పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో గ్యాస్ మంటలు
Breaking News
ఆశను కోల్పోవద్దు.. విడాకుల తర్వాత హన్సిక
Published on Fri, 03/13/2026 - 12:57
సౌత్ ఇండియా ప్రముఖ నటి హన్సిక మోత్వాని విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 2022లో సోహైల్‌ను పెళ్లి చేసుకున్న ఆమె సుమారు నాలుగేళ్ల తర్వాత విడిపోయారు. అయితే, విడాకుల తర్వాత తొలిసారి సోషల్‌మీడియాలో ఆమె ఒక పోస్ట్ చేసింది. 'చర్ది కలా' ఆల్వేస్ అని పంజాబీ భాషలో కొటేషన్ షేర్ చేసింది. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినప్పటికటీ ధైర్యంగా ముందుకు సాగాలని అర్థం వచ్చేలా తెలిపింది. ఎలాంటి పరిస్థితిలు వచ్చినా సరే ఆశను కోల్పోవద్దని పేర్కొంది.
ప్రముఖ వ్యాపారవేత్త సోహైల్ కతూరియాను రాజస్థాన్‌లో హన్సిక పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్‌గా జరిగింది. సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. అయితే, వివాహం అయిన ఆరు నెలల నుంచే వారిద్దరి మధ్య వబేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో గతేడాది ఆమె వారి పెళ్లి ఫోటోలను ఇన్‌స్టా నుంచి తొలగించడంతో విడాకుల నిజమేనని నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఫైనల్‌గా ఈ ఏడాది మార్చి 11న వారికి విడాకులు కోర్డు మంజూరు చేసింది.
Tags : 1