Breaking News

జిమ్‌ చేద్దాం... ఫిట్‌గా ఉందాం...

Published on Sun, 03/08/2026 - 05:54

పురుషులకే కాదు, మహిళలకూ వ్యాయామం అవసరం. నిజానికి మహిళలకు వ్యాయామం మరింత ముఖ్యం. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే, తర్వాతి తరం ఆరోగ్యంగా ఉంటుంది. మొత్తం సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాయామం చేసినా, చేయకపోయినా యవ్వనంలో సహజంగానే ఆరోగ్యంగా ఉంటాం. వయసు గడిచే కొద్ది కండరాల పటుత్వం సడలిపోతుంది. 

మన శరీరానికి శక్తి కావాలి, కండరాలకు పటుత్వం కావాలి. వయసు మళ్లినా, కండరాల్లో పటుత్వం సడలిపోకుండా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి. తేలికపాటి వ్యాయామాలు మొదలుకొని బరువులు ఎత్తడం లాంటి వ్యాయామాలు చేస్తూ ఉంటే, క్రమంగా శక్తి పెరిగి, కండరాలు పటుత్వాన్ని సంతరించుకుంటాయి. హార్మోన్లలో అసమతుల్యతలు ఉన్నట్లయితే, క్రమంగా అవి ఒక కొలిక్కి వస్తాయి. 

నాకు చిన్నప్పటి నుంచే చదువుతో పాటు క్రీడల్లో ఆసక్తి ఉండేది. స్కూల్‌ రోజుల్లోనే రన్నింగ్, లాంగ్‌ జంప్, హై జంప్‌ వంటి పోటీల్లో బహుమతులు గెలుచుకునేదాన్ని. మా నాన్నగారు నన్ను ప్రోత్సహించేవారు. నా బాల్యమంతా కాకినాడలో జరిగింది. అక్కడే ఏడో తరగతి వరకు చదువుకున్నాను. టెంత్, ఇంటర్, డిగ్రీ రోజుల్లో స్టేట్‌ లెవల్‌కు వెళ్లాను. పెళ్లయిన తర్వాత వైజాగ్‌ వచ్చాను. జిమ్‌ నడపాలని అనుకుంటున్నట్లు మావారికి చెబితే, ప్రోత్సహించారు. వైజాగ్‌లో జిమ్‌ పెట్టడానికి ముందు ఏరోబిక్స్‌లో శిక్షణ తీసుకున్నాను. 

మహిళలు తలచుకుంటే ఏమైనా సాధించగలరు. అయితే, సాధించాలనే తపన ఉండాలి. క్రమశిక్షణ, చేసే పని పట్ల ఏకాగ్రత, అంకితభావం ఉండాలి. మనం ఏ రంగాన్ని ఎంచుకున్నా, ఈ సూత్రాలను తప్పకుండా పాటించాలి. నా దగ్గరకు వచ్చే మహిళల్లో ఎక్కువమంది నెలసరి క్రమం తప్పడం, స్థూలకాయం, హార్మోన్‌ అసమతుల్యతలు, కాన్పుల తర్వాత శరీరతత్త్వంలో మార్పులు వంటి సమస్యలతో బాధపడేవారే ఎక్కువ. ఇలాంటి సమస్యలను అధిగమించడానికి వారి శరీర తత్త్వం తెలుసుకుని, వారి వయసును బట్టి, ఆరోగ్య సమస్యలను బట్టి ఎలాంటి వ్యాయామాలు చేయాలో, ఎలాంటి ఆహారం తీసుకోవాలో వారికి చెబుతుంటాను. చాలామంది మహిళలు ఒకటి రెండు రోజులు జిమ్‌కు వచ్చాక తర్వాత మానేస్తారు. ముందు వాళ్ల మైండ్‌సెట్‌ మార్చాలి. 

ఆరోగ్యం కాపాడుకోవడానికి అతిగా ప్రయాస పడనక్కర్లేదు. మన వంటిల్లే ఔషధాలయం. వంటింట్లో తరచుగా వాడుకునే దినుసులతోనే చాలావరకు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. జీలకర్ర, మిరియాలు, మెంతులు, దాల్చినచెక్క, లవంగాలు, కరివేపాకు, కొత్తిమీర, ఉసిరి, గుమ్మడి గింజలు, కర్బూజా గింజలు, చియా విత్తనాలు వంటివి శరీరాన్ని డీటాక్స్‌ చేసుకోవడానికి బాగా ఉప కరిస్తాయి. 

ఫిట్‌నెస్‌ నిపుణురాలిగా ఈ సమాజం నాకు ఒక స్థానాన్ని ఇచ్చింది. సమాజానికి నేను తిరిగి ఇవ్వగలిగేది నా విద్యను మాత్రమే! నాకు తెలిసిన విద్య హెల్త్‌ అండ్‌ ఫిట్‌నెస్‌. నా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో ప్రతిరోజూ తప్పనిసరిగా ఒక ఫిట్‌నెస్‌ రీల్‌ పెడతాను. నాకు దాదాపు ఎనభైవేల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఇంట్లోనే ఉంటూ మహిళలు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునేందుకు ఉపయోగపడే వ్యాయామాలు, చిట్కాలతో పాటు వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు తగిన రెసిపీస్‌ కూడా పెడుతుంటాను. 

పగటిపూట వేళకు తినడం, రాత్రివేళ త్వరగా భోజనం ముగించడం, రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. కూల్‌డ్రింక్స్, మద్యం, పొగతాగడం వంటివి మానుకుని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, తగిన వ్యాయామం చేస్తూ ఉన్నట్లయితే చిరకాలం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. 

ఫిట్‌నెస్‌ అంటే ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ మాత్రమే కాదు, జిమ్‌లో వ్యాయామాలు చేయడం మాత్రమే కాదు. మనిషికి ఫిట్‌నెస్‌ నాలుగు రకాలుగా ఉండాలి. ఫిజికల్, మెంటల్, ఫైనాన్షియల్, స్పిరిచ్యువల్‌ ఫిట్‌నెస్‌ ఉంటేనే మనిషి సంపూర్ణంగా ఫిట్‌గా ఉన్నట్లు. 

-అను ప్రసాద్‌ , హెల్త్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ మోటివేటర్‌

#

Tags : 1

Videos

ఆడియో నాయుడు.. వీడియో నాయుడు.. బాబు, BR నాయుడు పై రోజా సెటైర్లు

నల్గొండలో కారు బీభత్సం.. షాకింగ్ వీడియో

గౌతమ్ గంభీర్ సరికొత్త చరిత్ర

గోల్డ్ మార్కెట్ లో భారీ ట్విస్ట్.. ఒక్కరోజులోనే అమాంతం పెరిగిన బంగారం ధరలు..

దుబాయ్ పై ఇరాన్ బాంబుల వర్షం.. బుర్జ్ ఖలీఫా ఎలా ఉందంటే

నెయ్యి ధరల పెంపు.. టీటీడీ నిధుల దోపిడీ?

మహిళల ఫొటోలు తీసి.. మంగళగిరిలో టీడీపీ కార్యకర్త అరాచకాలు

ఆటలు, పాటలు, డాన్సులు.. హోమ్ మంత్రి పదవి తప్ప అన్ని చేస్తున్నావ్

చరిత్ర సృష్టించిన భారత్

మహిళలకు మోసం? బాబు డ్రామాలపై జగన్ ఫైర్!

Photos

+5

#T20WorldCup2026final : టీమిండియా విక్టరీ మూమెంట్‌‌ హైలైట్స్‌.. (ఫొటోలు)

+5

టీ–20 వరల్డ్‌ కప్‌ : హైదరాబాద్ లో క్రికెట్‌ అభిమానుల సంబరాలు (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా హీరోయిన్ శ్రద్ధాదాస్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్ బ్యూటీ గిరిజా ఓక్ ఫన్నీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

'మృత్యుంజయ్' థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ (ఫొటోలు)

+5

తమిళనాడు డివోషనల్ ట్రిప్‌లో తెలుగు హీరోయిన్ (ఫొటోలు)

+5

ఒకప్పటి హీరోయిన్ మాలశ్రీ ఇంట్లో పెళ్లి సందడి (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ (ఫొటోలు)

+5

రెండో శ్రీశైలంగా పిలిచే శివాలయం మన హైదరాబాద్‌లో ఎక్కడుందో తెలుసా? (ఫొటోలు)

+5

మేము సాధించాం.. పతకం వచ్చింది (ఫొటోలు)