Breaking News

ఆ సినిమాలన్నీ ఫ్లాప్‌.. లాభమే లేదు: విజయ్‌ సేతుపతి

Published on Sun, 03/15/2026 - 17:29

సినిమాలు తీయడమంటే ఆషామాషీ కాదు. ఏమాత్రం తేడా వచ్చినా బాక్సాఫీస్‌ వద్ద వైఫల్యం మూటగట్టుకోవడం తథ్యం. దీనివల్ల ఎక్కువ నష్టపోయేది నిర్మాతలే.. కొడితే కుంభస్థలాన్ని కొడతారు.. లేదంటేనేమో తీవ్ర నష్టాలు చూస్తారు. అలా తాను నిర్మాతగా తెరకెక్కించిన సినిమాలేవీ బాక్సాఫీస్‌ వద్ద వర్కవుట్‌ కాలేదంటున్నాడు తమిళ స్టార్‌ నటుడు విజయ్‌ సేతుపతి.

ఆ నాలుగు ఫ్లాప్‌
తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ.. నా బ్యానర్‌లో సంగుతేవన్‌ అనే సినిమా స్టార్ట్‌ చేశాను. కానీ, అది మధ్యలోనే ఆగిపోయింది. దానివల్ల రూ.1.75 కోట్ల నష్టం వాటిల్లింది. ఆ తర్వాత నాలుగు సినిమాలు తీశాను. అవే.. ఆరెంజ్‌ మిఠాయి, మేకు తొడర్చి మలై, జుంగ, లాభం. వీటిలో ఒక్కటి కూడా నాకు లాభాల్ని తెచ్చిపెట్టలేదు. కనీసం పెట్టిన పెట్టుబడి వెనక్కు తీసుకురావడంలో కూడా విఫలమయ్యాయి. 

సినిమా
బాక్సాఫీస్‌ లెక్కలపరంగా అవి ఫ్లాప్‌ అయినప్పటికీ నాకు మాత్రం ఆ సినిమాలన్నీ ఇష్టం. కాబట్టి వాటిని నిర్మించినందుకు నేనేం బాధపడటం లేదు అన్నాడు. ప్రస్తుతం విజయ్‌ సేతుపతి నటుడిగా సినిమాలతో బిజీగా ఉన్నాడు. తమిళంలో మిస్కిన్‌ దర్శకత్వంలో ట్రైన్‌ మూవీ చేస్తున్నాడు. తెలుగులో పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో స్లమ్‌డాగ్‌: 33 టెంపుల్‌ రోడ్‌ చేస్తున్నాడు. ఇది కాకుండా పాకెట్‌ నోవెల్‌, జైలర్‌ 2, అరసన్‌తో పాటు మణిరత్నం మూవీ ఒకటి ఆయన చేతిలో ఉన్నాయి.

చదవండి:  నాగార్జున వల్లే నా కూతురు సినిమాల్లోకి: ప్రియదర్శన్‌

Videos

పెద్ద తలకాయలు ఎంట్రీ.. పుట్టా మహేష్ కు నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు

రైతుకు CI బెదిరింపులు.. ఎక్కడా భయపడని రైతన్న.. ఆడియో కాల్ లీక్

డ్రాగన్ పై దురంధర్ ఎఫెక్ట్..!

ఇంత నోరేసుకొని అరవడం కాదు.. అనితను ఏకిపారేసిన రాచమల్లు

పుట్టా మహేష్ డ్రగ్స్ కేసు.. తండ్రి కొడుకులకి ఇచ్చిపడేసిన కన్నబాబు

నువ్వు ఎంపీనా? డ్రగ్స్ డీలరా? టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ పై విజయ్ రాజు ఫైర్

ఇజ్రాయెల్ పై మరోసారి దాడి.. నేలకూలిన భారీ భవనాలు

నెల్లూరు జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న జనసేన నేతలు

మద్ది శ్రీనివాస్ రాసలీలలు.. భార్య సంచలన నిజాలు

డ్రగ్స్ కేసు నుండి తప్పించేందుకు రంగంలోకి పెద్ద తలకాయలు

Photos

+5

ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)

+5

కుల్దీప్‌ యాదవ్‌ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ అందాలు (ఫోటోలు)

+5

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్‌ పోస్ట్‌ (ఫొటోలు)

+5

అల్లు సినిమాస్‌ ప్రత్యేకతలివే.. (ఫోటోలు)

+5

కూకట్‌పల్లిలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి (ఫొటోలు)

+5

ఖమ్మంలో సందడి చేసిన హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)

+5

‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌, బన్నీ (ఫోటోలు)

+5

అర్జున్‌ టెండుల్కర్‌- సానియా సంగీత్‌.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)