10 నిమిషాల్లో 12 లక్షల కోట్లు ఆవిరి.... ఈ స్టాక్స్ మీ దగ్గర ఉంటే కొంప కొల్లేరే
Breaking News
గోరేటి వెంకన్న పాడిన 'సంచారమే' సాంగ్ విన్నారా?
Published on Mon, 03/09/2026 - 16:24
'బేబి' సినిమా జోడీ ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం "ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్". 90's సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సోమవారం నాడు ఈ సినిమా నుంచి సంచారమే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించడంతో పాటు పాట ఆలపించాడు. ప్రజాకవి గోరేటి వెంకన్న కూడా హమ్మింగ్ చేస్తూ మధ్యమధ్యలో లిరిక్స్ అందుకున్నాడు.
గోరేటి వెంకన్న నోట..
వెంకన్న గొంతుక ఈ పాటకు మరింత అందాన్నిచ్చింది. సంచారమే ఎంతో బాగున్నది.. దీనంత ఆనందం ఏమున్నది? అంటూ పాట మొదలవుతుంది. ఊరు నుంచి విదేశాలకు వెళ్లిన సంచారి అనుభవాలను, ఎగ్జయిట్‌మెంట్‌ను పాటలో చూపించారు. ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ విషయానికి వస్తే.. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
చదవండి: అప్ప ట్లో వాష్‌రూమ్స్ కూడా లేవు: బాలీవుడ్ నటి
Tags : 1