మహేశ్ బాబు మెచ్చిన సినిమా.. 8 నెలల తర్వాత ఓటీటీకి..!

Published on Tue, 03/10/2026 - 16:04

గతేడాది బాలీవుడ్ స్టార్‌ అమిర్ ఖాన్ నటించిన చిత్రం సితారే జమీన్ పర్. ఈ  సినిమా 2025 జూన్ 20న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో జెనీలియా దేశ్‌ముఖ్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు ఆర్‌ఎస్‌ ప్రసన్న దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు. 

అయితే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్‌ చేయనని అమిర్ ఖాన్ అప్పట్లో ప్రకటించారు. ఆ తర్వాత నేరుగా యూట్యూబ్‌లోనే విడుదల చేశారు. రెంట్ పద్ధతిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పట్లో ఓటీటీ రైట్స్ కోసం రూ.120 కోట్లు చెల్లించేందుకు అమెజాన్ ప్రైమ్ ముందుకొచ్చింది. కానీ ఈ బిగ్‌ డీల్‌ను అమిర్ ఖాన్‌ తిరస్కరించారు. ఈ సినిమా కేవలం థియేటర్లలోనే ఆడుతుందని.. ఓటీటీలో విడుదల ఉండదని అమిర్ ఖాన్‌ స్పష్టం చేశారు.

అయితే  తాజాగా అమిర్ ఖాన్‌ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఎట్టకేలకు ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. సోనీ లివ్‌ వేదికగా అందుబాటులోకి రానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.  కాగా.. ఈ చిత్రంలో ఆరోష్‌ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్‌ దేశాయ్, వేదాంత్‌ శర్మ, ఆయుష్‌ భన్సాలీ, ఆశిష్‌ పెండ్సే, రిషి షహానీ, రిషబ్‌జైన్ , నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్‌ వంటి వారు కీలకపాత్రల్లో నటించారు.

మహేశ్ బాబు ప్రశంసలు...

ఈ సినిమాపై సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు ప్రశంసలు కురిపించాడు. సితారే జమీన్‌ పర్‌.. అందరి మనసులు దోచుకుంటోంది. ఈ మూవీ మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. అలాగే చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఈ సినిమా చూశాక కచ్చితంగా చిరునవ్వుతో బయటకు వస్తారు అని సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.
 

 

Videos

11 వ రోజుకు చేరిన యుద్ధం.. అమెరికా మిత్ర పక్షాలపై ఇరాన్ దాడులు

రాష్ట్రాన్ని ముంచేలా చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ భారీ అప్పు

కొత్త సుప్రీం మొజ్జబా ఖమేనీపై రగులుతున్న ఇరాన్

Anantapur: రథం కింద పడి ఐదుగురికి తీవ్ర గాయాలు

అలిగిన చిన్నారికి ఆహ్వానం భోజనానికి ఇంటికి పిలిచిన విజయ్

గుంజీలు తీయమంటే.. ఈ బుడ్డాడు చేసిన పనికి నవ్వాగదు

పోసుకునేవాడు.. నోరు జారిన రాజేంద్ర ప్రసాద్.. తమిళ తంబీలు ఫైర్‌!

టీడీపీ కార్యకర్తల వీరంగం YSRCP కార్యకర్త, మహిళా సిబ్బందిపై దాడి

ఇరాన్ స్కూల్ పై దాడి... దాడి అమెరికా పనేనా?

తీవ్రస్థాయిలో గ్యాస్ కొరత మూతపడుతున్న హోటళ్లు

Photos

+5

అంగరంగ వైభవంగా ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఫోన్లు చోరీ.. మూడు కోట్ల విలువైన మొబైల్స్‌ రికవరీ (ఫొటోలు)

+5

'డాటర్ ఆఫ్ వరప్రసాద్ రావు' తెర వెనక ఇలా (ఫొటోలు)

+5

కూతురితో బిగ్‌బాస్ సోనియా హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

విజయ్-రష్మిక మెహందీ సెలబ్రేషన్ ఫొటోలు

+5

బాక్సర్‌లా మారిపోయిన టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్‌తో క్రికెటర్ పృథ్వీషా నిశ్చితార్థం (ఫొటోలు)

+5

సినిమా ఈవెంట్‌లో మెరిసిన అనన్య నాగల్ల (ఫొటోలు)

+5

విశాఖపట్నంలో వైభవంగా పైడిమాంబ తొలేళ్ల సంబరం (ఫొటోలు)

+5

'లేచింది మహిళా లోకం' మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)