Breaking News

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పూర్ణ

Published on Sat, 03/14/2026 - 12:30

నటి షామ్నా ఖాసిం అలియాస్‌ పూర్ణ రెండోసారి తల్లయింది. గతేడాది ఆగస్టులో గర్భం దాల్చిన ఆమె మార్చి 14న ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. దేవుడి ఆశీస్సులతో ఈరోజు ఉదయం 4 గంటల 25 నిమిషాలకు పాప పుట్టింది. తను మాకు లభించిన అపురూపమైన కానుక.

సాఫీగా డెలివరీ
ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా డెలివరీ అయినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆస్పత్రి బృందానికి కూడా ధన్యవాదాలు అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు పూర్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా పూర్ణ 2022లో వ్యాపారవేత్త షానిద్‌ అసిఫ్‌ అలీని పెళ్లి చేసుకుంది. ఈ దంపతుల ప్రేమకు గుర్తుగా 2023లో బాబు పుట్టాడు.

సినిమా
పూర్ణ మలయాళ నటి. సీమటపాకాయ్‌, అవును సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది. శ్రీ మహాలక్ష్మి, నువ్వలా నేనిలా, రాజుగారి గది, అఖండ 2 ఇలా పలు చిత్రాల్లో నటించింది. మహేశ్‌బాబు గుంటూరు కారం సినిమాలో 'కుర్చీ మడతపెట్టి..' పాట ప్రారంభంలో కనిపిస్తుంది. తెలుగుతో పాటు మలయాళ, తమిళ, కన్నడ భాషల్లోనూ మూవీస్‌ చేసింది.

 

 

చదవండి: గోటీల ఫ్యాక్టరీ.. స్పందించిన జీవిత

Videos

జాతీయ జెండాతో హార్మోజ్ దాటిన మరో భారత్ గ్యాస్ షిప్..

అమెరికా ఆయిల్ ట్యాంకర్లను పేల్చేసిన ఇరాన్..! షాక్ లో ట్రంప్

వామ్మో... ఏంటి ఈ రేట్లు! 1KG టమాటా రూ.250... 1KG ఉల్లిపాయ రూ.175

పెట్రోలు వెతల సిత్రాలు చూశారా..!

ఇవాళ కూడా బంగారం ధర భారీ పతనం రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..!

జూలో ఫుడ్ పెట్టిన చిన్నారిపై సింహం దాడి..

పేర్ని నాని ఇంటి వద్ద హైటెన్షన్

బాగ్దాద్ పై బాంబుల వర్షం.. US ఎంబసీపై దాడులు

ఇరాన్ యుద్ధం.. బ్యాంకులో నుంచి మీ డబ్బు డ్రా చేసుకోండి...

అనసూయపై అసభ్యకర పోస్టులు.. ఇద్దరు అరెస్ట్

Photos

+5

అల్లు సినిమాస్‌ ప్రత్యేకతలివే.. (ఫోటోలు)

+5

కూకట్‌పల్లిలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి (ఫొటోలు)

+5

ఖమ్మంలో సందడి చేసిన హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)

+5

‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌, బన్నీ (ఫోటోలు)

+5

అర్జున్‌ టెండుల్కర్‌- సానియా సంగీత్‌.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : పరీక్షలకు టాటా.. ఇక ఇంటి బాట (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఓ షాపింగ్‌ మాల్‌లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్‌ కార్యకలాపాలు (ఫోటోలు)

+5

వాళ్లిద్దరి వల్లే ట్రిప్‌ ఎంతో స్పెషల్‌: మెహరీన్‌ (ఫోటోలు)

+5

తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకల్లో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)