Breaking News

పేకమేడల్లా కుప్పకూలిన సూచీలు.. కారణాలు

Published on Mon, 03/09/2026 - 15:46

దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 449 పాయింట్లు నష్టపోయి 24,001 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 1424 పాయింట్లు దిగజారి 77,494 వద్దకు చేరింది.

భారత స్టాక్ మార్కెట్‌లో సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సూచీలు పేకమేడల్లా కూలిపోయాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల సెన్సెక్స్, నిఫ్టీలను పాతాళానికి నెట్టేశాయి. కేవలం ఒక్క రోజులోనే ఇన్వెస్టర్లు దాదాపు ఒకనొక సమయంలో రూ.13 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.

మార్కెట్‌ పతనానికి ప్రధాన కారణాలు

  • గత వారాంతంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్ కాల్పుల విరమణకు నిరాకరించడం, యుద్ధం సుదీర్ఘంగా కొనసాగే సూచనలు కనిపిస్తుండటంతో గ్లోబల్ మార్కెట్లలో రిస్క్ సెంటిమెంట్ పెరిగింది.

  • యుద్ధ భయాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 26% పెరిగింది. భారత్ తన చమురు అవసరాల్లో 85% దిగుమతులపైనే ఆధారపడుతున్న నేపథ్యంలో ఈ ధరల పెరుగుదల ద్రవ్యోల్బణాన్ని పెంచి దేశ ఆర్థిక వ్యవస్థపై భారం మోపుతుందనే ఆందోళన ఇన్వెస్టర్లను కలవరపెట్టింది.

  • డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ 92.33 కనిష్ట స్థాయికి పడిపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం రూపాయిపై ఒత్తిడిని పెంచింది.

  • అమెరికాలో 10 ఏళ్ల బాండ్ యీల్డ్స్ 4.20% స్థాయికి చేరడం, డాలర్ ఇండెక్స్ బలపడటం వల్ల అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి పెట్టుబడులు సురక్షితమైన అమెరికా బాండ్ల వైపు మళ్లుతున్నాయి.

  • వడ్డీ రేట్లు తగ్గుతాయనే ఆశలు ఆవిరి కావడంతో బ్యాంకింగ్ స్టాక్స్ కుదేలయ్యాయి.

ఇదీ చదవండి: ‘చైనాతో చేసిన పొరపాటు భారత్‌తో చేయం’

Videos

10 నిమిషాల్లో 12 లక్షల కోట్లు ఆవిరి.... ఈ స్టాక్స్ మీ దగ్గర ఉంటే కొంప కొల్లేరే

పరకామణిలో బంగారం చోరీ కేసు.. BR నాయుడు ఇప్పుడు మాట్లాడు!

మల్లంపేట నుంచి బాచుపల్లి కనెక్టింగ్ పేరుతో రోడ్డు నిర్మాణం

అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఫైట్ అసలు కారణం ఇదే..

టాస్క్ ఫోర్స్ లా ఏర్పడి పని చేద్దాం ఓటర్ల జాబితా సవరణపై సజ్జల కీలక వ్యాఖ్యలు

మీకు 17 వరకు టైం ఇస్తున్న.. జడ శ్రవణ్ వార్నింగ్..

రోగులను గాలికొదిలేసి.. ఐటెం సాంగ్ కు నర్సుల డ్యాన్స్

మాటకు మాట.. రేవంత్ రెడ్డి, కేటీఆర్

టెహ్రాన్‌పై డైరెక్ట్ ఎటాక్ ఇరాన్ గడ్డపై అమెరికా సైన్యం

AP: తిరుమల వెళ్తున్న నెయ్యి ట్యాంకర్ బోల్తా ఇందాపూర్ డైరీదేనా?

Photos

+5

చీరలో పవర్‌‌ఫుల్‌గా హీరోయిన్ ధన్సిక (ఫొటోలు)

+5

సాక్షి మీడియా ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు (ఫొటోలు)

+5

#T20WorldCup2026final : టీమిండియా విక్టరీ మూమెంట్‌‌ హైలైట్స్‌.. (ఫొటోలు)

+5

టీ–20 వరల్డ్‌ కప్‌ : హైదరాబాద్ లో క్రికెట్‌ అభిమానుల సంబరాలు (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా హీరోయిన్ శ్రద్ధాదాస్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్ బ్యూటీ గిరిజా ఓక్ ఫన్నీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

'మృత్యుంజయ్' థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ (ఫొటోలు)

+5

తమిళనాడు డివోషనల్ ట్రిప్‌లో తెలుగు హీరోయిన్ (ఫొటోలు)

+5

ఒకప్పటి హీరోయిన్ మాలశ్రీ ఇంట్లో పెళ్లి సందడి (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ (ఫొటోలు)