Breaking News

మగాళ్లు మా సినిమా చూడకపోయినా పర్వాలేదు

Published on Mon, 03/09/2026 - 17:11

మంచు లక్ష‍్మీ మైక్ పట్టిందంటే చాలు.. ఏదో ఒకలా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. ఇప్పుడు కూడా అలానే తమ సినిమాని మగాళ్లు చూడకపోయినా పర్లేదని చెప్పి విచిత్రమైన స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఈమెతో పాటు అనన్య నాగళ్ల, హేమ, సుప్రీత, శ్రద్ధాదాస్, హరితేజ తదితరులు ప్రధాన పాత్రలు చేసిన మూవీ 'లేచింది మహిళా లోకం'. ఈనెల 26నే థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే మంచు లక్ష‍్మీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

(ఇదీ చదవండి: 50 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న నటుడు)

'మేం చిన్న సినిమా చేసినా అద్భుతమైన సినిమాలు చేశామనమాట. ఇందులో ఇంతలా కామెడీ చేస్తానని అనుకోలేదు. నేను రెచ్చిపోయాను. కొన్ని డైలాగులు ఉండవని అనుకున్నా కానీ ఉన్నాయి. సీరియస్ సబ్జెక్ట్‌లని కామెడీగా చెబితేనే జనాలు వింటారు. సినిమా రిలీజ్ అయ్యాక నాకు ఉంటుందేమో! మహిళలందరూ తమ తల్లి, నానమ్మ, అమ్మమ్మలతో వచ్చి మా సినిమా చూడండి. మగాళ్లు చూడకపోయినా పర్వాలేదు' అని మంచు లక్ష‍్మీ చెప్పుకొచ్చింది.

అలానే ట్రైలర్‌లో వినిపించిన 'ఫిష్ అండ్ ఫిషర్ మెన్', 'లెట్ దెం నో' అనే డైలాగులు తన ప్రమేయం లేకుండానే సినిమాలో పెట్టేశారని లక్ష‍్మీ క్లారిటీ ఇచ్చింది. ఈ రెండు డైలాగుల్లో ఒకటి మోహన్ బాబుది కాగా రెండోది మంచు విష్ణుది. ఇక ట్రైలర్‌లోని వైల్డ్ ఫైర్ డైలాగ్ గురించి ప్రస్తావించిన ఈమె.. 'పుష్ప 2' రిలీజ్ అవ్వకముందే ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. సుకుమార్ కంటే ఫైర్, వైల్డ్ ఫైర్ డైలాగ్ నేను మొదట ఈ సినిమాలో వాడాను. ప్రస్తుతం సినిమాలు నిర్మించడం మానేశాను. కాబట్టి నా దగ్గరకు కథలు తీసుకురాకండి. యాక్టింగ్ కోసం మాత్రమే సంప్రదించండి అని చెప్పింది. ఒకప్పుడు మీడియా ముందు ఎలా ఉండాలా అని ఆలోచించేదాన్ని? ఇప్పుడు ఎలాంటి విమర్శలను, ట్రోలింగ్‌ని పట్టించుకోవడం లేదని తెలిపింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. మూడు డోంట్ మిస్)

Videos

10 నిమిషాల్లో 12 లక్షల కోట్లు ఆవిరి.... ఈ స్టాక్స్ మీ దగ్గర ఉంటే కొంప కొల్లేరే

పరకామణిలో బంగారం చోరీ కేసు.. BR నాయుడు ఇప్పుడు మాట్లాడు!

మల్లంపేట నుంచి బాచుపల్లి కనెక్టింగ్ పేరుతో రోడ్డు నిర్మాణం

అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఫైట్ అసలు కారణం ఇదే..

టాస్క్ ఫోర్స్ లా ఏర్పడి పని చేద్దాం ఓటర్ల జాబితా సవరణపై సజ్జల కీలక వ్యాఖ్యలు

మీకు 17 వరకు టైం ఇస్తున్న.. జడ శ్రవణ్ వార్నింగ్..

రోగులను గాలికొదిలేసి.. ఐటెం సాంగ్ కు నర్సుల డ్యాన్స్

మాటకు మాట.. రేవంత్ రెడ్డి, కేటీఆర్

టెహ్రాన్‌పై డైరెక్ట్ ఎటాక్ ఇరాన్ గడ్డపై అమెరికా సైన్యం

AP: తిరుమల వెళ్తున్న నెయ్యి ట్యాంకర్ బోల్తా ఇందాపూర్ డైరీదేనా?

Photos

+5

చీరలో పవర్‌‌ఫుల్‌గా హీరోయిన్ ధన్సిక (ఫొటోలు)

+5

సాక్షి మీడియా ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు (ఫొటోలు)

+5

#T20WorldCup2026final : టీమిండియా విక్టరీ మూమెంట్‌‌ హైలైట్స్‌.. (ఫొటోలు)

+5

టీ–20 వరల్డ్‌ కప్‌ : హైదరాబాద్ లో క్రికెట్‌ అభిమానుల సంబరాలు (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా హీరోయిన్ శ్రద్ధాదాస్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్ బ్యూటీ గిరిజా ఓక్ ఫన్నీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

'మృత్యుంజయ్' థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ (ఫొటోలు)

+5

తమిళనాడు డివోషనల్ ట్రిప్‌లో తెలుగు హీరోయిన్ (ఫొటోలు)

+5

ఒకప్పటి హీరోయిన్ మాలశ్రీ ఇంట్లో పెళ్లి సందడి (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ (ఫొటోలు)