11 వ రోజుకు చేరిన యుద్ధం.. అమెరికా మిత్ర పక్షాలపై ఇరాన్ దాడులు
Breaking News
ఓటీటీకి మలయాళ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Published on Tue, 03/10/2026 - 17:05
మలయాళ చిత్రాలకు ఓటీటీలో ఫుల్ డిమాండ్ ఉంటోంది. అక్కడ సూపర్ హిట్ అయినా సినిమాలను డబ్ చేసి అన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తాజాగా మరో మలయాళ హిట్ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన మూవీ పెన్నుమ్ పోరాట్టమ్.
తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ చిత్రం మార్చి 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.
ఈ సినిమాకు రాజేశ్ మాధవన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రాజేశ్ మాధవన్, రైనా రాధాకృష్ణన్, సుభాష్ చంద్రన్ కీలక పాత్రలు పోషించారు. కేరళలోని ఓ గ్రామం చుట్టూ తిరిగే కథాంశంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆ గ్రామంలోని రూల్స్‌ను ఓ యువతి, ఓ కుక్క ఎలా బ్రేక్ చేశారనే కోణంలో సెటైరికల్‌గా తెరకెక్కించారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
Watch Pennum Porattum on Netflix, out 13 March, in Malayalam, Hindi, Tamil, Telugu and Kannada#PennumPorattumOnNetflix@dawn1720 @ArunCThampi22 @stkframes @binugeorgealex@akhilvishnu_vs
— Netflix India South (@Netflix_INSouth) March 10, 2026
Tags : 1