గ్యాస్ సిలిండర్లకు ఐఆర్‌సీటీసీ స్వస్తి?

Published on Wed, 03/11/2026 - 13:25

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా భారతీయ రైల్వే వంటశాలలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇరాన్ వేదికగా సాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్త సరఫరా గొలుసును దెబ్బతీయడంతో దేశంలో ఎల్‌పీజీ కొరత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణికులకు ఆహార కొరత రాకుండా ఉండేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) అత్యవసర మార్గదర్శకాలను జారీ చేసింది.

ఐఆర్‌సీటీసీ తాజాగా వెలువరించిన అధికారిక సర్క్యులర్ ప్రకారం, వెస్ట్ జోన్ పరిధిలోని అన్ని స్టాటిక్ క్యాటరింగ్ యూనిట్లు తక్షణమే ప్రత్యామ్నాయ ఇంధన మార్గాల్లోకి మారాలని ఆదేశించింది. ఫుడ్ ప్లాజాలు, రిఫ్రెష్‌మెంట్ రూమ్‌లు, జన్ ఆహార్ కేంద్రాల్లో ఇకపై సాంప్రదాయ ఎల్‌పీజీ సిలిండర్లకు బదులుగా మైక్రోవేవ్ ఓవెన్లు, ఇండక్షన్ స్టవ్‌లు వినియోగించాలని సూచించింది.

అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ‘రెడీ-టు-ఈట్’ ఆహార పదార్థాలను తగినంత పరిమాణంలో నిల్వ ఉంచుకోవాలని ఐఆర్‌సీటీసీ స్పష్టం చేసింది. ‘ప్రయాణికుల సౌకర్యమే మా ప్రధమ ప్రాధాన్యత. అంతర్జాతీయ పరిణామాల వల్ల భవిష్యత్తులో ఆహార సరఫరాకు ఆటంకం కలగకూడదనే ఈ ముందస్తు చర్యలు తీసుకున్నాం’ అని ఐఆర్‌సీటీసీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

సంక్షోభానికి కారణాలు

భారతదేశం తన ఎల్‌పీజీ అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల వల్ల తలెత్తిన సవాళ్లు కింది విధంగా ఉన్నాయి.

  • ఇరాన్ యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ రవాణా చేసే నౌకల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.

  • గ్లోబల్ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడంతో దేశీయంగా వాణిజ్య సిలిండర్ల లభ్యత తగ్గింది.

  • గ్యాస్ సరఫరా నిలిచిపోతే రైల్వే స్టేషన్లలోని అవుట్‌లెట్లు మూతపడే ప్రమాదం ఉందని నిర్వహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముందుచూపుతో..

రైల్వే క్యాటరింగ్ వ్యవస్థను ఆధునీకరించడం ద్వారా ఈ సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకోవాలని ఐఆర్‌సీటీసీ భావిస్తోంది. విద్యుత్ ఆధారిత వంట పద్ధతులు కేవలం గ్యాస్ కొరతను అధిగమించడమే కాకుండా స్టేషన్లలో అగ్ని ప్రమాదాల ముప్పును కూడా తగ్గిస్తాయని కొందరు భావిస్తున్నారు. పరిస్థితిని బట్టి మరిన్ని జోన్లకు ఈ నిబంధనలను వర్తింపజేసే అవకాశం ఉంది. ఎల్‌పీజీ సరఫరా పునరుద్ధరణపై పెట్రోలియం మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతూనే ప్రయాణికులకు నాణ్యమైన భోజనం అందించడంలో రాజీ పడబోమని ఐఆర్‌సీటీసీ భరోసా ఇచ్చింది.

ఇదీ చదవండి: ఐటీ కారిడార్ హాస్టళ్లలో ‘గ్యాస్’ కష్టాలు..

Videos

జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎంపై కాల్పులు

శ్రీవారి పరకామణి వెనుక భారీ కుట్ర.. ఆధారాలతో బయటపెట్టిన YSRCP నాగార్జున యాదవ్

ఉరుసు ఉత్సవాలకు ఆహ్వానం

ఇరాన్ లో స్కూల్ పై దాడి.. ప్రాణాలు కోల్పోయిన పిల్లలు

యుద్ధ భయం.. లిక్విడ్ క్యాష్ దాచుకోవాలా? బ్యాంకులో రూ.40లక్షల కోట్లు మిస్సింగ్..!

యుద్ధం ఆపేస్తా అంటున్న కేఏ పాల్

ఇరాన్ వెనుక రష్యా.. అమెరికా కోసం రంగంలోకి ఉక్రెయిన్

సముద్రంలో కదిలే.. అమెరికా యుద్ధ కోట!

చంద్రబాబు ఉప ప్రధానా! రెండు గంటలు ఎడాపెడా వాయించిన జగన్

రాసలీలలతో అడ్డంగా దొరికిపోయి కన్పించకుండా పోయిన బిఆర్ నాయుడు

Photos

+5

హైదరాబాద్ లో పశ్చిమాసియా యుద్ధ ప్రభావం..మూతపడుతున్న హోటళ్లు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : రాత్రిపూట చార్మినార్‌ వద్ద రంజాన్‌ సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో వేల్స్‌ మహిళల హాకీ జట్టు సందడి (ఫొటోలు)

+5

అంగరంగ వైభవంగా ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఫోన్లు చోరీ.. మూడు కోట్ల విలువైన మొబైల్స్‌ రికవరీ (ఫొటోలు)

+5

'డాటర్ ఆఫ్ వరప్రసాద్ రావు' తెర వెనక ఇలా (ఫొటోలు)

+5

కూతురితో బిగ్‌బాస్ సోనియా హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

విజయ్-రష్మిక మెహందీ సెలబ్రేషన్ ఫొటోలు

+5

బాక్సర్‌లా మారిపోయిన టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్‌తో క్రికెటర్ పృథ్వీషా నిశ్చితార్థం (ఫొటోలు)