Breaking News

అదే అసలైన కాన్ఫిడెన్స్..!

Published on Mon, 03/16/2026 - 07:10

కాన్ఫిడెన్స్ అంటే ఎదుటివారిని డామినేట్ చేయడం లేదా గట్టిగా అరవడమని చాలామంది అనుకుంటుంటారు. కానీ సైకాలజీలో కాన్ఫిడెన్స్ అంటే "నేను గొప్పవాడిని" అని అరుచుకోవడం కాదు, "నేను దేనినైనా ఎదుర్కోగలను" అని మనసులో ఉండే 'Self-Efficacy' (ఆత్మసామర్థ్యం). దీనికి గర్వానికి (Arrogance) మధ్య ఉన్న తేడాను గుర్తించడమే అసలైన వ్యక్తిత్వ వికాసం. అసలైన కాన్ఫిడెన్స్ ఒక 'నిశ్శబ్ద బలం' (Silent Strength).

1. Albert Bandura సిద్ధాంతం

కాన్ఫిడెన్స్ అనేది ఒక పుట్టినప్పుడు వచ్చే లక్షణం కాదు. ఆల్బర్ట్ బాండూరా అనే సైకాలజిస్ట్ దీనిని 'Self-Efficacy' అని పిలిచారు. దీనికి నాలుగు మూలస్తంభాలు ఉన్నాయి.

Mastery Experiences: మీరు ఒక పనిని పదే పదే చేసి, అందులో నైపుణ్యం సంపాదించినప్పుడు వచ్చే నమ్మకం.

Vicarious Experiences: మీలాంటి వారే ఒక పనిని సాధించడం చూసి, "అతనే సాధించగలిగినప్పుడు నేను ఎందుకు సాధించలేను?" అని అనుకోవడం.

Social Persuasion: మీపై నమ్మకం ఉన్నవారు మిమ్మల్ని ప్రోత్సహించడం.

Physiological States: మీ శరీరంలోని ఒత్తిడిని, ఉత్సాహాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది.

2. గర్వానికి, కాన్ఫిడెన్స్ కి తేడా ఏంటి?

Arrogance (గర్వం): "నేను అందరికంటే తోపు, నేను ఎప్పుడూ తప్పు చేయను." ఇది భయాన్ని దాచుకోవడానికి వేసే ముసుగు.

Confidence (ఆత్మవిశ్వాసం): "నేను తప్పు చేయవచ్చు, కానీ ఆ తప్పు నుండి నేర్చుకుని మళ్ళీ లేవగలను." ఇది వాస్తవాన్ని ఒప్పుకునే ధైర్యం.

కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తికి తన బలహీనతలు తెలుసు, అందుకే అతను ఇతరుల విమర్శలకు భయపడడు. గర్వం ఉన్న వ్యక్తికి తన బలహీనతలు తెలిస్తే భయం, అందుకే అతను ఇతరుల మీద అరుస్తాడు.

3. నిజమైన కాన్ఫిడెన్స్

మోటివేషన్ ట్రైనర్లు "నువ్వు అద్దంలో చూసి నిన్ను నువ్వు పొగుడుకో, నువ్వు గెలుస్తావు" అని చెప్తారు. ఇది కేవలం పైన పూసే రంగు. కానీ సైకాలజీ ప్రకారం కాన్ఫిడెన్స్ రావాలంటే 'కాంపిటెన్స్' (నైపుణ్యం) ఉండాలి (Competence-based Confidence).  మీరు ఒక పనిని కష్టపడి నేర్చుకుని, అందులో ప్రావీణ్యం సంపాదిస్తే.. ఆటోమేటిక్‌గా మీలో కాన్ఫిడెన్స్ పుడుతుంది.

4. కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయడం ఎలా?

Genius Matrix ఫిలాసఫీ ప్రకారం మూడు అంచెల్లో ఆత్మవిశ్వాసాన్ని ఎలా పొందాలో చూద్దాం.

Step 1: అభద్రతా భావాన్ని బ్రేక్ చేయండి

ముందుగా I am not enough అనే అభద్రతా భావాన్ని బ్రేక్ చేయండి. మీరు ఎవరితోనూ పోటీ పడనవసరం లేదు, మీ నిన్నటి వెర్షన్ తో మాత్రమే పోటీ పడండి.

Step 2: చిన్న చిన్న విజయాలు

ఒక రోజులో మీరు అనుకున్న పనిని పూర్తి చేయండి. ఆ చిన్న 'విజయం' మీ సబ్-కాన్షియస్ మైండ్‌కి మీరు నమ్మదగ్గ వ్యక్తి అని చెప్తుంది. ఇలా రోజురోజుకూ మీ కాన్ఫిడెన్స్ మజిల్‌ని Build చేయండి.

Step 3: నిశ్శబ్ద విజేత

మీరు స్టేజ్ ఎక్కనవసరం లేదు, అరవనవసరం లేదు.. మీ నడకలో, మీ కళ్ళలో, మీ మాటల్లో ఆ బలం కనిపిస్తుంది. ఎదుటివారికి మీరు ఒక 'ముప్పు'గా కాకుండా, ఒక 'ప్రేరణ'గా కనిపిస్తారు. ఇదే 'Beyond' స్టేజ్.

5. మీ కాన్ఫిడెన్స్ రిపోర్ట్

ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.

మీరు ఎప్పుడు, ఏ పని చేస్తున్నప్పుడు ఎక్కువగా కాన్ఫిడెంట్‌గా ఫీలవుతారు?  

మీలో ఉన్న ఒక బలహీనతను మీరు గర్వంగా ఒప్పుకోగలరా?

ఇతరుల విమర్శలు మిమ్మల్ని ఇంకా కదిలిస్తున్నాయా?

కాన్ఫిడెన్స్ ఒక ప్రయాణం!

బ్రో, కాన్ఫిడెన్స్ అనేది ఒక రోజులో రాదు. ఇది ఒక ప్రయాణం. మీ నైపుణ్యాలను పెంచుకోండి, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, మీ గాయాలను హీల్ చేసుకోండి.. అప్పుడు కాన్ఫిడెన్స్ దానంతట అదే ఒక నీడలా మిమ్మల్ని అనుసరిస్తుంది.

"Confidence is silent. Insecurities are loud."

సైకాలజిస్ట్ విశేష్ 
Genius Matrix Hub 
8019 000066
www.psyvisesh.com

(చదవండి: సమయాన్ని గౌరవిస్తే మిమ్మల్ని మీరు గౌరవించుకున్నట్టే..)

Videos

కీచక డాక్టర్ కి బడితపూజ.. చెప్పులతో దేహశుద్ధి చేసిన మహిళలు

బాబు, పవన్ ఫోటోలు లేవని.. బీజేపీ ఫ్లెక్సీలు చింపేసిన టీడీపీ నేతలు

చంద్రబాబు అరెస్ట్.. రమణ రియాక్షన్.. KSR దిమ్మతిరిగే కౌంటర్

గ్యాస్ సిలిండర్ పై కేంద్రం కీలక ప్రకటన రెండున్నర రోజుల్లోనే డెలివరీ

చేపల వేటకు వెళ్లి.. మూసీలో మునిగిన ముగ్గురు యువకులు

నాని & వెంకీ మూవీ ఫిక్స్..!

పిన్నెల్లి సోదరులను హింసిస్తున్నారు. బాబుపై మిథున్ రెడ్డి హాట్ కామెంట్స్

చంద్రబాబు, లోకేష్ అంతకు అంత అనుభవిస్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్

ట్రంప్ కు బిగ్ షాక్.. యుద్ధానికి నో చెప్పిన మిత్రదేశాలు

ప్రత్యేక రాష్ట్రం సాధించిన పొట్టి శ్రీరాములుకు జగన్ నివాళులు

Photos

+5

‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

ఘనంగా నమన్‌ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)

+5

OSCARS 2026 : ఆస్కార్‌ విజేతల జాబితా (ఫోటోలు)

+5

ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)

+5

కుల్దీప్‌ యాదవ్‌ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ అందాలు (ఫోటోలు)

+5

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్‌ పోస్ట్‌ (ఫొటోలు)

+5

అల్లు సినిమాస్‌ ప్రత్యేకతలివే.. (ఫోటోలు)

+5

కూకట్‌పల్లిలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి (ఫొటోలు)