మంగ్లీ సాంగ్ పై కేంద్రం సీరియస్
Breaking News
వాళ్లు చెప్పిందే నమ్మా.. ఇలా చేస్తారనుకోలేదు
Published on Thu, 03/19/2026 - 08:54
గత కొన్నిరోజులుగా 'సర్కే చునారియా' అనే పాట ఎంతలా వివాదాస్పదమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బూతు సాహిత్యం మరీ దారుణంగా ఉండేసరికి కేంద్రం కూడా దీనిపై రియాక్ట్ అయింది. దీంతో పాటని యూట్యూబ్ నుంచి తొలగించారు. సింగర్ మంగ్లీ కూడా క్షమాపణలు చెప్పింది. ఈ గీతంలో డ్యాన్స్ చేసిన నోరా ఫతేహి ఇప్పుడీ వివాదంపై మాట్లాడింది. తన అనుమతి లేకుండానే ఇదంతా చేశారని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసింది.
(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'కి అల్లు అర్జున్ రివ్యూ.. ఏమన్నాడంటే?)
'ఈ పాటని మూడేళ్ల క్రితం కన్నడలో షూటింగ్ చేశారు. తర్వాత ఎలా మార్చారో నాకు తెలియదు. ఓ పెద్ద మూవీ కావడం, సంజయ్ దత్ లాంటి స్టార్ ఉండేసరికి ప్రాజెక్ట్ ఒప్పుకొన్నాను. నిజానికి ఇది 'నాయక్ నహీ ఖల్నాయక్ హో మెయిన్' పాట రీమేక్ అనుకున్నాను. కన్నడ లిరిక్స్ అర్థం కాకపోవడం వల్ల వాళ్లు చెప్పిందే నమ్మాను. అందులో ఏం అసభ్యత అనిపించలేదు. కానీ హిందీలో డబ్ చేయడానికి నా దగ్గర ఎలాంటి అనుమతి తీసుకోలేదు. అసలు ఇది నా దృష్టికే రాలేదు'
'పాట లాంచ్ ఈవెంట్లోనూ నాకు ఇబ్బందికర అనుభవాలు ఎదురయ్యాయి. లిరికల్ వీడియోలో ఏ మాత్రం బాగోలేని ఫొటోలు, నాతో పాటు సంజయ్ దత్‌కి సంబంధించిన ఏఐ ఫొటోని ఉపయోగించేసరికి చాలా చిరాకేసింది. అయినా నిగ్రహంగా ఉన్నాను. హిందీ వెర్షన్ చూసిన తర్వాత ఇది కచ్చితంగా విమర్శల పాలవుతుందని ఊహించాను. ఈ విషయం దర్శకుడికి చెప్పి ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నాను. ప్రజల విమర్శల కారణంగానే మేకర్స్ పాట తొలగించారు. ఇందుకు కృతజ్ఞతలు. ఇకపై నేను మరింత జాగ్రత్తగా ఉంటాను' అని నోరా ఫతేహి చెప్పుకొచ్చింది.
కన్నడ హీరో ధ్రువ్ సర్జా హీరోగా నటించిన 'కేడీ' మూవీలోనిది ఈ పాట. దాదాపు మూడేళ్లకు పైగా సెట్స్‌లో ఉన్న ఈ చిత్రానికి ప్రేమ్ దర్శకుడు. సంజయ్ దత్, శిల్పా శెట్టి లాంటి బాలీవుడ్ స్టార్స్ ఇందులో నటించారు. రీసెంట్గా మొదటి పాటగా దీన్ని రిలీజ్ చేస్తే ఇంతలా వివాదాస్పదమైంది.
(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్విటర్ రివ్యూ.. సహనానికి పరీక్ష)
Nora Fatehi clarified she had no involvement in the controversial Hindi song, saying it used her image without permission. #NoraFatehi #Bollywood #Dhurandhar2 pic.twitter.com/f7y5LVto9q
— Global Affairs 24 (@GlobalAffair24) March 18, 2026
Tags : 1