Breaking News

50 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న నటుడు

Published on Mon, 03/09/2026 - 16:17

హిందీ సినిమాల్లో విలన్, సహాయ పాత్రలు, హీరోగా చేసిన రణ్‌దీప్ హుడా శుభవార్త చెప్పేశాడు. ఇతడి భార్య లిన్ లైస్రామ్ ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. ఈమె బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలని స్వయంగా రణ్‍‌దీప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో కాబోయే తల్లిదండ్రులకు తోటి సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు.

(ఇదీ చదవండి: తల్లికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్)

2001లో వచ్చిన హిందీ మూవీ 'మన్‌సూన్‌ వెడ్డింగ్‌'తో నటుడిగా పరిచయమైన రణ్‌దీప్ హుడా.. తర్వాత గ్యాంగ్‌స్టర్, జన్నత్ 2, రిస్క్‌, కర్మ ఔర్‌ హోలీ, కాక్‌టైల్‌, జిస్మ్‌ 2, బాంబే టాకీస్‌, కిక్‌, భాఘీ 2, రాధే, మర్డర్ 3 తదతర చిత్రాల్లో నటించి మెప్పించాడు. రీసెంట్ టైంలో అయితే వీర్​ సావర్కర్ మూవీలో హీరోగా, జాట్ చిత్రంలో విలన్‌గా అలరించాడు.

అసలు విషయానికొస్తే.. 2023లో ప్రియురాలు లిన్ లైస్రామ్‌ని మణిపురి సంప్రదాయంలో రణ్‌దీప్ పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఇతడి వయసు 47 ఏళ్లు. ఇప్పుడు మూడేళ్ల తర్వాత అంటే 50 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నాడు. గత నెలలోనే లిన్‌కి సీమంతం జరిగింది. ఆ ఫొటోలని లిన్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. మూడు డోంట్ మిస్)

Videos

10 నిమిషాల్లో 12 లక్షల కోట్లు ఆవిరి.... ఈ స్టాక్స్ మీ దగ్గర ఉంటే కొంప కొల్లేరే

పరకామణిలో బంగారం చోరీ కేసు.. BR నాయుడు ఇప్పుడు మాట్లాడు!

మల్లంపేట నుంచి బాచుపల్లి కనెక్టింగ్ పేరుతో రోడ్డు నిర్మాణం

అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఫైట్ అసలు కారణం ఇదే..

టాస్క్ ఫోర్స్ లా ఏర్పడి పని చేద్దాం ఓటర్ల జాబితా సవరణపై సజ్జల కీలక వ్యాఖ్యలు

మీకు 17 వరకు టైం ఇస్తున్న.. జడ శ్రవణ్ వార్నింగ్..

రోగులను గాలికొదిలేసి.. ఐటెం సాంగ్ కు నర్సుల డ్యాన్స్

మాటకు మాట.. రేవంత్ రెడ్డి, కేటీఆర్

టెహ్రాన్‌పై డైరెక్ట్ ఎటాక్ ఇరాన్ గడ్డపై అమెరికా సైన్యం

AP: తిరుమల వెళ్తున్న నెయ్యి ట్యాంకర్ బోల్తా ఇందాపూర్ డైరీదేనా?

Photos

+5

చీరలో పవర్‌‌ఫుల్‌గా హీరోయిన్ ధన్సిక (ఫొటోలు)

+5

సాక్షి మీడియా ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు (ఫొటోలు)

+5

#T20WorldCup2026final : టీమిండియా విక్టరీ మూమెంట్‌‌ హైలైట్స్‌.. (ఫొటోలు)

+5

టీ–20 వరల్డ్‌ కప్‌ : హైదరాబాద్ లో క్రికెట్‌ అభిమానుల సంబరాలు (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా హీరోయిన్ శ్రద్ధాదాస్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్ బ్యూటీ గిరిజా ఓక్ ఫన్నీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

'మృత్యుంజయ్' థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ (ఫొటోలు)

+5

తమిళనాడు డివోషనల్ ట్రిప్‌లో తెలుగు హీరోయిన్ (ఫొటోలు)

+5

ఒకప్పటి హీరోయిన్ మాలశ్రీ ఇంట్లో పెళ్లి సందడి (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ (ఫొటోలు)