10 నిమిషాల్లో 12 లక్షల కోట్లు ఆవిరి.... ఈ స్టాక్స్ మీ దగ్గర ఉంటే కొంప కొల్లేరే
Breaking News
వసంతాన్ని ఎక్స్‌పీరియెన్స్ చేయాలనుకుంటే.. అక్కడకు వాలిపోవాల్సిందే..!
Published on Mon, 03/09/2026 - 12:24
కొన్ని ప్రదేశాలను కళ్లతో చూస్తాం. కొన్ని ప్రదేశాలను మనసులో అనుభూతి చెందుతాం. అలాంటి ఒక అందమైన ప్రదేశమే జూన్‌లోని క్యోటో. క్యోటోలో వసంతాన్ని ఎక్స్‌పీరియెన్స్ అయితేదానిని జీవితాంతం ఒక మెమోరీగా దాచుకుంటాం. జూన్‌లో ఉన్న క్యోటో అనే ప్రాచీన నగరం మార్చి నుంచి సమ్మర్ ప్రారంభం వరకు ఒక అందమైన రంగుల కథలా మారిపోతుంది. సకూరా లేదా చెర్రీ బ్లాసమ్ చెట్ల గులాబీ పుష్పాలతో విరిసిన సమయంలో వీధులు, చెరువులు, సరస్సులు, ఆలయాలు ఇవన్నీ కలిసి ఒక లైవ్ పెయింటింగ్‌లా అనిపిస్తాయి. ఇక్కడ ప్రయాణం అంటే చెక్‌లిస్ట్ టూరిజం కాదు ఒక స్లో వాక్‌ం ఒక సైలెంట్ ఫీలింగ్.
వసంత వెలుగుల్లో క్యోటో రిథమ్
మార్నింగ్ టైమ్‌లో? లైట్ మిస్ట్ మధ్య నడుస్తే గాలిలో ఒక ఆహ్లాదకరమైన సువానస గుండెల్ని మీటుతుంది. రోడ్ సైడ్‌లో చిన్న చిన్న కేఫేలు ఉదయమే తెరుచుకుంటాయి. సైకిల్‌పై డిసిప్లెన్‌గా స్కూల్‌కు వెళ్లే పిల్లలు కనిపిస్తారు. అలాగే పక్కనే ఓల్డ్ వుడెన్ హౌసెస్ సైలెంట్‌గా గంభీరంగా నగరంలో జరిగే మార్పులను గమనిస్తూ ఉంటాయి.
ఇక్కడ లైఫ్ అంటే వేగం కాదు. ప్రశాంతంగా జీవించాలే వేదంలాంటిది. మధ్యాహ్నం సమయంలో కెనాల్ పక్కనే కూర్చుంటే నీటిపై పడిన చెర్రీ బ్లాసమ్ పెటల్స్ స్లోగా ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఆ సీన్ చూస్తే టైమ్ కూడా స్లో మోషలో నడుస్తున్నట్టు అనిపిస్తుంది. క్యోటోలో సమ్మర్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఈ వసంత కాలంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
లోకల్ ఫీల్ ఇచ్చే ప్రాచీన కల్చర్
క్యోటో అంటే జూన్ కల్చరల్ క్యాపిటల్ లాంటిది. జియాన్ ఏరియాలో సాయంత్రం సమయంలో వాక్ చేస్తే అక్కడి ట్రెడిషనల్ కిమోనో వేసుకున్న అమ్మాయిలు చాలా మంది కనిపిస్తారు. ఓల్డ్ టీ హౌసెస్ నుంచి వచ్చే వార్మ్ లైట్ స్ట్రీట్ మీద పడితే సిటీ ఒక వింటేజ్ సినిమా ఫ్రేమ్‌లో మనం ΄ాత్రధారులం అయినట్టు అనిపిస్తుంది. ఇక్కడ టీ సెర్మనీ అనుభవం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సింపుల్‌గా టీ సర్వ్ చేసే విధానంలో కూడా ఒక డిసిప్లిన్, ఒక గౌరవం ఉంటుంది. లోకల్ మార్కెట్‌లో ఫ్రెష్ ఫ్రూట్స్, హ్యాండ్‌మేడ్ క్రాఫ్ట్సŠ, సీజనల్ స్వీట్స్ లభిస్తాయి. ఇక్కడి ప్రజలు ప్రకతితో మమేకం అయ్యి జీవిస్తారు. అది మీరు బాగా గమనించవచ్చు.
సందర్శనీయ స్థలాలు
క్యోటోలో ప్రయాణం అంటే ప్లేస్ నుంచి ప్లేస్‌కు ట్రావెల్ కాదు. ఫీలింగ్ నుంచి ఫీలింగ్‌కి మూవ్ అవ్వడం లాంటిది.
ఫుషిమీ ఇనారీ తైషా దగ్గర రెడ్ టోరీ గేట్స్ మధ్య నడవటం అంటే ఒక స్పిరిచువల్ టన్నెల్‌లో వెళ్తున్నట్టు ఉంటుంది. ప్రతీ అడుగులో నిశ్శబ్దానికి, ప్రశాంతతకు మరింత చేరువ అవుతున్నట్టు అనిపిస్తుంది.
కింకాకు–జి, అంటే గోల్డెన్ పెవిలియన్. దీని ప్రతిబింబం సరస్సులో కనిపిస్తే వెంటనే ఫోటోలు తీయాలని అనిపిస్తుంది. కానీ అలా చేయకుండా మౌనంగా ఆ నిమిషాన్ని ఎంజాయ్ చేయడమే కరెక్ట్ అని మనసు కూడా చెబుతుంది.
అరాషియామా బాంబూ గ్రోవ్‌లో గాలి తనువుతోపాటు మనసును తాకుతూ వెళ్తుంది. ఆ గాలికి వినిపించే నేచురల్ సౌండ్స్ ఇవన్నీ ఒక మ్యూజికల్ ఎక్స్‌పీరియెన్స్‌లా మిగిలిపోతాయి.
ఫిలాసఫర్స్ పాత్ కెనాల్ పక్కన సకూరా ఛాయలో నడుస్తే ప్రతీ టర్న్‌లో గులాబీ పెటల్స్ పడుతున్న భావన కలుగుతుంది. ఇక్కడ వాక్ పూర్తయ్యాక కూడా ఆ సీన్ మనసులో కొనసాగుతూనే ఉంటుంది.
ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి టోక్యో లేదా ఒసాకాకు కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి. అక్కడి నుంచి ట్రైన్ ద్వారా క్యోటోకి ఈజీగా చేరుకోవచ్చు. జూన్ రైల్వే సిస్టమ్ చాలా స్మూత్‌గా ఉంటుంది కాబట్టి ట్రావెల్ ఎక్స్‌పీరియెన్స్ కూడా జర్నీ భాగంగా అనిపిస్తుంది.
ఎక్కడ ఉండాలి?
సిటీ సెంటర్ దగ్గర్లో ట్రెడిషనల్ ర్యోకన్ స్టైల్ స్టేలు అందుబాటులో ఉంటాయి. సింపుల్ వుడెన్ రూమ్స్, తతామీ మ్యాట్స్, స్లైడింగ్ డోర్స్ ఇలా స్టే కూడా ఒక కల్చరల్ ఎక్స్‌పీరియెన్స్‌లా ఉంటుంది. మోడర్న్ హోటల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కానీ ఓల్డ్ స్టైల్ అకామడేషన్‌లో ఉంటేనే క్యోటో వైబ్ బాగా ఫీల్ అవుతుంది.
ఏం చూడాలి?
ఆలయాలు, చిన్న చిన్న మందిరాలు, కెనాల్ వాక్స్, బాంబూ ఫారెస్ట్, ఈవినింగ్ లాంటర్న్ స్ట్రీట్స్ ఇవన్నీ రష్ లేకుండా స్లోగా చూడాలి. ఇక్కడ బ్యూటీ కేవలం కళ్లకు ఇంపుగానే కాదుం మెమోరీస్‌లో సింక్ అయ్యేలా ఉంటుంది.
ఏం తినాలి?
క్యోటోలో మీరు తప్పకుండా లోకల్ రామెన్ ట్రై చేయండి. దీంతోపాటు మాచా బేస్డ్ స్వీట్స్, తాజా సుషీ, సీజనల్ సకూరా ఫ్లేవర్ ఉన్న డెజర్ట్స్ మిస్ చేయకండి. అలాగే చిన్న స్ట్రీట్ కేఫేలో సింపుల్ టీ తాగితే కూడా ఎక్స్‌పీరియెన్స్ కంప్లీట్ అవుతుంది.
ఎప్పుడు వెళ్లాలి?
క్యోటో వెళ్లేందుకు వసంతమే ఉత్తమ సమయం. మార్చి నుంచి ఏప్రిల్ మధ్యలో సకూరా పీక్ సీజన్ ఉంటుంది. సమ్మర్ ప్రారంభం అవ్వడానికి ముందే వాతావరణం కంఫర్ట్‌గా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ట్రిప్ ప్లాన్ చేయడం మంచిది. సమ్మర్ మొదలయ్యాక కూడా పచ్చదనంతో క్యోటో అందంగా కనిపిస్తుంది.
క్యోటో ప్రయాణం పూర్తయ్యాక ఫోటోల కన్నా మెమోరీస్ ఎక్కువగా మిగులుతాయి. గులాబీ పెటల్స్ పడిన ఆ మూమెంట్స్, బాంబూ సౌండ్స్, ఆలయ గంటల శబ్దాలు ఇవన్నీ కలిసి ఒక పీస్‌ఫుల్ చాప్టర్‌లా మనసులో నిలిచిపోతాయి. ఎందుకంటే క్యోటోలో వసంతం ఒక సీజన్ కాదు. ఆనందానికి ఒక రీజన్ కూడా.
(చదవండి: మిర్చి హోలీ'..రంగు పులుముకున్న పుడమి తల్లి..!: ఆనంద్ మహీంద్రా)
Tags : 1