Breaking News

అవసరం లేకపోయినా ఐటం సాంగ్స్‌.. చిన్నపిల్లలు కూడా!

Published on Thu, 03/12/2026 - 15:38

సినిమాల్లో ఐటం సాంగ్స్‌ అనేవి సర్వసాధారణమైపోయాయి. కొన్నిసార్లు అవసరం ఉన్నా లేకపోయినా బలవంతంగా చొప్పిస్తున్నారు. అయితే ఆ పాటల్లో మహిళలను చూపించే పద్ధతి మాత్రం అస్సలు బాగోలేదంటోంది సీనియర్‌ నటి షబానా అజ్మీ. ముంబైలో బుధవారం జరిగిన వి ద వుమెన్‌ కార్యక్రమంలో షబానా మాట్లాడుతూ.. ఐటం సాంగ్‌ అనగానే హీరోయిన్‌ శరీర అవయమవాలను ఎలా చూపించాలనేదానిపైనే ఫోకస్‌ చేస్తున్నారు. 

అవసరం లేకపోయినా..
పిచ్చిపిచ్చిగా పెట్టే కెమెరా యాంగిల్స్‌ దర్శకుడి ఉద్దేశాన్ని చెప్పకనే చెప్తున్నాయి. ఈ ఐటం సాంగ్‌లో స్త్రీ స్వీయనియంత్రణ కోల్పోయి పురుషుల చూపుకు లొంగిపోయినట్లుగా చూపిస్తున్నారు. పైగా సినిమా కథకు అవసరం లేకపోయినా ఈ స్పెషల్‌ సాంగ్స్‌ను కావాలని ఇరికిస్తున్నారు.

చిన్నపిల్లలు కూడా..
ఆడవారిని చూపించే విధానమే కాదు, పాట లిరిక్స్‌ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఇటువంటి సాంగ్స్‌ను సమాజం ఆదరించడం కూడా బాధపెడుతోంది. ఏదైనా ఫంక్షన్‌కు వెళ్తే అక్కడ చిన్నపిల్లలు కూడా చోలీ కే పీచే క్యా హై (ఓ ఐటం సాంగ్‌) అంటూ పాడుతున్నారు. అది చూసి అందరూ సరదాగా నవ్వుతున్నారు. 

సినిమా
ఎవరూ ఆ లిరిక్స్‌ అర్థాన్ని పట్టించుకోవట్లేదు, కేవలం ఒక జోష్‌లో పాడేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా షబానా అజ్మీ.. అంకుల్‌, అర్థ్‌, ఖాందార్‌, పార్‌, గాడ్‌ మదర్‌ సినిమాలకుగగానూ ఐదుసార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారం గెల్చుకుంది. ఈమె చివరగా డబ్బా కార్టెల్‌ అనే వెబ్‌ సిరీస్‌లో మెరిసింది.

చదవండి: పవన్‌ కల్యాణ్‌ డూప్‌గా హరీశ్‌ శంకర్‌? డైరెక్టర్‌ ఏమన్నారంటే?

Videos

బెంగళూరులో సిలిండర్ దొంగతనం.. CCTV విజువల్స్ వైరల్

భార్య వేధింపులకు మరో భర్త బలి

ఇన్వెస్టర్లకు డబుల్ ధమాకా.. 100 షేర్లకు 1000 షేర్లు ఫ్రీ..

మెగా పారడైస్ పై బిగ్ అప్ డేట్.. ఎప్పుడు ప్రారంభం?

పాల కోసం ఎగబడ్డ జనం

హైదరాబాద్ లో గ్యాస్ టెన్షన్.. భారీగా పెరిగిన బుకింగ్స్

పచ్చ మీడియా సైలెంట్.. బయటపడ్డ పెంచలయ్య సిఫార్స్ పత్రం

అమెరికాలో కాల్పుల కలకలం

యుద్ధం ముగించాలి.. లేదా..! ట్రంప్ కు రాండ్ పాల్ హెచ్చరిక

జగన్ విలువ ఇప్పుడు తెలుస్తుంది.. YSRCP పేరు వింటేనే బాబుకు గజ గజ

Photos

+5

హైదరాబాద్ : పరీక్షలకు టాటా.. ఇక ఇంటి బాట (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఓ షాపింగ్‌ మాల్‌లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్‌ కార్యకలాపాలు (ఫోటోలు)

+5

వాళ్లిద్దరి వల్లే ట్రిప్‌ ఎంతో స్పెషల్‌: మెహరీన్‌ (ఫోటోలు)

+5

తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకల్లో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య ‘వృషకర్మ’ మూవీ HD వర్కింగ్ స్టిల్స్

+5

అడివి శేష్‌ 'డెకాయిట్‌' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో పశ్చిమాసియా యుద్ధ ప్రభావం..మూతపడుతున్న హోటళ్లు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : రాత్రిపూట చార్మినార్‌ వద్ద రంజాన్‌ సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో వేల్స్‌ మహిళల హాకీ జట్టు సందడి (ఫొటోలు)