసింది.. బస్టాండ్‌లో విద్యార్థులు, ప్రయాణికుల రద్దీ (ఫొటోలు)

+5

శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు.. కనుల పండువగా ప్రభోత్సవం (ఫొటోలు)