Breaking News

ఉస్తాద్‌ ఆశలన్నీ ట్రైలర్‌ మీదే.. తేడా వస్తే గల్లంతే

Published on Fri, 03/13/2026 - 11:23

హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌  నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి సంయుక్తంగా నిర్మించారు. అయితే, ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. అదేరోజున ధరంధర్‌-2 కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీంతో రెండు సినిమాల మధ్య గట్టిపోటీ ఏర్పడనుంది. ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ నుంచి ఇప్పటికే భారీగా ప్రమోషన్స్‌ మొదలుపెట్టారు. తాజాగా కాలరే ఎత్తరా... అంటూ సాగే పాటని విడుదల చేశారు.

ధురంధర్‌ స్పీడ్‌
ఇప్పటికే ధరుంధర్‌-2 టికెట్స్‌ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో రికార్డ్స్‌ క్రియేట్‌ చేస్తుంది. దీంతో సరైన ప్లానింగ్‌తో పద్ధతి ప్రకారం చిత్ర యూనిట్‌ ముందుకెళ్తుంది. అయితే, ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ మేకర్స్ ఇప్పటివరకు మూడు పాటలను విడుదల చేశారు. దేఖ్లెంగే సాలా సాంగ్‌ అభిమానులను ఆకట్టుకుంది. సోషల్‌మీడియాలో మంచి స్పందన కూడా వచ్చింది.  అయితే, ఆ తరువాతి రెండు పాటలు  ఆరా ఆఫ్ ఉస్తాద్, కాలరే ఎత్తరా... చుట్టూ హైప్ ఉన్నప్పటికీ అనుకున్నంత రేంజ్‌లో బజ్‌ క్రియేట్‌ చేయడంలో విఫలమయ్యాయి.

ముఖ్యంగా, తాజాగా విడులైన కాలరే ఎత్తరా... పాటలో  పవన్ కల్యాణ్‌ డ్యాన్స్ చూస్తారని హరీష్ శంకర్ పదే పదే సూచించడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సాంగ్‌ మేకింగ్‌ రిఫ్రెషింగ్‌గా ఉన్నప్పటికీ, ఈ పాట చాలా మంది అభిమానులకు ఊహించినంత హైప్‌ని అందించలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మొత్తంమీద, ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ నుంచి  ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ చాలా యావరేజ్‌గా ఉందని అంటున్నారు. ఈ మూవీపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ, బజ్‌ క్రియేట్‌ చేయడంలో విఫలమయ్యారు. ఇక అందరి చూపు మార్చి 14న విడుదల కానున్న ట్రైలర్ మీదనే ఆశలు ఉన్నాయి. సినిమాలో బలమైన కంటెంట్‌తో పాటు భారీ యాక్షన్‌ సీన్స్‌ ఉన్నాయని తెలిపేలా ట్రైలర్‌ కట్‌ ఉంటేనే సినిమాకు బలం పెరుగుతుంది. ఇప్పుడు అందరి చూపు ట్రైలర్‌పైనే ఉంది. ఇక్కడ కూడా సరైన కంటెంట్‌ లేకుండా విడుదల చేస్తే ఇబ్బందులు తప్పవు. ఆపై ధురంధర్‌-2 వంటి హిట్‌ ప్రాంఛైజ్‌ని తట్టకుని ఉస్తాద్‌ ఎంతమేరకు నిలబడుతాడో చూడాల్సి ఉంది.

ట్రైలర్‌తో తేలిపోతుంది.
తమిళ్‌ హిట్‌ సినిమా తేరి రీమేక్‌గా ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ చిత్రాన్ని తెరకెక్కించారని విమర్శలు ఉన్నాయి. అయితే, దర్శకుడు హరీశ్‌ శంకర్‌  ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అందులో ఎలాంటి నిజంలేదని చెప్పారు. ఉస్తాద్‌ సరికొత్తగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ట్రైలర్‌ విడుదల కానున్నడంతో అసలు విషయం ఏంటి అనేది కూడా తెలిసిపోతుంది. ఒకవేళ తేరి రీమేక్‌ అయితే మాత్రం ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ను ఎవరూ కాపాడలేరనేది వాస్తవం.

Videos

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో గ్యాస్ మంటలు

అమెరికా విమాన వాహక నౌక అబ్రహం లింకన్‌పై ఇరాన్ దాడి

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

క్రిష్ 4 పక్కన పెట్టేసిన హృతిక్.. బాబీతో హాలీవుడ్ రేంజ్ మూవీ కన్ఫర్మ్..?

RRRకి నాటునాటు.. 'వారణాసి'కి లాటిన్ స్టయిల్!

బాబు కేబినెట్ భేటీకి ఆరుగురు మంత్రులు డుమ్మా..

Gold: మళ్లీ పెరిగిన బంగారం ధర... ఒక్క రోజులో జంప్..

తెల్ల చొక్కా.. మాసిపోయిన గడ్డం.. జడ శ్రవణ్ షాకింగ్ నిజాలు..!

అగ్నిగుండంలా పశ్చిమాసియా.. ఇరాన్ పై రెచ్చిపోయిన ఇజ్రాయెల్

సంజూ శాంసన్ రేంజే వేరు భయ్యో.. ఆస్తులు చూస్తే పరేషానే..!

Photos

+5

హైదరాబాద్ : పరీక్షలకు టాటా.. ఇక ఇంటి బాట (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఓ షాపింగ్‌ మాల్‌లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్‌ కార్యకలాపాలు (ఫోటోలు)

+5

వాళ్లిద్దరి వల్లే ట్రిప్‌ ఎంతో స్పెషల్‌: మెహరీన్‌ (ఫోటోలు)

+5

తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకల్లో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య ‘వృషకర్మ’ మూవీ HD వర్కింగ్ స్టిల్స్

+5

అడివి శేష్‌ 'డెకాయిట్‌' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో పశ్చిమాసియా యుద్ధ ప్రభావం..మూతపడుతున్న హోటళ్లు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : రాత్రిపూట చార్మినార్‌ వద్ద రంజాన్‌ సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో వేల్స్‌ మహిళల హాకీ జట్టు సందడి (ఫొటోలు)